భగవద్గీతా సూక్తులు (1)( విద్యార్థులకు ) 232

ఆగస్ట్ 13, 2010

భగవద్గీతా సూక్తులు కొన్నైనా తెలియనివారు భారతీయులే కారు !
వేమన సూక్తులు కొన్నైనా తెలియనివారు తెలుగువారే కారు !
Primary / Upper Primary School విద్యార్థుల గ్రహణ శక్తిని
దృష్టిలో నుంచుకొని, గీతాహృదయం స్ఫురించేలా, వారికి జీవితాంతం
గుర్తుకు వస్తూండేలా, కంఠస్థ యోగ్యమైన 232 one-line
quotations ను సేకరించి, విషయానుక్రమంలో అందిస్తున్నాం. ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయండి.

భగవద్గీతా సూక్తులు (1) ( విద్యార్థులకు )

శ్లోకసంఖ్యలను కూడ ఇవ్వటం జరిగింది కాబట్టి, వీటి భావాన్ని ఏ చిన్న
గీతాపుస్తకంలోనుండి అయినాగ్రహించే వీలుంది. అయినా,
వీలువెంబడి తాత్పర్యమును కూడ అందించే ప్రయత్నం చేస్తాము.

ప్రకటనలు

నీవు ఎవరివి?(WHO ARE YOU?)

మే 16, 2010

నీవు ఎవరివి ? ( WHO ARE YOU ? )

పై ప్రశ్నకు, ” నేను ఫలానా ” అని సహజంగా తోచే జవాబును బట్టే
ఒక మనిషి యొక్క దృక్పథం, వ్యక్తిత్వం ఆధారపడి ఉంటాయి.

ఉదాహరణకు: “నేను మగవాడిని, లేక నేను ఆడదానిని” అనే
భావం రూఢిగా ఉన్నవారికి లింగ-వివక్ష ఎక్కువగా ఉండే అవకాశం
ఉంటుంది.

“నేను బ్రాహ్మణుడిని, లేక నేను వైశ్యుడిని, మొ. ” భావం
ప్రథమంగా స్ఫురించేవారికి వర్ణ ( కుల ) వివక్ష ఎక్కువగా ఉండే
అవకాశం ఉంటుంది.

“నేను హిందువును, మహమ్మదీయుడను, లేక క్రైస్తవుడను,మొ.”
భావం ప్రప్రథమంగా బలంగా స్ఫురించేవారికి, పరమత-సహనం
తక్కువగా ఉండే అవకాశాలే ఎక్కువ !

“నేను ఆంధ్రుడిని, లేక నేను బెంగాలీని, మొ.”
అనే భావం మొదట బలంగా స్ఫురించే వారికి భాషా, రాష్ట్ర-వివక్ష
ఎక్కువగా ఉంటుంది. వీరికి అఖిల భారత స్థాయి పదవీబాధ్యతలు
అప్పగించినా సరే, ప్రాంతీయ భేదభావనతో, ప్రాంతీయ-అసమానత
లనే పెంచుతారు; భారతమాతకు క్షోభనే కలిగిస్తారు !

కాబట్టి, ” నీవు ఎవరివి ?” అని ప్రశ్నిస్తే వెంటనే స్ఫురించవలసిన
ఆదర్శవంతమైన జవాబు ఈపాటికే మీకు స్ఫురించి ఉంటుంది !

********************************************************

“నేను భారతీయ – ఆంధ్ర – హిందూ – తెలుగు – (కుల) – బాలుడను
/ బాలికను; నా పేరు …”

” I am a Bharatiya, Andhra, Hindu, Telugu, (Caste),
Boy / Girl , by Name: ..” .

“భారత సంస్కృతి వారసులం, అందుకు ఎంతో గర్విద్దాం;
భారతమాతే మనలను చూసీ, గర్వపడేలా జీవిద్దాం ! ”

******************************************************

అని భావించే నిత్య – అభ్యాసం విద్యార్థి దశనుంచీ చేస్తే,
వారి దృక్పథం ఎంత విశాలంగానూ, ఎంత శాంతియుత-సహజీవన
దోహదకరంగానూ ఉంటుందో ఒక్కసారి ఊహించండి !

Then, they will be naturally inclined to keep :

Nation’s interests above State’s;
State’s interests above Religion’s;
Religion’s interests above Language’s;
Language’s interests above Caste’s;
Caste’s interests above Family’s;
Family’s interests above Gender’s;
Other Gender’s interests above Self’s !

BHAARAT ( INDIA ) NEEDS SUCH
HUMAN-RESOURCES, which are your wards –
Our Dear PARENTS and TEACHERS !

Won’t you contribute, what is within your reach,
to Mother Bhaarat, to whom all of us owe a lot more?!

(NOTE : Please click on the title ” kamthasthabharathi”
at the top of this Post, to get a full view of the side-bar.
Then, in the side-bar, you may click on any related
topic of your interest.)

హితోపదేశం నీతి సూక్తులు ( సంస్కృతం ) – 200

అక్టోబర్ 12, 2009

పంచతంత్ర కథలతో శ్రీ నారాయణ పండితుడు సంస్కృతంలో రచించిన ” హితోపదేశం ” గ్రంథం ఒక అద్భుత నీతిశాస్త్రం ! మధురమైన శైలిలోనున్న నీతికావ్యం ! సమస్త భారతీయ నీతిసార సంగ్రహం !

ప్రస్తుతానికి, మిత్రలాభము ( 1 & 2 అధ్యాయాలు ) నుండి పిల్లలకు కంఠస్థయోగ్యమైన 200 సూక్తులను ఎంపిక చేసి,మీ ముందు ఉంచుతున్నాం. ఇదివరకే ఇదే బ్లాగులోనే అందించిన వేమన సూక్తులు, భగవద్గీతా సూక్తుల తరువాత ఈ హితోపదేశ సూక్తులను కూడ పిల్లలకు ” రోజుకో సూక్తి ” పద్ధతిలో నేర్పిస్తే, వారియొక్క దృక్పథం ( Outlook ), శీలం ( Character ), వ్యవహారజ్ఞత ( Behavioural Aspects ) విషయాలలో మంచి పరిజ్ఞానంతోబాటుగా, భారతీయ సంస్కృతియొక్క పూర్తి పరిచయంకూడ కలిగితీరుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. మాతృభాషతో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది కూడా.
వీలు వెంబడి వీటి భావం తెలుగులోగాని, ఇంగ్లీషులోగాని అందిస్తాము.
ఈ నీతి సూక్తులను చూడటానికి ఇలా చేయండి:

Please click on the title ” KAMTHASTHA BHARATHI ” at the top of this Post, to get a full view of the side-bar. Then click on the page ” Hitopadesm Niti Suktulu ” in the side-bar. You have so many other Pages also on related topics useful for School Children ! BEST OF LUCK !

ఇప్పటికే మారినవి ; ఎప్పటికీ మారనివి !

జనవరి 9, 2009
 
* ఈ ఆధునిక కాలంలో”, ” ఈ రోజులలో ” ఆ పాత కాలపు ఆలోచనలేం పనికి వస్తాయి?-
అంటూంటారు. నిజానికి కాలంతోపాటు మారేవి కొన్నే;   మారనివే చాలా ఉన్నాయి:-
ఆకాశం, తారకలు, సూర్యచంద్రులు, గ్రహాలు, భూమాత, సముద్రకెరటాలు, పర్వతాలు, 
మంచు-నీరు, వృక్షజాలం, అరణ్యాలు, జలచరజాలం, పక్షిజాలం, జంతుజాలం, … 
ఇవేవీ మారటం లేదు!
*ఇక మానవజాతి విషయం:  జనన మరణాలు, సృష్టిధర్మం, మాతృత్వపు త్యాగం అనుపమ 
మమత,తండ్రియొక్క బీజప్రదత్వం , అహంకార మమకారాలు, మనస్సు సుఖాన్ని 
కోరుకోవటం, దుఃఖాన్ని వద్దనుకోవటం, కోరినది దొరికి తృప్తి కలిగేవరకు తాపత్రయపడటం, 
సుఖశాంతుల కోసం నిరంతర అన్వేషణ, రాగద్వేషాలు, కామక్రోధాలు, లోభమోహాలు, 
మదమాత్సర్యాలు, సంతానం అభ్యున్నతికై ఆరాటపోరాటాలు, సంకుచిత స్వార్థపర 
మనస్తత్వాలు, శరీర నిర్మాణం పని తీరు, స్త్రీపురుష విభేదంలో హార్మోన్ల పాత్ర,….
ఇవేవీ మారలేదు గదా!
* మరి ఈరోజులలో మారుతున్నవేమిటి?
ఆశలు, ఆశయాలు పెరుగుతున్నాయి; పోటీ తత్వం విపరీతంగా పెరుగుతోంది.
స్వలాభాపేక్షతో అత్యధిక జనాన్ని ఆకర్షించటం కొరకు ప్రలోభకరమైన, అసత్య అర్థసత్యాలతో 
కూడిన, అభ్యంతరకరమైన, విలువలకు తిలోదకాలిచ్చే, మభ్యపెట్టే వాణిజ్య ప్రకటనలు 
గుప్పించే వ్యాపారవర్గాల అధార్మికత పెరుగుతోంది. ఆకర్షణలకు లోబడటం, ఎప్పుడు 
ఎక్కడ ఆకర్షణీయ అవకాశాలుంటే అందరూ అటే పరుగులు పెట్టటం పెరుగుతోంది .
(ఉదా): ఒక పడవలో నున్న అత్యధిక జనం ఒక అంచుకే పరుగులు పెడితే
ఏం జరుగుతుంది?  పడవ తలక్రిందులు కావటం తప్ప !
(ఉదా): రోడ్ల మీద నున్న జనం అంతా ఎవరి తొందర, వీలు వారు చూసుకుంటే,
ఆ వూరి ట్రాఫిక్ సజావుగా సాగటంలో తమవంతు బాధ్యతను నిర్వర్తించక పోతే, 
జరిగేది ఏమిటి?- ప్రమాదాలో, ట్రాఫిక్ జాంలో! అందరికీ మరింత ఆలస్యం తప్పనిసరి!
* మరి తగ్గుతున్నవి యేమిటి? – వివేకం, విచక్షణాజ్ఞానం తగ్గుతున్నాయి; మీడియాలో 
ప్రకటనకర్తలకు అనుకూలమైన వార్తలూ, శాస్త్రీయ సాంప్రదాయిక విజ్ఞానానికి వ్యతిరేకమైన 
వ్యాసాలే వస్తున్నాయి. సరియైన మార్గదర్శనం చేసేవారు కరువౌతున్నారు. చేసినా,
అర్థం చేసికోగల పూర్వ సంస్కారం  గలవారు మరీ అరుదుగా ఉన్నారు.
* విద్యార్థి దశలో పడవలసిన సాంస్కృతిక, నైతిక పునాదులు పడక పోవటం వల్లనే
కదా ఈ దుఃస్థితి అంతా!
(ఉదా): చిన్నప్పుడు ఎక్కాలు బట్టీ పట్టిన విద్యార్థికి లెక్కలు చేయటంలో సౌలభ్యం 
జీవితాంతం ఉంటుంది గదా!
అలాగే స్కూలు దశలో- న్యాయం, ధర్మం,సఛ్ఛీలం, సత్ ప్రవర్తన,నైతికత, సమాజ సేవ, 
దేశభక్తి మొ|| సూక్తులు కంఠస్థం చేయిస్తే, వాటి భావం వివరిస్తే –
అట్టి పిల్లలు అవి చదవనివారి కంటే మంచి వ్యక్తులు, పౌరులు కారా?
(ఉదా): ” సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడు పడవోయ్!”
లాంటి పద్యపాదం భావంతో సహా నేర్చుకున్న పిల్లలలో, అది చదవని వారిలోకన్నా
స్వార్థం తగ్గి, సహాయతాగుణం ఎంతోకొంత పెరిగే అవకాశం(chance, probability) 
తప్పనిసరిగా ఉంటుందా ఉండదా?
* ఈ పని ఎవరు చేయాలి? ప్రభుత్వం పాఠ్యప్రణాళికలో చేరిస్తే, సమస్యే లేదు!
ప్రభుత్వమేమో రాజకీయ నాయకులతో నిండి ఉంటుంది. వారేమో తలకు మించిన
రాజకీయ సమస్యలతో సతమతమవుతూ ఉంటారు! గత ఎన్నికలలో పెట్టిన పెట్టుబడిని 
లాభంతో సహా రాబట్టాలి; రాబోయే ఎన్నికల పెట్టుబడి కోసం ఇప్పుడే సంపాదించాలి; 
ప్రతిపక్షాల ఎత్తులకు పైయెత్తులు వేస్తూ ప్రజలను మభ్యపెడుతూ, స్వోత్కర్ష- పరనిందలతో
నిరంతరం అప్రమత్తంగా ఉండాలి; తమ శక్తి యుక్తులు, సమయం వీటికే సరిపోవు!
ఇంక అంగబలం, అర్థబలం, అవినీతిబలం, తామసం ఉన్న బలవంతులనుండి
అవేవీ లేని బలహీనుల ప్రయొజనాలను కాపాడటం అనే  ప్రభుత్వ ప్రాథమిక ధర్మమును, 
బాధ్యతలను నిర్వర్తించే దెప్పుడు?  మరి ప్రభుత్వం చేపట్టక పోతే యేం చెయ్యాలి? 
* ఎవరికి తప్పినా , తల్లిదండ్రులకు తప్పదు గదా!
 ఉందిగా ” ప్రైవేటు ” మంత్రం! స్కూలు యాజమాన్యం వారు భౌతిక సౌకర్యాల కల్పనలో 
ఏకొంచెం లోపం చేసినా, “పేరెంట్స్ మీట్”లో విరుచుకుపడే పేరెంట్స్ చాలామందే ఉన్నారు.
అదే – వ్యక్తిత్వ వికాసానికి, కుటుంబ సౌఖ్యానికి, సామరస్యపూర్వక 
శాంతియుత సామాజిక సహజీవనానికి, దేశాభ్యుదయానికి, అత్యవసరమైన 
నైతిక బొధనలో ఎంత అశ్రద్ధ చూపించినా- పట్టించుకోరు.
ఎంతటి నిద్రాణ స్థితి !
* తమ పిల్లలకు ఇది అవసరం అని తెలిశాక, తామయినా చెప్పాలి, స్కూలువారినైనా 
అడగాలి, లేదా Cultural Supplement ని ట్యూషనుగా అయినా చెప్పించాలి, లేదా 
తల్లిదండ్రులలో(తాతబామ్మలలో) ఒకరైనానేర్పించాలి. మరో మార్గం ఉందేమో చెప్పండి!
* ” మాకు చెప్పాలనే ఉంది; కాని యేమి చెప్పాలి, యెలా చెప్పాలి, యే వరసలో చెప్పాలి? “ 
అనే సంశయం వద్దు. మా kamthasthabharathi.wordpress.com లో ఈ విషయాలు
పొందుపరచటం  చాలావరకు అయింది, కొనసాగుతోంది కూడా !
* మన మాతృభాష ” తెలుగు ” లొ నేర్పిస్తే, ఒకే చర్యకు రెండు ఫలితాలూ ! – 
అటు సాంస్కృతిక నైతిక విలువలూ అబ్బుతాయి; ఇటు మాతృభాషతో దూరమూ పెరగదు!
* మొదటగా, ” వేమన సూక్తులు – 1,2 ” తో ప్రారంభించమని మా అనుభవపూర్వక సలహా !
* శుభారంభం అగుగాక !

పోతన భాగవత సారం – 1వ స్కంధం

నవంబర్ 27, 2008

ఈ బ్లాగును ప్రారంభించి ఒక సంవత్సరం నిండింది. తెలుగులో ప్రార్థనా పద్యాలలో అత్యంత ఉన్నత శ్రేణికి చెందినది – గజేంద్రమోక్షం లోని ” ఎవ్వనిచే జనించు ” అనే పద్యం. ఈ బ్లాగులోని ’ పోతన భాగవతం ” అనే పేజీలొ ఆ ఒక్క పద్యాన్నేప్రచురించాము. అన్ని పేజీలలోకీ ఈ పేజీకే వీక్షకులు ఎక్కువమంది వచ్చారు. గత ఏడాదిగా వీరంతా ఎంతో ఆశగా పేజీని తెరిచి చాలా నిరాశకు గురి అయి ఉంటారు. ఇది తలచుకుంటే అపరాధ భావన (guilty conscience ) కలుగుతోంది.

      దీనికి పరిహారంగా, పోతన భాగవథం – 1వ స్కంధం మొత్తం పరిశీలించి, పిల్లల నుంచీ పెద్దలదాకా ( భక్తి, జ్ఞాన మార్గాలలొ తీవ్ర సాధకులను మినహాయించి ) ఉపయోగ పడతాయని అనిపించిన పద్య, పద్యపాద, వచన సూక్తులను సేకరించాము. వాటిని మా విషయానుక్రమణిక ప్రకారం ఒక వరుసలో అమర్చాము.

స్కూలు విద్యార్థి స్థాయి వరకు తెలియ దగినవి ఈ ” కంఠస్థభారతి ” లో ఇస్తున్నాము. ఆ పై స్థాయి వ్యక్తులు ఆస్వాదించ దగినవి అనుబంధ బ్లాగు ” తెలుగుభారతి ” లో పొందు పర్చాము.

            పోతన పద్య మధుర మకరందాలను ఆస్వాదించండి; ముఖ్యంగా, ఇంకా మీ చేతిలోనే ఉన్న పిల్లలకు వాటిని రుచి చూపించండి!

  NOTE :

      (1) Please click on the title  KAMTHASTHA BHARATHI  at the top of this Post , to get a full view

of the side-bar. Then you may click on the page ” SRIMAD BHAGAVATAM ( Bammera Potana ) ” , to

get the text of Potana’s poems collected. You may also click on the required page-name in the side-

bar,  for any other related topics of interest to you.

      (2) Please click on the NAME ” TELUGU BHARATHI ” in the Blog – Roll in the side-bar of this

blog.   Then click on the page పోతన భాగవతం to view the second ( higher ) part.

       (3) OR, you may directly visit the website ” telugubharathi.wordpress.com “