శ్రీ శంకరాచార్య కృత స్తోత్రరత్న మకుటాలు !

 

శ్రీ ఆది శంకరాచార్య కృత స్తోత్రరత్న మకుటాలు :
 
15-05-2013 బుధవారంనాడు శంకర జయంతిని భారతదేశమంతటా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కర్మ-భక్తి-జ్ఞాన మార్గాలు మూడింటినీ సమన్వయ పరచి, ప్రతి భారతీయునికే గాక, ప్రతి మానవునకు గూడ – ఆధ్యాత్మిక ప్రగతికి వలసిన సాధనా సామగ్రిని అందించిన అపర శంకరుడు ఆయన ! అందుకే ఆయన జగద్గురువు !
 
శ్రీ శంకరాచార్య స్తోత్రములలో ఏదో ఒకటి చదవని భక్తులూ లేరు, అవి వినపడని దేవాలయాలూ లేవు ! అందరు దేవతలపైనా అంతటి కమనీయమైన స్తోత్రములను రచించారు ఆయన. 
 
సాహిత్యపరంగానూ, శబ్ద(లయ)పరంగానూ, భక్తిభావపరంగానూ, కవితా సౌందర్యపరంగానూ కూడా ఆ స్తోత్రరత్నములకు సాటి లేవు. అవి వేద -మంత్ర సదృశాలు !
 
పాటలకు పల్లవి వలె, స్తోత్రములో కూడ, కొన్ని శ్లోకాలలో ఒకే పాదం పునరావృత్తం అవుతూంటే, వాటిని ఆ స్తోత్ర  “మకుటాలు”  అంటారు. అవి భావనకు, ధ్యానానికి, ఇష్టదేవతతో అనుసంధానానికి – ఎంతో ఉపయోగ పడతాయి. తరచుగా తలచుకుంటూ ఉండటానికి అత్యంత అనుకూలంగా ఉంతాయి. నామస్మరణకే గాక, రూపస్మరణకు, భావస్మరణకు గూడ చాలా ఉపయుక్తాలు !
 
ఎవరి నోటికి, మనసుకు సౌకర్యంగా, సంతృప్తిగా నున్న మకుటాన్ని – వారి వారి ఇష్టదేవతకు సంబంధించిన మకుటాన్ని – ఎంచుకుని, ఔదల దాలిస్తే, కృతార్థులం అవుతాము !
 
అలాంటి స్తోత్రరత్న-మకుటాలను శిరసున దాల్చేందుకు, పాఠకలోకానికి అందించ గలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను !
 
******************************************************
 
గణాధీశ మీశాన-సూనుం తమీడే ||   (గణేశభుజఙ్గమ్) 
 
మనశ్చే న్నలగ్నం గురో రంఘ్రిపద్మే –
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ |  (గుర్వష్టకమ్)
 
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణా మూర్తయే || (దక్షిణామూర్తి స్తోత్రమ్)
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి ||   (దక్షిణామూర్తి వర్ణమాలా స్తోత్రం)
 
సామ్బ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగమ్ ||  (శివ)సువర్ణమాలా స్తుతిః)
తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సామ్బే పరబ్రహ్మణి ||  (సాంబ)దశశ్లోకీ స్తుతిః) 
 
సంసార-దుఃఖ గహనా జ్జగదీశ రక్ష ||    (శివ నామావళ్యష్టకమ్) 
తస్మై ““కారాయ నమః శివాయ ||(“న,మ,శి,వ,య” కారాయ)(శివపఞ్చాక్షర స్తోత్రమ్)
పాలయాధునా దయాలవాల తే నమః శివాయ | (శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రమ్)
దానవాంధకార చండభానవే నమః శివాయ | (శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రమ్) 
సర్వ మన్మనోజ భంగ దాయినే నమః శివాయ | (శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రమ్)
కష్ట నాశనాయ లోక జిష్ణవే నమః శివాయ | (శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రమ్)
క్షన్తవ్యో మే2పరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో || (శివాపరాధ క్షమాపణ స్తోత్రమ్) 
 
నమో నమః శఙ్కర పార్వతీభ్యామ్ ||  (ఉమామహేశ్వర స్తోత్రమ్) 
నమః శివాయై చ నమః శివాయ |  (అర్ధ నారీశ్వర స్తోత్రమ్)
 
గౌరీ మంబా మంబురుహాక్షీ మహ మీడే |   (గౌరీ దశకమ్)
త్రిలోచన కుటుంబినీం త్రిపుర సుందరీ మాశ్రయే |  (త్రిపుర సుందర్యష్టకమ్ )
భిక్షాం దేహి కృపావలంబన కరీ మాతాన్నపూర్ణేశ్వరీ |  (అన్నపూర్ణా స్తుతిః)
శ్రీశైల స్థల వాసినీం భగవతీం శ్రీ మాతరం భావయే | (భ్రమరాంబాష్టకమ్)
 
మీనాక్షీం ప్రణతో2స్మి సంతత మహం కారుణ్య వారాంనిధిమ్ | (మీనాక్షీ పంచరత్నమ్)
మధ్యాహ్నే మలయధ్వజాధిప నుతే మాం పాహి మీనాంబికే | (మీనాక్షీ స్తోత్రమ్)
మాతః పూర్ణ సుధా రసార్ద్ర హృదయే మాం పాహి మీనాంబికే | (మీనాక్షీ స్తోత్రమ్)
మద్దారిద్ర్య భుజంగ గారుడ ఖగే మాం పాహి మీనాంబికే | (మీనాక్షీ స్తోత్రమ్)
ముద్రారాధిత దేవతే మునినుతే మాం పాహి మీనాంబికే | (మీనాక్షీ స్తోత్రమ్)
మంత్రారాధిత దేవతే మునినుతే మాం పాహి మీనాంబికే | (మీనాక్షీ స్తోత్రమ్)
మద్విద్యే మదభీష్ట కల్పలతికే మాం పాహి మీనాంబికే | (మీనాక్షీ స్తోత్రమ్) 
పూర్ణే పూర్ణకళాభిరామ వదనే మాం పాహి మీనాంబికే | (మీనాక్షీ స్తోత్రమ్)
సర్వైశ్యర్యమయీ సదాశివమయీ మాం పాహి మీనాంబికే | (మీనాక్షీ స్తోత్రమ్)
 
ఫాలభూ తిలక లోచనాం – మనసి భావయామి పరదేవతామ్ |(నవరత్న మాలికా స్తోత్రమ్)
ఇందిరా రమణ సోదరీం – మనసి భావయామి పరదేవతామ్ |(నవరత్న మాలికా స్తోత్రమ్)
మారవైరి సహచారిణీం – మనసి భావయామి పరదేవతామ్ |(నవరత్న మాలికా స్తోత్రమ్)
చారుచంద్ర రవిలోచనాం – మనసి భావయామి పరదేవతామ్ |(నవరత్న మాలికా స్తోత్రమ్)
మణ్డలాంత మణిదీపికాం – మనసి భావయామి పరదేవతామ్ |(నవరత్న మాలికా స్తోత్రమ్)
వారణాంత ముఖ పారణాం – మనసి భావయామి పరదేవతామ్ |(నవరత్న మాలికా స్తోత్రమ్)
పద్మినీం ప్రణవ రూపిణీం – మనసి భావయామి పరదేవతామ్ |(నవరత్న మాలికా స్తోత్రమ్)
మాతృకాం త్రిపుర సుందరీం – మనసి భావయామి పరదేవతామ్ |(నవరత్న మాలికా స్తోత్రమ్)
కాళికా మఖిల నాయికాం – మనసి భావయామి పరదేవతామ్ |(నవరత్న మాలికా స్తోత్రమ్)
 
తం సంసార ధ్వాంత వినాశం హరిమీడే |  (హరిస్తుతిః)
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ | (లక్ష్మీనృసింహ కరుణారస స్తోత్రమ్)
చేతో భృంగ భ్రమసి వృథా భవ-మరుభూమౌ విరసాయాం –
భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజ మకరందమ్ | (లక్ష్మీనృసింహ పంచరత్నమ్)
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణో2క్షి-విషయః |   (కృష్ణాష్టకమ్)
జగన్నాథః స్వామీ నయన-పథగామీ భవతు మే |   (జగన్నాథాష్టకమ్)
పరబ్రహ్మ లింగం భజే పాండురంగమ్  |  (పాండురంగాష్టకమ్)
భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే |   (మోహముద్గరః)
క్ష్మామా నాథ మనాథం ప్రణమత గోవిందం పరమానందమ్ |  (గోవిందాష్టకమ్)
కాలత్రయ గతిహేతుం ప్రణమత గోవిందం పరమానందమ్ |    (గోవిందాష్టకమ్)
 
భజే శారదాంబా మజస్రం మదంబామ్ |  (శారదా భుజంగ ప్రయాతాష్టకమ్)
 
కాశికా పురాధినాథ కాలభైరవం భజే |  (కాలభైరవాష్టకమ్)
సా కాశికా2హం నిజబోధ రూపా |  (కాశీ పంచకమ్)
 
ధునోతు నో మనో మలం కలింద నందినీ సదా |  (యమునాష్టకమ్)
జయ యమునే జయ భీతి నివారిణి సంకట నాశిని పావయ మామ్ | (యమునాష్టకమ్)
త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే |  (నర్మదాష్టకమ్)
 
ప్రకటనలు

ట్యాగులు: , ,

ఒక స్పందన to “శ్రీ శంకరాచార్య కృత స్తోత్రరత్న మకుటాలు !”

  1. Dr.R.P.Sharma Says:

    చాలా చక్కని సేకరణ. ధన్యవాదములు.
    ఇలాగే శంకరుల సూక్తులను కూడా సేకరించి వ్రాయవచ్చు.ఉదా:- కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి; వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః…….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: