శ్రీ ఆంజనేయ దండక ప్రాశస్త్యం, ప్రయోజనం :

శ్రీరామ

శ్రీ ఆంజనేయ దండక ప్రాశస్త్యం, ప్రయోజనం :

శ్రీ ఆంజనేయ దండకం తెలుగునాట చాలా తరాలనుండి ప్రాచుర్యంలో ఉన్నది.
ఆంజనేయస్వామివారి మహిమ, సుగుణాలు, సాధించిన ఘనకార్యాలు, రక్షణ, అనుగ్రహం
మొ.వన్నీ ఈ దండకంలో పొందుపర్చబడ్డాయి.

ఇందులో సంస్కృత పదాలు పొదగబడటంవల్ల శబ్దశక్తి, మంత్రశక్తి కలిగి ఉంది.
తెలుగుభాషలో క్రియాపదాలు, వాక్యాలు ఉండటంవల్ల- చదువుతూండగానే (వింటూండగానే)
వెంటనే అర్థమవుతూ, భావశక్తి కూడా కలిగి ఉంది. అందువల్లనే ఈ దండకం శ్రద్ధగా
పారాయణ చేసినవారికి కోరిన కోర్కెలు తీర్చటంలో చాలా ప్రభావశాలిగా ఉన్నది.

భారతదేశంలోని ఏ ప్రాంతంవారికయినా – ఆధ్యాత్మిక, దైవభక్తిక విషయ పరిజ్ఞానం కలగాలన్నా,
సాధనలో పురోగతి కావాలన్నా కూడా – మహర్షుల బోధనలే అధారం ! వారు అందరూ
సంస్కృతభాష (The Most Refined Language ) లోనే రచనలు, బోధనలు చేశారు.
మూలం(Original Work in Original Language )లో చదువుకోగలగటం, ఒక గొప్ప వరం !

అది అందరికీ సాధ్యం అయ్యేది కాదు. కాబట్టి తమ తమ మాతృభాషలలో ఉన్న వ్యాఖ్యానంతో /
అనువాదంతో కలిపి చదువుకోవటం అనేది Next Best !
“యదేవ విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం భవతి ” – అంటే, “అర్థం, భావం తెలుసుకుని చేసిన
సాధనలు ఎక్కువ శక్తిమంతములుగా, ఫలదాయకములుగా ఉంటాయి” అని అర్థం.
మాతృభాషలో చదివిన, విన్న విషయాలు, భావాలు అత్యధిక శాతం అర్థమౌతాయని అందరికీ
తెలిసిన విషయమే గదా !

అలాంటి రచనలు తమ మాతృభాషలో చేయబడియుండనప్పుడు, ఏ ఇతర
భారతీయ భాషలోనైనా పరవా లేదు. ఎందుకంటే, భారతదేశంలో ఉద్భవించిన భాషలు
అన్నింటిలోనూ కూడా, భారతీయాత్మను, సంస్కృతిని దర్శింపజేయగల పదజాలం, సామర్థ్యం
సహజంగానే ఉన్నాయి ! విదేశీ భాషలకు ఆ సౌలభ్యం చాలా తక్కువ.

అందువల్లనే, ఈ దండకం పారాయణ – తులసీదాసకృత హనుమాన్ చాలీసా లోని ప్రతిపద
భావార్థం తెలియనివారు చేసే చాలీసా పారాయణకంటె – ఏమాత్రం తక్కువ కాదు.

ముఖ్యంగా బాలురకు ఈ దండకమును కంఠస్థం చేయిస్తే, కనీసం వారు చదువుకోగలిగిన
పరిస్థితి కలిగించ గలిగితే, ఇక వారికి దైవసంబంధమైన రక్షణ సంపూర్ణంగా కలిగించినట్లే
నిశ్చింతగా ఉండవచ్చును !

ఆదర్శప్రాయమైన సకల సద్గుణాలూ, వ్యక్తిత్వమూ కలిగిన,
భక్తుడూ, దేవుడూ కూడ తానే అయిన,
మహా శక్తిమంతుడయిన హనుమంతుని అనుగ్రహ రక్షణ వలయంలో
మన పిల్లలను ఉంచటంకంటె వారికి మనం చేయగల మహోపకారం ఏముంటుంది ? !

NOTE : Please click on the title ” KAMTHASTHA BHAARATHI” at the top of this Post, to get a full view of the side-bar. Then click on “Sri Anjaneya dandakam” page in the side-bar,
to get a full view of the Text.

టాగులు: , , , ,

4 స్పందనలు to “శ్రీ ఆంజనేయ దండక ప్రాశస్త్యం, ప్రయోజనం :”

 1. rathnamsjcc Says:

  సమాధి

  మాటలకు అతీతంగా ఆత్మ చైతన్యం సూక్ష్మమౌనంలో ఉండాలి దేవునికి భాషలు తెలియవు. కనుక భాష యొక్క అవసరం లేదు. మనం దేవుని సమక్షంలో పూర్తిగా ఆత్మ చైతన్యం సూక్ష్మమౌనంలో ఉండాలి. మహామౌనమే ప్రార్ధనలోని చైతన్యం నిజమైన సౌందర్యం.” ఆత్మ చైతన్యం సూక్ష్మమౌనం ఆధ్యాత్మికంగా ఒక మనిషి ఎదిగాడా లేదా అని ఎలా చెప్పగలం మనిషికి దేహవాసన,లోకవాసన, శాస్త్రవాసన అని మూడు ప్రతిబంధకాలుంటాయి. వీటిని ఎంతగా తగ్గించుకుంటే అంతగా అంతరిక జీవితంలో ముందుకు పోగలుగుతాడు. తన దేహాన్ని, తన చుట్టూ ఉన్న లోకాన్ని, తనదనుకునే జ్ఞానాన్ని మరచిపోగలిగినవాడు నిజంగా మహాత్ముడే. అట్టివాడే ఆత్మజ్ఞుడు.మానవుడికి గల ఆధిపత్యం, అతడు పొందిన ప్రగతికి కారణం, అతడి మనస్సే అయినా, దానిని గురించి అతడికి అజ్ఞానం, మానవుడికి ముక్తిని బాహ్యాం తరంగ ప్రకృతుల బంధాలనుండి విమోచనం మనస్సుద్వారా సార్థకత పొందటం మనస్సును ఏకాగ్రత తో నిలిపినప్పుడు, ఇది ఆత్మ దర్శనమునకు సూటి దారి గురువు

  దారి నిరాకార, నిశ్చల, నిరంజన స్థితి అంటే అదే. ఒక్క క్షణం కనులు తెరిచి చూసాడు. లగ్నంఅవుతుంది. ఒక్క క్షణం కదలకుండా ఉండు” అంటే ఆ క్షణంలోనే ఎక్కడలేని అనవసర విషయాలన్నీ నాకే కావాలి …. మనిషి జీవితానికి ఒక పరమ గమ్యం ఉందని అది ఆత్మ సాక్షాత్కారం అని నమ్ముతాను. ..(దేహమును వదిలే) ఒక్క క్షణంఅంతటా వ్యాపించి వుంది సూక్ష్మము ఆకాశములోకి వెళ్లి … కేవలం చూపులతో ఆత్మ సాక్షాత్కారం కలిగించిన ఈ సకల చరాచర సృష్టిలో ఏ జీవుల మధ్యా బేధం లేదు, … ఇది ఆత్మ దర్శనమునకు సూటి దారి ఆత్మ చైతన్యం ఒక్కటే క్షణం మార్గదర్శనం అవుతుంది. … ఒక్క క్షణంలో దాని రూపమే మారిపోతుంది. ఆ విధంగానే “”నేను” “”నాది” అన్న భావం భస్మం కావాలి. … ఆ దశలో ఆత్మ సాక్షాత్కారం పొందిన జీవికి వేదాలు కూడా అప్రధానములే అవుతాయి. తనను తాను తెలుసు కొన్న మరుక్షణం అతడు ఈ లోకం లో ఒక్క క్షణం కూడా ఉండడు. అందుకే ఆ జ్ఞానాన్ని దాచి …. మనిషి జీవితానికి ఒక పరమ గమ్యం ఉందని అది ఆత్మ సాక్షాత్కారం అని నమ్ముతాను. ఆత్మ సాక్షాత్కారం సద్గురువు కృప వలనే సాధ్యం.భక్తి విశ్వాసాలు, నమ్మకం మాత్రమే ! ఏ మేరకు మనలో భక్తి ప్రవృత్తులు, విశ్వాసాలు చోటు చేసుకుం టాయొ, ఆ మేరకు సద్గురువు అనుగ్రహం అతిగాలభిస్తుంది. ఇది సత్యం. ఆత్మ జ్ఞాని ని. కనుక లోకుల మాటలు పట్టించుకోకుండా మన పని మనం చేయ్యటం ఉత్తమం. మనసా వాచా కర్మణా అని కూడా అంటారు. మనిషికి ఈమూడు స్థితులలోనూ ఏదో ఒక ఆధారం కావాలి. ఆధ్యాత్మికంగా ఒక మనిషి ఎదిగాడా లేదా అని ఎలా చెప్పగలం అని సందేహం ఉండేది.మనిషికి ఎంతగా దేహస్పృహ తగ్గుతుందో అంతగా ఆధ్యాత్మికంగా ఎదిగినట్లు అని నా భావన. మీరేమంటారు?మనిషికి దేహవాసన,లోకవాసన, శాస్త్రవాసన అని మూడు ప్రతిబంధకాలుంటాయి. వీటిని ఎంతగా తగ్గించుకుంటే అంతగా అంతరిక జీవితంలో ముందుకు పోగలుగుతాడు. తన దేహాన్ని, తన చుట్టూ ఉన్న లోకాన్ని, తనదనుకునే జ్ఞానాన్ని మరచిపోగలిగినవాడు నిజంగా మహాత్ముడే. అట్టివాడే ఆత్మజ్ఞుడు.దేవునికి భాషలు తెలియవు. కనుక భాష యొక్క అవసరం లేదు. మనం దేవుని సమక్షంలో పూర్తిగా మౌనంలో ఉండాలి. మహామౌనమే ప్రార్ధనలోని నిజమైన సౌందర్యం మన అష్టోత్తరాలు సహస్రనామాల పూజలు చూస్తున్నపుడు పూజారి ఇవి చదువుతూ పూజ చేస్తుంటాడు. పూజ మన బాధ్యత కాదు. అది పూజారి బాధ్యత. తీర్ధం తీసుకోడమే మన పని అనుకుంటాము. ఇది పూజ ఎలా అవుతుంది? మనం కొట్టే కొబ్బరికాయకు దేవుడు కరిగిపోవడానికి ఆయన అంత లేనివాడా? పూజారులు, మధ్యవర్తులు అవసరం లేకుండా మనంతట మనం దేవునితో సరాసరి అనుసంధానం కావచ్చు. దానికి మనస్సును ఆపాలి. ఆలోచనలను ఆపాలి. ఇది చెయ్యగలిగితే, మహామౌనంలో ఉండగలిగితే దేవునితో టక్కున అనుసంధానం కలుగుతుంది. మౌనంగా ఉండు ఉండగలిగేవానికి అసలు నామం యొక్క అవసరం లేదు. భావాతీత స్థితి అదే ప్రాప్తిస్తుంది. మనస్సుతో శరణాగతి పాటించడు. అలా పాటించగలిగిన వానికి ఈ దీక్ష అవసరం లేదు. దీక్షాఫలం తత్క్షణమే వానికి దక్కుతుంది. వానికి ఆ వేషం అక్కర్లేదు. ఈ గోలా అక్కర్లేదు. నిజంగా మనస్సుతో శరణాగతి కాగలిగితే వాని మాటలు తత్క్షణమే ఆగిపోతాయి. వాని ఆలోచనలు టక్కున ఆగిపోతాయి. మహామౌనం ఆవహిస్తుంది. ఆ మౌనంలో శక్తితో అనుసంధానం కలుగుతుంది. .మనిషి తత్వమే మానవత్వం – ఏ జీవికీ లేని ఈ తత్వం అనేది మనిషి కొక్కరికే ప్రాప్తించింది. తలచి చూడనతకు బ్రహ్మ

  అగును నిద్ర,సమాధిని బ్రహ్మవిద్వరిష్ఠా గరిష్ఠ, తురీయాతీతుడే సర్వేశ్వరుడు. నీ నిజస్ధితిని విస్మరించిన పరిజ్ఞానమెంతైనా దైవస్ధానమున శోభిల్లనేరదు.అందులకే నిన్ను నీవు తెలుసుకో. నీ నిజస్ధితి అఖండం. నీ పరిధిలో నీవు నిశ్చలుడవై మనస్సు, నిలువనేర్చుకో.

 2. rathnamsjcc Says:

  జీవితంలో ఆత్మ సత్యం అంటే ఏమిటో అన్వేషిస్తున్నారా?సత్యం ఆత్మ చైతన్యం అనేది ఎక్కడో దూరంగా ఉండే విషయం కాదు,అది ఆత్మ చైతన్యం లో ఉంది..సముద్రంలో ఉండే ఒక చేపను సముద్రం ఆత్మ చైతన్యం ఆవరించుకుని ఉన్నట్లుగానే , సత్యం మన చుట్టు ఆవరించుకుని ఉంది.సముద్రంలో ఉండే చేపకు సముద్రం గురించిన ఎరుక ఎప్పటికి ఉండకపోవచ్చు . సముద్రం గురించి తెలిసిన వెంటనే చేపకు ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది. దేన్ని గురించి తెలుసుకోవాలన్నకూడా ఆ వస్తువుకు , దానిని చూసేవారికి మధ్యన కనీసం కొంత దూరం ఉండాలి.అప్పుడే కనిపించే దానిని గురించిన ఎరుక జ్ఞానం చూసేవారికి కలుగుతుంది. సముద్రంలోనే అంతర్భాగంగా ఉన్న చేపకు అలా సముద్రాన్ని గురించిన ఎరుక ఏనాటికి కలుగకపోవచ్చు.
  సత్యం పరిస్థితి ఇదే. సత్యమే దేవుడు. దేవుడి పరిస్థితి కూడా ఇదే.అతను మనకు అతి సమీపంలో,మనల్ని పర్యవేక్షించి ఉన్నాడు.సత్యం,దేవుడు సమీపంలో ఉందనడం కూడా సరికాదు.అది మీరే కనుక.సత్యం,దేవుడు మీరై ఉండి మీలోపల,బయట కూడా పర్యవేక్షించి ఉన్నాడు.
  సత్యమే ఉంది అనేది మొదటి సత్యం.సత్యం,దేవుడ్ని దర్శించకుండా ఉంచే అతి పెద్ద ప్రతిబంధకం మనస్సే. మిమ్మల్ని మాయాతెరలాగ చుట్టుముట్టి భౌతిక ప్రపంచ అందాలకు మిమ్మల్ని పరవశ్యులను చేస్తుంది.
  ఆ మనస్సు మాయలో లీనమైపోయి సత్యాన్ని మర్చిపోతున్నారు. నిరంతరం కలలు గనేది, కల్పనలు,ఆశలు,ఆశయాలు,కోరికలే ఆలోచించేదే మనస్సు. నిజానికి లేనిదల్లా మనస్సే. కాబట్టి దేవుడ్ని తెలుసుకోనివ్వకుండా ప్రతిబంధకం అంతా మనస్సే. బొధిచిత్తం లేదా బుద్ద చైతన్యం అంటే మనస్సును ఖాళిగా ఉంచడం.అంటే ఆలోచనలు ఏమిలేని మనస్సు అని అర్థం.అన్ని మతాల సారాంశం అంతా ఈ స్థితికోసమే. ఈ స్థితి సాధించడమే దేవుడ్ని తెలుసుకునే మహాద్వారం.

 3. rathnamsjcc Says:

  మనస్సునిలిపి మనస్సు తన జన్మస్థానము(ఆత్మ) నకు వెళ్ళడం అసలయిన నమస్కరం. అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి .మన సాధనతో గురువు యొక్క అనుగ్రహం కలుగును, గురువు యొక్క అనుగ్రహంతో ఆత్మ అనుగ్రహం కలుగును.నీ నిజస్వరూ పం బట్టబయలుగ అనుభూతి.కాగలదు.

 4. rathnamsjcc Says:

  దైవము అనగా ఆత్మ
  దైవము అనగా ఆత్మ శుద్ద ఎరుక చైతన్య స్వరూపమైన మహా వెలుగు. అది అనంతమైనది. అవధులు లేనిది. ఆ శుద్ద ఎరుక చైతన్యము నుండి జీవుల కోరిక మేరకు సృష్టి సంకల్పంబయలుదేరుతుంది.
  అసలు ఆత్మ చైతన్యమే మూలతత్వాము సంకల్పంలేదు
  మనసు ఆత్మ లో ఇక్యం చేసు కోవాలి .అప్పుడు మిగిలిన ప్రపంచం అంతా ,మన లోని ప్రశాంత భావమే వికశిస్తుంది .ఆత్మ సాక్షాత్కారం పొందిన వారికి చూసేది ,చూడ బడేది తన లోనే లీనం అవుతుంది .అంటే త్రిపుటి మాయమవుతుంది .అప్పుడే బ్రహ్మ లో ఇక్యం అవుతాడు
  ఆత్మ లో ఎరుక చైతన్యమే చూసేది ,చూడ బడేది తన లోనే ఎరుక చైతన్యమే నేనుగా వున్నది అని భావించటం జ్ఞానము అవుతుంది. భగవంతుడు తనను తాను సృష్టించుకొని ఎరుక చైతన్య స్వరూపుడై వెలుగై నిలుస్తాడు.
  జీవాత్మ – పరమాత్మ ఒక్కటే నిత్యం, సత్యమూ, శుద్ధమూ, ముక్తమూ, అనాదీ, అనంతమూ అయిన సత్ చిత్ ఆనంద పరబ్రహ్మమనే అఖండ చైతన్యము, కేవల జడపదార్థంకాని ప్రతి వస్తువు (ప్రాణి) లోనూ జీవాత్మగా ప్రకాశిస్తున్నది. సత్తూ చిత్తూ ఆనందం తప్ప, ఆ ఆత్మకు మరొక లక్షణం లేదు. ఈ పరబ్రహ్మ ఆత్మ ఒక్కటే నిత్య సత్యం అర్జునుడు ఇలా అడిగాడు: శ్రీ కృష్ణుభగవాని సమాధి కలిగిన స్తితప్రజ్ఞుడి లక్షణం ఏమిటి? స్థిరబుద్ధి కలిగినవాడు ఎలా మాట్లాడుతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా నడుచుకుంటాడు? భగవానుడు ఇలా బదులిచ్చాడు: అర్జునా! మనస్సులోని అన్ని కోరికలని ఎప్పుడు విసర్జిస్తాడొ, ఎప్పుడు తనలో తాను తుస్టిని(ఆత్మానందాన్ని) పొందుతాడో, అప్పుడు స్తితప్రజ్ఞుడు అనిపించుకుంటాడుఇక్కడమనస్సు ఆలోచనలకు తావులేదు. స్థితి అయిన సమాధి స్థితిలో ఆలోచనలు వుండవు; మనస్సు వుండదు స్పృహ వుండదు; మనస్సు నిశ్చలమై వుంటుంది; సమయం తెలియదు. ఇక్కడే ఆత్మ సత్యాన్ని లేదా ఆత్మ సత్య-స్థితిని పొందవచ్చు,మనస్సు ఆలోచనల స్థితిని దాటినప్పుడే బ్రహ్మo సత్యం తెలుస్తుంది ఈ సమాధి స్థితిలోకి వెళ్ళిన తరువాతే ఎవరూ, ఎవరికీ బోధించలేరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s


%d bloggers like this: