Posts Tagged ‘Telugu families’

శ్రీ ఆంజనేయ దండక ప్రాశస్త్యం, ప్రయోజనం :

డిసెంబర్ 20, 2010

శ్రీరామ

శ్రీ ఆంజనేయ దండక ప్రాశస్త్యం, ప్రయోజనం :

శ్రీ ఆంజనేయ దండకం తెలుగునాట చాలా తరాలనుండి ప్రాచుర్యంలో ఉన్నది.
ఆంజనేయస్వామివారి మహిమ, సుగుణాలు, సాధించిన ఘనకార్యాలు, రక్షణ, అనుగ్రహం
మొ.వన్నీ ఈ దండకంలో పొందుపర్చబడ్డాయి.

ఇందులో సంస్కృత పదాలు పొదగబడటంవల్ల శబ్దశక్తి, మంత్రశక్తి కలిగి ఉంది.
తెలుగుభాషలో క్రియాపదాలు, వాక్యాలు ఉండటంవల్ల- చదువుతూండగానే (వింటూండగానే)
వెంటనే అర్థమవుతూ, భావశక్తి కూడా కలిగి ఉంది. అందువల్లనే ఈ దండకం శ్రద్ధగా
పారాయణ చేసినవారికి కోరిన కోర్కెలు తీర్చటంలో చాలా ప్రభావశాలిగా ఉన్నది.

భారతదేశంలోని ఏ ప్రాంతంవారికయినా – ఆధ్యాత్మిక, దైవభక్తిక విషయ పరిజ్ఞానం కలగాలన్నా,
సాధనలో పురోగతి కావాలన్నా కూడా – మహర్షుల బోధనలే అధారం ! వారు అందరూ
సంస్కృతభాష (The Most Refined Language ) లోనే రచనలు, బోధనలు చేశారు.
మూలం(Original Work in Original Language )లో చదువుకోగలగటం, ఒక గొప్ప వరం !

అది అందరికీ సాధ్యం అయ్యేది కాదు. కాబట్టి తమ తమ మాతృభాషలలో ఉన్న వ్యాఖ్యానంతో /
అనువాదంతో కలిపి చదువుకోవటం అనేది Next Best !
“యదేవ విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం భవతి ” – అంటే, “అర్థం, భావం తెలుసుకుని చేసిన
సాధనలు ఎక్కువ శక్తిమంతములుగా, ఫలదాయకములుగా ఉంటాయి” అని అర్థం.
మాతృభాషలో చదివిన, విన్న విషయాలు, భావాలు అత్యధిక శాతం అర్థమౌతాయని అందరికీ
తెలిసిన విషయమే గదా !

అలాంటి రచనలు తమ మాతృభాషలో చేయబడియుండనప్పుడు, ఏ ఇతర
భారతీయ భాషలోనైనా పరవా లేదు. ఎందుకంటే, భారతదేశంలో ఉద్భవించిన భాషలు
అన్నింటిలోనూ కూడా, భారతీయాత్మను, సంస్కృతిని దర్శింపజేయగల పదజాలం, సామర్థ్యం
సహజంగానే ఉన్నాయి ! విదేశీ భాషలకు ఆ సౌలభ్యం చాలా తక్కువ.

అందువల్లనే, ఈ దండకం పారాయణ – తులసీదాసకృత హనుమాన్ చాలీసా లోని ప్రతిపద
భావార్థం తెలియనివారు చేసే చాలీసా పారాయణకంటె – ఏమాత్రం తక్కువ కాదు.

ముఖ్యంగా బాలురకు ఈ దండకమును కంఠస్థం చేయిస్తే, కనీసం వారు చదువుకోగలిగిన
పరిస్థితి కలిగించ గలిగితే, ఇక వారికి దైవసంబంధమైన రక్షణ సంపూర్ణంగా కలిగించినట్లే
నిశ్చింతగా ఉండవచ్చును !

ఆదర్శప్రాయమైన సకల సద్గుణాలూ, వ్యక్తిత్వమూ కలిగిన,
భక్తుడూ, దేవుడూ కూడ తానే అయిన,
మహా శక్తిమంతుడయిన హనుమంతుని అనుగ్రహ రక్షణ వలయంలో
మన పిల్లలను ఉంచటంకంటె వారికి మనం చేయగల మహోపకారం ఏముంటుంది ? !

NOTE : Please click on the title ” KAMTHASTHA BHAARATHI” at the top of this Post, to get a full view of the side-bar. Then click on “Sri Anjaneya dandakam” page in the side-bar,
to get a full view of the Text.

ప్రకటనలు

తెలుగు కుటుంబాలలో తెలుగుదనం ఎంత?

సెప్టెంబర్ 6, 2008

 

మన కుటుంబంలో, మన వంశంలో
తెలుగుదనం కొనసాగించుకునే ఉపాయం
మనమే చేయదగింది ఏమైనా ఉందా ?
ఈ రోజులలో తెలుగువారు ప్రపంచం నలుమూలలకీ
విస్తరిస్తున్నారు .ఇతర రాష్ట్రాలలోనూ, ఇతర దేశాలలోను
ఉంటున్న వారికి ఎలాగూ తెలుగు మాటలు వినబడవు;
తెలుగు లిపి కనబడదు. మన స్వంతరాష్ట్రంలోనే 
ఉంటున్న తెలుగు కుటుంబాలలో కూడ అదే పరిస్థితి !
వారి పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూండటం
వల్లను, పిల్లలఆంగ్లప్రావీణ్యాన్ని ఇంకా పెంచే ఉద్దేశ్యం
తోనూ, పిల్లలను ఇంట్లో కూడ ఇంగ్లీష్ లోనే మాట్లాడమని
ప్రోద్బలం చేస్తున్నారు.
ఫలితంగా ఆ కుటుంబంలోని వ్యక్తులు క్రమంగా  ( ఒక్కో
తరం గడుస్తున్నకొద్దీ ) తెలుగు పలుకుబడికీ, భాషా
సంస్కృతులకీ, తెలుగు సంప్రదాయాలకీ విచారధారకీ
దూరమవుతున్నాము. తెలుగుదనమే లోపించిన
తెలుగువారిగా మారిపోతున్నాము !
ఈ పరిస్థితిని గమనిస్తూన్న భాషావేత్తలు, విద్యావేత్తలు
అందరూతెలుగు భాష క్షీణించిపోకుండా రక్షించుకు
నేందుకు విధివిధానాలనుసూచిస్తూనే ఉన్నారు. ఆంధ్ర –
ప్రభుత్వపరంగా రావాల్సిన చొరవ కొఱవడింది.
మరి మన కుటుంబంలో, మన వంశంలో
తెలుగుదనం కొనసాగించుకునే ఉపాయం
మనమే చేయదగింది ఏమైనా ఉందా ?
ఉన్నది. పైగా చాలా సులభం కూడా. మనం ( తల్లి –
దండ్రులం, తాతా-బామ్మలం, ఉపాధ్యాయులం ) రోజూ
రాత్రి భోజనాల దగ్గరో, ఒక్క పది నిముషాలు పిల్లలతో
గడప గలిగితే చాలు. వారిచేత  రోజూ ఒక్క సూక్తి
( Quotation ) నోటికి వచ్చేట్టుచెబితే చాలు. దాని
భావాన్ని మీదైన పద్ధతిలో వివరిస్తె, పిల్లలమీద వారి
వ్యక్తిత్వం మీద మీ ముద్ర పడుతుంది; వారు జీవితాంతం
గుర్తుంచుకునే మధురమైన అనుభూతి అవుతుంది !
వేమన ప్రజా కవి. తెలుగువారి పుణ్యఫలం. కమ్మని తేట
తెనుగులో – ఒక లయతో – పసి పిల్లలకు కూడా నోరు
తిరిగేటంతటి లాలిత్యంతో, భారతీయ సంస్కృతిలోని అన్ని
అంశాలనీ స్పృశిస్తూ, అద్భుతమైనపద్య సాహిత్యాన్ని
అందించాడు !
షుమారు 1,166 పద్యాలను పరిశీలించి, తెలుగు బాల –
బాలికలకు తెలిసి తీరవలసిన 382 ( one-line )
సూక్తులను సేకరించి, ఒక క్రమంలో అమర్చి, మీకు
అందిస్తున్నాము. రోజుకో సూక్తి చొప్పున చదివితే,
ఒక్క ఏడాదికల్లా వచ్చేస్తాయి.
ఈ వేమన సూక్తి రత్నాలను పొందటానికై, ఇలా చేయండి.
NOTE:
Please click on the title ‘ KAMTHASTHA –
BHARATHI ‘ at the top of this post, to get
a full view of the side-bar. Then, pl. click
on the page “VEMANA SUKTULU – 1 ( or 2 )
QUOTATIONS” in the side-bar.
EVERY PAGE OF THIS BLOG COMPRISES
OF ESSENCE MATERIAL OF VARIOUS
STANDARD CULTURAL AND LITERARY
WORKS WORTH  GETTING BY HEART
BY CHILDREN.