Posts Tagged ‘తెలుగు సూక్తులు’

ప్రథమ బాల శిక్ష – 1 ( పిల్లల కోసం పుస్తకం )

మార్చి 22, 2013

తెలుగు వారి పిల్లలు ఆధునిక విద్యలో మిగిలిన భారతీయ బాల బాలికలకంటె ప్రతిభాశాలురుగా రాణిస్తున్నారు. కాని కొన్ని సాంప్రదాయిక సాంస్కృతిక విషయాలలో మాత్రం చాలా వెనుక బడే ఉన్నారు.
మన పిల్లలకు మాతృభాషాభిమానం చాలా తక్కువ. విదేశ గమనాసక్తి చాలా ఎక్కువ. వంటయింటి సామానుల పేర్లను కూడ ఇంగ్లీషులో పలకటం ఒక గొప్ప, ఒక ఫ్యాషన్ ! మన ఇళ్ళల్లో అనుక్షణం మ్రోగుతూ ఉండే టి.వి.లలో వినబడే తెలుగు ఉచ్చారణ అంతా ఇతర భాషల ధోరణిలోనే.
ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడ తమ మూలాలను మరిచి పోరాదు. ఆత్మాభిమానం, స్వాభిమానం వీడరాదు. మానవ జీవితాన్ని శాంతి భరితం, ఆనంద భరితం చేసే అంశాలన్నీ భారతీయ సంస్కృతిలో నిక్షిప్తమై ఉన్నాయి. సంస్కృతంలో ఉన్న అమూల్య సాహిత్య రత్నాలను తెలుగులో అనువదించిన పోతనాది ఋషితుల్యులు మనకూ ఉన్నారు.
కాని, తెలుగు చదవగల వారెంత మంది? అర్థం చేసుకోగల వారెంత మంది? ఆచరించే వారెంత మంది? తమ వారసులకు ఈ నిధిని అందించే వారెంత మంది? దీని మీద గౌరవమూ, అందుకోవాలనే దృష్టీ ఉన్న పిల్లలు ఇంకెంత మంది? తెలుగు జాతి తెలుగుదనంతో మనగలిగే దెన్నడు?
ఈ విషయాలలో – తెలుగువారి పిల్లలకు తెలియ వలసిన అతి ముఖ్యమైన నైతిక, సాంస్కృతిక విషయాలను, భావాలను – దాదాపు అన్నిటినీ ఏర్చి కూర్చి, ఒక క్రమంలో అందించే ప్రయత్నంలో భాగంగా – మొదటి పుస్తకం వెలువరించటం జరిగింది. ఈ పుస్తకం వివరాలు ఇవీ :

తెలుగు వారి పిల్లలకు
సమన్వయ భారతి వారి
ప్రథమ బాల శిక్ష – 1
(తెలుగు సూక్తి సుధ)

( 150 తెలుగు సూక్తులు – భావాలు; మరియు 108 వేమన పద్యాలతో సహా )
104 పేజీలు ; వెల రు. 40 /-
Also available as ON-LINE E-BOOK.

For ordering the Printed Books on-line, please copy & paste the following link in your browser:

http://enblog.kinige.com/?p=1337

For a free Pre-View download, and for purchase of the same book in E- Book form on-line, please copy & paste the following link in your browser:

http://kinige.com/kbook.php?id=1545

ఈ పుస్తకం పిల్లలతో బాటు, తల్లిదండ్రులకూ, ఉపాధ్యాయులకూ గూడ ఉపయోగకరం – ఎందుకంటే, పిల్లలకు అర్థం వివరించ వలసినది వారే కాబట్టి !

సమన్వయ భారతి
samanvaya.bharathi@gmail.com
Mobile: (91) 9618165402

ప్రకటనలు

నీవు ఎవరివి?(WHO ARE YOU?)

మే 16, 2010

నీవు ఎవరివి ? ( WHO ARE YOU ? )

పై ప్రశ్నకు, ” నేను ఫలానా ” అని సహజంగా తోచే జవాబును బట్టే
ఒక మనిషి యొక్క దృక్పథం, వ్యక్తిత్వం ఆధారపడి ఉంటాయి.

ఉదాహరణకు: “నేను మగవాడిని, లేక నేను ఆడదానిని” అనే
భావం రూఢిగా ఉన్నవారికి లింగ-వివక్ష ఎక్కువగా ఉండే అవకాశం
ఉంటుంది.

“నేను బ్రాహ్మణుడిని, లేక నేను వైశ్యుడిని, మొ. ” భావం
ప్రథమంగా స్ఫురించేవారికి వర్ణ ( కుల ) వివక్ష ఎక్కువగా ఉండే
అవకాశం ఉంటుంది.

“నేను హిందువును, మహమ్మదీయుడను, లేక క్రైస్తవుడను,మొ.”
భావం ప్రప్రథమంగా బలంగా స్ఫురించేవారికి, పరమత-సహనం
తక్కువగా ఉండే అవకాశాలే ఎక్కువ !

“నేను ఆంధ్రుడిని, లేక నేను బెంగాలీని, మొ.”
అనే భావం మొదట బలంగా స్ఫురించే వారికి భాషా, రాష్ట్ర-వివక్ష
ఎక్కువగా ఉంటుంది. వీరికి అఖిల భారత స్థాయి పదవీబాధ్యతలు
అప్పగించినా సరే, ప్రాంతీయ భేదభావనతో, ప్రాంతీయ-అసమానత
లనే పెంచుతారు; భారతమాతకు క్షోభనే కలిగిస్తారు !

కాబట్టి, ” నీవు ఎవరివి ?” అని ప్రశ్నిస్తే వెంటనే స్ఫురించవలసిన
ఆదర్శవంతమైన జవాబు ఈపాటికే మీకు స్ఫురించి ఉంటుంది !

********************************************************

“నేను భారతీయ – ఆంధ్ర – హిందూ – తెలుగు – (కుల) – బాలుడను
/ బాలికను; నా పేరు …”

” I am a Bharatiya, Andhra, Hindu, Telugu, (Caste),
Boy / Girl , by Name: ..” .

“భారత సంస్కృతి వారసులం, అందుకు ఎంతో గర్విద్దాం;
భారతమాతే మనలను చూసీ, గర్వపడేలా జీవిద్దాం ! ”

******************************************************

అని భావించే నిత్య – అభ్యాసం విద్యార్థి దశనుంచీ చేస్తే,
వారి దృక్పథం ఎంత విశాలంగానూ, ఎంత శాంతియుత-సహజీవన
దోహదకరంగానూ ఉంటుందో ఒక్కసారి ఊహించండి !

Then, they will be naturally inclined to keep :

Nation’s interests above State’s;
State’s interests above Religion’s;
Religion’s interests above Language’s;
Language’s interests above Caste’s;
Caste’s interests above Family’s;
Family’s interests above Gender’s;
Other Gender’s interests above Self’s !

BHAARAT ( INDIA ) NEEDS SUCH
HUMAN-RESOURCES, which are your wards –
Our Dear PARENTS and TEACHERS !

Won’t you contribute, what is within your reach,
to Mother Bhaarat, to whom all of us owe a lot more?!

(NOTE : Please click on the title ” kamthasthabharathi”
at the top of this Post, to get a full view of the side-bar.
Then, in the side-bar, you may click on any related
topic of your interest.)

తెలుగు కుటుంబాలలో తెలుగుదనం ఎంత?

సెప్టెంబర్ 6, 2008

 

మన కుటుంబంలో, మన వంశంలో
తెలుగుదనం కొనసాగించుకునే ఉపాయం
మనమే చేయదగింది ఏమైనా ఉందా ?
ఈ రోజులలో తెలుగువారు ప్రపంచం నలుమూలలకీ
విస్తరిస్తున్నారు .ఇతర రాష్ట్రాలలోనూ, ఇతర దేశాలలోను
ఉంటున్న వారికి ఎలాగూ తెలుగు మాటలు వినబడవు;
తెలుగు లిపి కనబడదు. మన స్వంతరాష్ట్రంలోనే 
ఉంటున్న తెలుగు కుటుంబాలలో కూడ అదే పరిస్థితి !
వారి పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూండటం
వల్లను, పిల్లలఆంగ్లప్రావీణ్యాన్ని ఇంకా పెంచే ఉద్దేశ్యం
తోనూ, పిల్లలను ఇంట్లో కూడ ఇంగ్లీష్ లోనే మాట్లాడమని
ప్రోద్బలం చేస్తున్నారు.
ఫలితంగా ఆ కుటుంబంలోని వ్యక్తులు క్రమంగా  ( ఒక్కో
తరం గడుస్తున్నకొద్దీ ) తెలుగు పలుకుబడికీ, భాషా
సంస్కృతులకీ, తెలుగు సంప్రదాయాలకీ విచారధారకీ
దూరమవుతున్నాము. తెలుగుదనమే లోపించిన
తెలుగువారిగా మారిపోతున్నాము !
ఈ పరిస్థితిని గమనిస్తూన్న భాషావేత్తలు, విద్యావేత్తలు
అందరూతెలుగు భాష క్షీణించిపోకుండా రక్షించుకు
నేందుకు విధివిధానాలనుసూచిస్తూనే ఉన్నారు. ఆంధ్ర –
ప్రభుత్వపరంగా రావాల్సిన చొరవ కొఱవడింది.
మరి మన కుటుంబంలో, మన వంశంలో
తెలుగుదనం కొనసాగించుకునే ఉపాయం
మనమే చేయదగింది ఏమైనా ఉందా ?
ఉన్నది. పైగా చాలా సులభం కూడా. మనం ( తల్లి –
దండ్రులం, తాతా-బామ్మలం, ఉపాధ్యాయులం ) రోజూ
రాత్రి భోజనాల దగ్గరో, ఒక్క పది నిముషాలు పిల్లలతో
గడప గలిగితే చాలు. వారిచేత  రోజూ ఒక్క సూక్తి
( Quotation ) నోటికి వచ్చేట్టుచెబితే చాలు. దాని
భావాన్ని మీదైన పద్ధతిలో వివరిస్తె, పిల్లలమీద వారి
వ్యక్తిత్వం మీద మీ ముద్ర పడుతుంది; వారు జీవితాంతం
గుర్తుంచుకునే మధురమైన అనుభూతి అవుతుంది !
వేమన ప్రజా కవి. తెలుగువారి పుణ్యఫలం. కమ్మని తేట
తెనుగులో – ఒక లయతో – పసి పిల్లలకు కూడా నోరు
తిరిగేటంతటి లాలిత్యంతో, భారతీయ సంస్కృతిలోని అన్ని
అంశాలనీ స్పృశిస్తూ, అద్భుతమైనపద్య సాహిత్యాన్ని
అందించాడు !
షుమారు 1,166 పద్యాలను పరిశీలించి, తెలుగు బాల –
బాలికలకు తెలిసి తీరవలసిన 382 ( one-line )
సూక్తులను సేకరించి, ఒక క్రమంలో అమర్చి, మీకు
అందిస్తున్నాము. రోజుకో సూక్తి చొప్పున చదివితే,
ఒక్క ఏడాదికల్లా వచ్చేస్తాయి.
ఈ వేమన సూక్తి రత్నాలను పొందటానికై, ఇలా చేయండి.
NOTE:
Please click on the title ‘ KAMTHASTHA –
BHARATHI ‘ at the top of this post, to get
a full view of the side-bar. Then, pl. click
on the page “VEMANA SUKTULU – 1 ( or 2 )
QUOTATIONS” in the side-bar.
EVERY PAGE OF THIS BLOG COMPRISES
OF ESSENCE MATERIAL OF VARIOUS
STANDARD CULTURAL AND LITERARY
WORKS WORTH  GETTING BY HEART
BY CHILDREN.