శివానంద లహరి – ౨౧వ శ్లోకము, తాత్పర్యము.

(శివానంద లహరి-21) – శ్రీ శంకరాచార్య విరచితము.
ధృతిస్తమ్భాధారాం దృఢగుణ-నిబద్ధాం సగమనాం
     విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస-సన్మార్గ ఘటితామ్ |
స్మరారే ! మ చ్చేతః-స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం
     జయ స్వామిన్ ! శక్త్యా సహ శివ – గణైః సేవిత విభో || (౨౧)
ఓ మన్మథవిజేతా! శివగణములచే సేవింపబడు ప్రభూ ! నా చిత్తము –  ధైర్యమనే స్తంభములను ఆధారముగా కలిగినదియును; సుగుణములనే గట్టి త్రాళ్ళతో కట్టబడినదియును; చలించునదియును; విచిత్రమైనదియును; కమలములతో నిండినదియును; ప్రతిరోజూ సన్మార్గమునకు మళ్ళింపబడునదియునై యున్నది. నా చిత్తమనే యీ విశదమైన స్పష్టమైన పటకుటీరంలోనికి శక్తి (అంబ)తో సహా ప్రవేశించి, జయము నందుము స్వామీ ! 

టాగులు: , ,

ఒక స్పందన to “శివానంద లహరి – ౨౧వ శ్లోకము, తాత్పర్యము.”

  1. rathnam Says:

    నిన్ను నువ్వు తెలుసుకోవడం ఒక్కటే మార్గం. సమస్తం నీలోనే ఉందనే సత్యం వైపు అడుగులు పడాలి. అది నిజజ్ఞానాన్ని పొందేందుకు తోడ్పడుతుంది. నీలో మాన వుడు అతి శక్తివంతుడు. ఆ శక్తివంతుడైన మానవుడిని నీవు గుర్తించగలిగితే మరి వేటితోటి పని లేదు. దీనికి ఏ గురువులు లేరు. నీకు నీవే గురువు. నీకు నీవే శిష్యుడివి. నిన్ను నీవు తెలుసుకునే మార్గంలో, గుర్తించే మార్గంలో నీ నిశితమైన దృష్టిని నీ లోపలికి సారించాలి. అలా దృష్టిని నీలో నిలిపే క్రమంలో నీ దృష్టి అన్ని వస్తువులపైకి పదే పదే పోతుండవచ్చు. అయితే క్రమక్రమంగా అలవాటు పడుతుంది. దీనికి సాధన అవసరమని ముందే చెప్పుకున్నాము. అట్టి సాధనకు కాలపరిమితి ఆ వ్యక్తుల ఏకా గ్రతనుబట్టి ఉంటుంది. దీన్ని సత్యాన్వేషణగా చెప్పు కోవచ్చు. ఆ సత్యాన్వేషణ నిజ జ్ఞానంవైపు నడిపి స్తుంది. అప్పుడు నీలోని సర్వరుగ్మతలు తొలగి పోయి ఒక సత్య మానవుడిగా వెలుగొందుతాము.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s


%d bloggers like this: