శ్రీ ఆంజనేయ దండకం (తెలుగువారి హనుమాన్ చాలీసా)

శ్రీరామ. శ్రీ ఆంజనేయ దండకం = తెలుగువారి హనుమాన్ చాలీసా ( =40 పంక్తుల మంత్రరాజం)

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే2హం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రము న్నీనామ
సంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిం జేయనూహించి
నీ మూర్తినిం గాంచి నీ సుందరం బెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై
నిన్ను నే గొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ జేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భోదయా
దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరం బిల్చితే
తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై స్వామికార్యంబునందుండి
శ్రీరామునిం జూచి వారి న్విచారించి సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి
యవ్వాలినిం జంపి కాకుత్థ్సతిలకుం దయాదృష్టి వీక్షించి కిష్కింధ కేతెంచి
శ్రీరామ-కార్యార్థమై లంక కేతెంచి లంకిణిన్ జంపియున్ లంకనుం గాల్చియున్
భూమిజం జూచి యానంద ముప్పొంగ యా యుంగరంబిచ్చి
యా రత్నమున్ దెచ్చి శ్రీరామునకు న్నిచ్చి సంతోషితుం జేసి
సుగ్రీవునిన్ అంగదున్ జాంబవంతాది నీలాదులం గూడి
యా సేతువున్ దాటి కీశౌఘ-సంఘంబుచే దైత్యులన్ ద్రుంచగా
రావణుండంత కాలాగ్నియుగ్రుడై పోరి బ్రహ్మాండమైనట్టి యా శక్తియున్ వేసి
యా లక్ష్మణున్ మూర్చ నొందించగా నప్పుడే పోయి
సంజీవినిం దెచ్చి సౌమిత్రికి న్నిచ్చి ప్రాణంబు రక్షించగా
కుంభకర్ణాది వీరాళితో బోరి చెండాడి
శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణుం జంపగా
నంత లోకంబు లానందమై యుండ నవ్వేళలన్
నవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు జేయించి
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరామునకు న్నిచ్చి నయోధ్యకున్ వచ్చి
పట్టాభిషేకంబు సంరంభమై యున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించినన్
రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ నామ సంకీర్తనల్ జేసితే
పాపముల్ బాయునే భయముల్ దీరునే భాగ్యముల్ గల్గునే
సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులున్ గల్గునే
వానరాకార ! యో భక్తమందార ! యో పుణ్యసంచార !
యో ధీర ! యో శూర ! నీవే మహా ఫలమ్ముగా వెలసి
యా తారకబ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యంచున్ మనః పూతమై
యెప్పుడున్ దప్పకన్ దాల్చు నా జిహ్వ యందుండి నీ దీర్ఘ దేహంబునన్ లోక సంచారివై
రామనామాంకిత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్ర విజ్వాల కల్లోల ! హావీర హనుమంత !
ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూతప్రేతపిశాచ శాకినీ ఢాకినీ
గాలి దయ్యంబులన్ నీదు వాలంబునం జుట్టి నేలం బడంగొట్టి
నీ ముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి
కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మప్రభా భాసితంబైన నీ దివ్యతేజంబునున్ జూచి
రారా ! నృసింహా ! యటంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు స్వామీ !
నమస్తే సదా బ్రహ్మచారీ ! నమస్తే వ్రతః పూర్ణకారీ ! నమస్తే వాయుపుత్రా ! నమస్తే నమస్తే నమస్తే నమః .

NOTE : To get a full view of the Post explaing the GREATNESS and UTILITY of SRI ANJANEYA DANDAKAM, please click on the VARGAM ( CATEGORY) ” STOTRAALU “; or on KHAJANALU ( ARCHIVES) ” DECEMBER 2010″, IN THE SIDE-BAR OF THIS BLOG.

12 వ్యాఖ్యలు to “శ్రీ ఆంజనేయ దండకం (తెలుగువారి హనుమాన్ చాలీసా)”

  1. వెంకట్ పాలపర్తి Says:

    మీరు చెసే ఈ భాషా సేవ నన్ను చాలా ఆనందింప చేస్తోంది.
    మీ ఈ ప్రయత్నం మూడు పువ్వులు ఆరు కాయలు కావాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

  2. rajeshwari Says:

    i want to sri Hanuman arithi songs

  3. R.P.Chowdary Says:

    We are very happy to added Hanuman Chalisa through your website. Thank you a lot. I hope more prayers you add in this website will be useful to Telugu people.
    Thank you very much

  4. mohana Says:

    I am very happy to added Hanuman Chalisa through your website. Thank you very much.

  5. Lakshmi Kanth Says:

    U have done really a commendable job…
    May the blessings of lord hanuma with you…

  6. D.Vimala Says:

    nenu chala shanthoshanga vunnanu roju hanuman dandakam chaduvukuntunnanu. mee web siteche aa hanumanthudu inta manchi
    velakattaleni aanandanni ichinanduku aadevudiki mariyu meeki krutagnatalu.

  7. sharada Says:

    thank u for giving hanuman chalisa

  8. rathnam.sjcc Says:

    మానవ దేహం మోక్షానికి ద్వారం అని పెద్దలు చెప్తారు. ఐతే ఇది సార్థకం చేసుకోవటానికి ఏ జ్ఞానం తెలుసు కోవాలో అది తెలుసుకోకుండా జీవితాన్ని వృధా చేసుకున్నప్పుడు మళ్ళీ అనేక జన్మలు పొందవలసి వుంటుంది. అల్పమైన, అశాశ్వతమైన కోరికలతో సతమతమౌతూ మానవ జీవితం యొక్క విశిష్టత గుర్తించ కుండా సుదీర్ఘమైన ఈ ప్రయాణానికి గమ్యం ఏదో, గమ్యం చేరాలంటే ఏ ప్రయత్నం చేయాలో తెలుసు కోకుండా ఇతర జంతువుల వలెనే శరీర పోషణ కోసమూ, దేహ సౌఖ్యాల కోసమూ, భద్రతకోసమూ, ఇతర జీవులపై ఆధిపత్యం కోసమూ మనో, వాక్కాయ కర్మలు వృధా చేస్తూ పరిమితమైన తన జీవిత కాలాన్ని పూర్తిగా అందుకే వినియోగిస్తే 84 లక్షల జీవరాసులలో అరుదుగా లభించే మానవ జన్మ దుర్వినియోగ మైనట్లే నని పెద్దలందరూ చెప్తున్నారు. అరుదైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జన్మ సఫలం చేసుకునే ప్రయత్నం చేయని వారికి రాబోతున్నాయి లక్షలాది జన్మలు. దుఃఖ భూయిష్టమైన పశు, పక్షి, క్రిమి, కీటక, సరీనృపాది జన్మలు. మళ్ళీ అత్యంత దుర్లభమైన మానవ జన్మ ఎప్పటికి సంక్రమిస్తుందో ఎవరు చెప్పగలరు?

    దేహం గురించి కాదు పంచ భూతాలు నేనుకాదు. కనిపిస్తున్నదేదీ నేను కాదు. ఇంద్రియాలకు అందేది ఏదీ నేనుకాదు. ఊహించడానికి కూడా అలవికాని నేను ఎవర్ని? ఎలా వున్నాను? అని తెలుసుకొనే ప్రయత్నమే జ్ఞానం. అదే సాధన. అదే అభ్యాసము అని కూడా అనబడుతుంది.
    ఈ దేహం ఎ పని చేస్తున్నా నేను వేరుగా వున్నాను అని గుర్తించాలి. ఇది కష్టం కాదుగదా! ఇంద్రియాలు వాటి క్రియా కలాపాలు సాగిస్తున్నప్పుడు, మనసులో ఆలోచనలు కదులుతున్నప్పుడు ఇవి నేను కాదుగదా. నేను వేరుగా వున్నాను. ఎ కదలికా, వికారమూ లేకుండా, అనంతమైన నిరాకార స్వరూపంగా, ఎ మార్పూ లేకుండా శాశ్వతంగా వున్నాను అనే భావాన్ని పెంచుకోవాలి.
    ఇదే.కళ్ళు చూస్తున్నప్పుడు, చెవులు వింటున్నప్పుడు, చర్మము సృశిస్తున్నప్పుడు, నాసిక ఆఘ్రాణిస్తున్నప్పుడు, నోరు భుజిస్తున్నప్పుడు, కాళ్ళు నడుస్తున్నప్పుడు, దేహము నిద్రిస్తున్నప్పుడు, శ్వాస క్రియ జరుపుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, విడిచి పెడుతున్నప్పుడు, గ్రహిస్తున్నప్పుడు, కనులు తెరుస్తున్నప్పుడు, కనులు మూస్తున్నప్పుడు ఆయా ఇంద్రియాలు వాటి పనులు చేసుకొంటున్నాయి గాని వాటికి భిన్నంగా వున్న నేను కొంచం కూడా ఏమీ చేయటం లేదు, కేవలం సాక్షిగా ఉన్నాను అనే భావన చేయాలి. ఇది అభ్యాసం చేయాలి. ఇదే నేవు నీవుగా ఉండటమంటే. అయితే ఇలా ఉండటానికి అడ్డుపడుతున్నవి రాగ ద్వేషాలు, పాప కర్మలు మొదలైనవి. ఆయా దోషాల నుండి నీవు బయట పడాలంటే యజ్ఞ, దాన, తపోకర్మలు ఆచరించవలసియుంటుంది

    నీవు వున్నప్పుడు నిద్ర, అలసత్వంతో వుంటావు. అజ్ఞానం పోగొట్టుకున్నప్పుడు మాత్రమే అంటే యదార్థమైన నీవు ఎవరో తెలుసుకున్నప్పుడు నిద్ర నుండి మేల్కొన్నట్లు తమో గుణం నుండి బయట పడతావు.
తృష్ణ నుండి బయట పడితే రజో గుణం నుండి బయట పడతావు. అంటే రాగ ద్వేషాల నుండి బయట పడాలి. అప్పుడే దుఃఖం పోతుంది.అప్పుడు ఎ అంటూ లేని నిర్మలమైన ప్రశాంత స్థితి అనుభవానికి వస్తుంది. అదే సత్వము అనబడుతుంది
    నిన్ను నీవు ఉన్నట్లయితే త్రిగుణాతీతమైన నీ స్వరూప స్థితి క్రమ క్రమంగా అనుభవానికి వస్తూ వుంటుంది
    ఎవరైతే తనలోనే సుఖాన్ని పొందుతూ, తనలోనే రమించుచూ, తనలోనే ప్రకాశమును పొందుతూ ఉంటాడో అతడే బ్రహ్మ భావముతో నున్న యోగి, పరబ్రహ్మ స్వరూపమును పొందుటకర్హుడు.
    ఈ జన్మ పరంపర నుండి విడుదల. అదే మోక్షము అనబడుతున్నది. తానుకానిదానినుండి విడిపడి ఉజ్జ్వలమైన, పరమ పవిత్రమైన, అవ్యయమైన తనను తాను గుర్తించి సనాతనమైన తన అద్వితీయ స్వస్తితిలో తాను ఆనంద స్వరూపుడై ఉండటమే మోక్షము. శ్రేయస్కరమైనది అది ఒక్కటే. అందువల్ల ప్రతి మనిషి మోక్షాపేక్షతో ఉండాలి. దీనినే ముముక్షుత్వము అంటారు మానవ జీవితానికి పరమగమ్యం మోక్షం పొందటమే. 84 లక్షల జీవ రాసులలో మరే ఇతర ప్రాణికీ ఈ అవకాశం లేనే లేదు. ఎందువల్లనంటే శాశ్వతత్వాన్ని గుర్తించగల వివేకం మనిషికి మాత్రమే సొంతం. వివేకంతో శాశ్వతమైన తన స్వరూపమును గుర్తెరిగిన మనిషి మళ్ళీ దేహభావము లోకి జారిపోకుండా తాను తానుగా ఉండాలంటే, విషయ ధ్యానములో పడకుండా విషయాల పట్ల వైరాగ్యంతో వుండాలి. తనను తాను స్మరించు కుంటూ సర్వ కాల సర్వావస్థలలోనూ తన ఎరుకలో తాను ఉంటూ, దేహముయోక్క, ఇంద్రియముల యొక్క, మనసు యొక్క ప్రతి కదలికనూ గమనిస్తూ వుండాలి. ఇంద్రియాలు వాటి విషయాలలో ప్రవర్తిస్తున్నప్పుడు ఆ విషయాల పట్ల ఇష్టాయిష్టాలు ఏర్పరచుకోకుండా, ఇంద్రియాలు ఇంద్రియ విషయాలలో ప్రవర్తిస్తున్నాయి, తనకు ఏ సంబంధమూ లేదనీ, తాను కేవలము సాక్షిని అనే భావనతో ఇష్టాయిష్టాల కతీతంగా నిర్లిప్తంగా ఉండాలి. మనస్సులో మెదిలే ఆలోచనలను సైతం రాగ ద్వేషాలు లేకుండా గమనిస్తూ ఉండాలి. దేహం ఏ పని చేస్తున్నా నిర్వికారంగా గమనిస్తూ ఉండాలి. దేహానికి ఏమి జరుగుతున్నా, దేహ ప్రారబ్దం వల్ల అవి అలా జరుగుతున్నాయి, కష్టాలూ, సుఖాలూ వస్తున్నాయి, పోతున్నాయి, దేహియైన తనకు ఎట్టి సంబంధమూ లేదు అని భావించాలి. తన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఎప్పుడెప్పుడు ఏదేది జరగాలో అదే జరిగి తీరుతుంది, దేహం ఏది పొందాలో అదిమాత్రమే పొందుతుంది, దేహానికి ఏది దూరమవాల్సి వుందో అది దూరమయ్యే తీరుతుంది, ఇందులో తన ప్రమేయం ఏమీ లేదను నిర్ధారణ తో నిర్లిప్తంగా వుండాలి

    ఇంద్రియములు వాటి విషయాలలో చరిస్తున్నప్పుడు రాగ ద్వేషాలకు లోను కాకుండా మనసును నిగ్రహించి తన ఆధీనములో నుంచుకొన్న వారికి శాంతి అనుభవమౌతుంది.
    కన్ను ఒక వస్తువుని చూస్తున్నప్పుడు, నీ స్వరూపాన్ని నీవు ధ్యానిస్తూ, నీవు నీవుగా ఉండవచ్చు. అలా కాకుండా కన్ను చూస్తున్న వస్తువును ధ్యానిస్తే సంగమం ఏర్పడి, వస్తువు పట్ల రాగమో, ద్వేషమో కలుగు తుంది. అలాగే చెవి ఒక శబ్దాన్ని వింటున్నప్పుడు, నీ ధ్యానంలో నీవుంటే, శబ్దం వస్తూ వుంటుంది, శబ్దం పోతూ వుంటుంది. నీకే సంబంధమూ లేదు. ఐతే ఇదేమి శబ్దము, ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎలా వుంది అని ఆలోచిస్తే, నీకు సంగమం ఏర్పడి శబ్దం పట్ల రాగమో, ద్వేషమో కలుగుతుంది. ప్రతి ఇంద్రియ విషయంలోనూ ప్రతిసారీ ఇలాగే జరుగుతుంది. రాగ ద్వేషాలకు లోనయ్యావు అంటే నీ స్మృతి పోయింది. అంటే నిన్ను నీవు మరచిపోయావు అని అర్థము. ఇంద్రియాలు విషయాలలో ప్రవర్తిస్తున్నప్పుడు రాగ ద్వేషాలకు లోను కాకుండా నీవు ఉంటున్నప్పుడు మాత్రమే అంతఃకరణ చతుష్టయంలో ఆత్మ భావన అనుభవమౌతుంది. ఇదే ప్రసాదము (శాంతి) అనబడుతుంది.
    ప్రసాదము వలన సర్వ దుఃఖములూ నశించును, మనస్సు నిర్మలమై బుద్ధిలో ఆత్మభావము స్థిరపడును
    మనస్సును నిగ్రహించుకోని వానికి వివేక బుద్ధి వుండదు. మనో నిగ్రహము లేనివాడు ఆత్మ భావనా చెయ్యలేడు. ఆత్మ భావన చెయ్యలేని వానికి శాంతి అనుభవం కాదు. శాంతి లేని వానికి సుఖమెక్కడిది.
    మనసును నిగ్రహించుకోవటమే యుక్తము అనబడుతుంది.

    శుద్ధమైన మనస్సు అంటే వాసనారహితమైన మనస్సు, మోక్షమునకు దారి తీస్తుంది. అదే మనస్సు వాసనలతో కూడి ఉన్నపుడు, మరో జన్మకు కారణం … కర్మేంద్రియాలతో కర్మలతో కర్మల నాచరిస్తుంది. ఇన్నింటికి కారణం ఆ అఖండ చైతన్యం. సాధన ద్వారా శుద్ధమైన అంతఃకరణంలో శుద్ధ సత్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానశక్తి

  9. nagireddi sivaganesh Says:

    చాలా మంచి పని చేసారు

    మీకు మా ధన్యవాదాలు

  10. KP Says:

    జై శ్రీరామ … ధన్యులం.

  11. B. Madhusudhan Says:

    Excellent, it’s required for younger generation very much.

Leave a reply to rajeshwari స్పందనను రద్దుచేయి