నీవు ఎవరివి?(WHO ARE YOU?)

నీవు ఎవరివి ? ( WHO ARE YOU ? )

పై ప్రశ్నకు, ” నేను ఫలానా ” అని సహజంగా తోచే జవాబును బట్టే
ఒక మనిషి యొక్క దృక్పథం, వ్యక్తిత్వం ఆధారపడి ఉంటాయి.

ఉదాహరణకు: “నేను మగవాడిని, లేక నేను ఆడదానిని” అనే
భావం రూఢిగా ఉన్నవారికి లింగ-వివక్ష ఎక్కువగా ఉండే అవకాశం
ఉంటుంది.

“నేను బ్రాహ్మణుడిని, లేక నేను వైశ్యుడిని, మొ. ” భావం
ప్రథమంగా స్ఫురించేవారికి వర్ణ ( కుల ) వివక్ష ఎక్కువగా ఉండే
అవకాశం ఉంటుంది.

“నేను హిందువును, మహమ్మదీయుడను, లేక క్రైస్తవుడను,మొ.”
భావం ప్రప్రథమంగా బలంగా స్ఫురించేవారికి, పరమత-సహనం
తక్కువగా ఉండే అవకాశాలే ఎక్కువ !

“నేను ఆంధ్రుడిని, లేక నేను బెంగాలీని, మొ.”
అనే భావం మొదట బలంగా స్ఫురించే వారికి భాషా, రాష్ట్ర-వివక్ష
ఎక్కువగా ఉంటుంది. వీరికి అఖిల భారత స్థాయి పదవీబాధ్యతలు
అప్పగించినా సరే, ప్రాంతీయ భేదభావనతో, ప్రాంతీయ-అసమానత
లనే పెంచుతారు; భారతమాతకు క్షోభనే కలిగిస్తారు !

కాబట్టి, ” నీవు ఎవరివి ?” అని ప్రశ్నిస్తే వెంటనే స్ఫురించవలసిన
ఆదర్శవంతమైన జవాబు ఈపాటికే మీకు స్ఫురించి ఉంటుంది !

********************************************************

“నేను భారతీయ – ఆంధ్ర – హిందూ – తెలుగు – (కుల) – బాలుడను
/ బాలికను; నా పేరు …”

” I am a Bharatiya, Andhra, Hindu, Telugu, (Caste),
Boy / Girl , by Name: ..” .

“భారత సంస్కృతి వారసులం, అందుకు ఎంతో గర్విద్దాం;
భారతమాతే మనలను చూసీ, గర్వపడేలా జీవిద్దాం ! ”

******************************************************

అని భావించే నిత్య – అభ్యాసం విద్యార్థి దశనుంచీ చేస్తే,
వారి దృక్పథం ఎంత విశాలంగానూ, ఎంత శాంతియుత-సహజీవన
దోహదకరంగానూ ఉంటుందో ఒక్కసారి ఊహించండి !

Then, they will be naturally inclined to keep :

Nation’s interests above State’s;
State’s interests above Religion’s;
Religion’s interests above Language’s;
Language’s interests above Caste’s;
Caste’s interests above Family’s;
Family’s interests above Gender’s;
Other Gender’s interests above Self’s !

BHAARAT ( INDIA ) NEEDS SUCH
HUMAN-RESOURCES, which are your wards –
Our Dear PARENTS and TEACHERS !

Won’t you contribute, what is within your reach,
to Mother Bhaarat, to whom all of us owe a lot more?!

(NOTE : Please click on the title ” kamthasthabharathi”
at the top of this Post, to get a full view of the side-bar.
Then, in the side-bar, you may click on any related
topic of your interest.)

ప్రకటనలు

ట్యాగులు: , , , ,

9 వ్యాఖ్యలు to “నీవు ఎవరివి?(WHO ARE YOU?)”

 1. rathnamsjcc Says:

  మానవ జీవితంపై గురువు ప్రభావం
  నిన్ను నీవు తెలుసుకోకుండా. జ్ఞాన0
  . గురువును సేవిస్తే సకల దేవతలనూ సేవించిన ఫలితం వస్తుంది.
  ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, జ్ఞాన0. జగత్తును తెలుసుకోవాలనుకుంటే, అది నిన్ను చూసి వెక్కిరిస్తుంది. నీ మనస్సు యొక్క ఫలితమే, ప్రపంచం. ముందు ఆ మనస్సుని తెలుసుకో. తర్వాత జగత్తును చూడు. అప్పుడు అది ఆత్మ కంటే అన్యంగా, భిన్నంగా , విడిగా లేదని తెలుసుకుంటావు”
  గురువులు చెప్పింది నీన్ను. నీవు తెలుసుకోవడమే ఆసలెన జ్ఞాన0• తన మనస్సు ద్వారానే తాను పరమాత్మస్వరూపమని తెలుసుకొని, తన్ను తాను తెలుసుకోవటమే పరమ ధర్మం

  ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి తెలుసుకోవడమే ప్రపంచమంతా మాయలతో నిండి ఉన్నది. అందులో నుంచి బయటపడి మాయాతీత స్థితిని సాధించాలంటే ముందుగా ఈ రెండింటిని అధిగమించాలని చెప్పిన మహనీయులలో జ్ఞాన మార్గమే ఆత్మ స్థితికి దారి తీయగలదని ఉద్బోధించిన ఆత్మ సత్యం ఒక్కటే అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకో • మనసు పునీతం దైవం అంటే మరేదో కాదు, నీలో నిక్షిప్తమైన దైవ భావన, దేవుని ఆరాధన అంటే కేవలం దేవాలయాల్లో దైవాన్ని పూజించటమే కాదు, తన్ను తాను పూజించటమే• ఆధ్యాత్మిక జీవనం అంటే లౌకిక జీవనంలోని అవకతవకలను విడనాడి దేవుడు, జీవుడు వీరి అనుబంధం సక్రమంగా అర్థం చేసుకోవడమే.అయితే నేడు ఆధ్యాత్మికత అర్థం మారిపోయింది. గుళ్లు గోపురాలు దర్శించి, చెప్పింది వినటం మాత్రమే ఆధ్యాత్మికత అని భావిస్తున్నారు. దీన్ని అలుసుగా తీసుకొని అమాయక భక్తులను మోసగించే అనైతిక గురువులు స్వాములు కూడా బయలుదేరినారు.వీరు ఆధ్యాత్మికత ముసుగులో ఎన్నో దురాచారాలు చేసి, మన వేలుతో మన కన్ను పొడుస్తున్నారు. గురువులు
  గురువు జ్ఞాని అయినవరు. మాత్రమే నిజమైన కర్మయోగి కాగలడు.నిష్కామ కర్మమ భోదించిన ఇక్కడ కర్మ చేయడమా చేయకపోవడమా అనేది ముఖ్యం కాదు.కర్మ చేస్తున్నదెవరు అని నిరంతరం ప్రశ్నించుకోవాలి.కర్మ చేస్తున్నప్పుడు నేను కర్తను అనే భావనతో చేస్తే కర్మ ఫలితాలను తప్పక
  అనుభవించి తీరాలి.చేసే కర్తను నేను కాదు,ఒక దివ్యచైతన్యం సూక్ష్మ శక్తి తనరూపకంగా ఆపని చేయిస్తున్నదని స్వయంగా తెలుసుకున్నప్పుడు ,జ్ఞాని ఎంతటి కర్మ తనద్వార జరుగుతున్న నిశ్చలంగా ఉంటాడు. జ్ఞానం కలవాడే నిజమైన .కర్మ ఫలితాలు అతనిని తాకనైనా తాకలేవు. అతని హృదయంలో ఎల్లప్పుడూ నివసించేవాడు జ్ఞాని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు అతడు ఎంతో భక్తితో అతిథిని సేవించి సేద తీర్చేవాడు. పరమానందాన్ని కలిగించింది. కాని ధీరులు సర్వకాల సర్వావస్థలయందు తమ స్వాభావిక సద్గుణాలను విడిచిపెట్టరు. 1
  2

  సూక్ష్మ బుద్ధితో పరీక్షిస్తే (ఆది శక్తి) పరమాత్మ యొక్క ప్రత్యక్షస్వరూపం. . గురువు అనుగ్రహం వచ్చింది పరమాత్ముని అమృతవాక్యాలు గురువు నీవు జ్ఞానస్వరూపుడవు. నీ మాటలు మాకు శిరోధార్యములు. గురువు పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమని భావించి పూజిస్తారు. గురువు భక్తి శ్రద్ధలతో విధినసురించి చేసిన పూజ ఫలించి సాక్షాత్కరించాడు గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యొగ్యతను గనిపెట్టి, వారి మనస్సు కలత చెందకుండ తగిన బోధచేసి, తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునను ఈ జ్ఞానం సమస్తం స్పష్టంకాగలదు. శాస్త్రాలను మించినది ప్రత్యక్షానుభవం. నీలో నిన్ను లోతుగ … తన సహజస్ధితియైన ఎరుక శుద్ధ ఎరుక చైతన్యం త్వమునుండి విడిపోకుండ చూడటమే ఉపదేశ రహస్యము. .. ఆత్మ నేనే ఆత్మ కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. సద్గురు శిష్యుడు బేధంలేదు. ఆత్మను చక్కగా తెలుసుకొన్నాను’ అనుకొంటే నువ్వు గ్రహించింది నిశ్చయంగా అతి స్వల్పమే. అందువల్ల గురువు లో దానిని ఇంకా ఇంకా తెలుసుకోవాలి గురువు యొక్క అమృతవాక్యాలు ఆత్మ నాకు బాగా తెలుసని భావించడం లేదు; తెలియదనీ భావించడం లేదు. ఎందుకంటే నన్ను గురించి నాకు తెలుసు. ‘ఆత్మను గురించి తెలియదు. అదే సమయంలో తెలియదని చెప్పడమూ సాధ్యం కాదు, అని మనలో ఎవరు అనుకొంటారో అతడే.సద్గురువు ఆత్మ ను గ్రహించినవాడు తాననువాడు ఒకడున్నాడు. తన్ను వదలినపుడే తన పరిచయం కాగలదు. తన్ను వీడి తాను నిలుచు తత్త్వమే నిత్యం..సూక్ష్మ స్థితిలొ సాధన ఆత్మ అజం, అమరం. చావు పుట్టుకలు పరమార్ధంలో లేవు. గురువు పాత్ర ఉన్నతమైనది. గురువు సహాయం లేకుండా ఏ జీవి మనుగడ సాధించలేదు గురువు అనుగ్రహాన్ని పొందాలి శిష్యునికి ఆత్మానుభూతి కలుగుతుంది, జీవన్ముక్తుడౌతాడు. సత్యాన్ని తెలుసుకునే ముక్తిమార్గం శిష్యుని శ్రేయస్సు కోరడం ద్వారా గురువు పాత్ర పరిపూర్ణమవుతోంది. పుణ్యతీర్థాల దర్శనం ద్వారా లభించే పుణ్యాన్ని మంచి గురువు వద్ద చేరి, ఆయన ప్రవచనాలను వినడంతో పొందవచ్చని వేద పురాణాలలో చెప్పబడింది. ‘గురువు గొప్పవాడైతే శిష్యునికి సిద్ధి కలుగు తుంది- శిష్యుడు గొప్ప వాడైతే గురువుకు ప్రసిద్ధి కలుగు తుంది’ ఒక గొప్ప శిష్యుని చూసి అసూయ పడ్డ గురువు ఆ గురుత్వానికే అనర్హుడు. అలా అసూయ చేతిలో చిక్కి తన జీవితాన్ని కోల్పోవటమే కాక ఇద్దరికి కడుపు కోత మిగిల్చిన నిజమైన శిష్యునికి నిజమైన గురువు లభించడమనేది భగవంతుని వరంగానే భావించాలి. ఇంకా చెప్పాలంటే గురువంటే శిష్యుని ఎదుట సాకార రూపంతో నిలిచిన పరమాత్మమే ప్రసిద్ధి కలుగు తుంది’ ఆత్మను అనుభవపూర్వకంగ గ్రహించాల్సిందేగాని ఉత్తమాటలు పొసగవు. ఉప్పునీటిలోని ఉప్పు కంటికి కనిపించదుఆత్మకంటికి కనిపించదుఅనుభవపూర్వకంగ గ్రహించాల్సిం

 2. rathnamsjcc Says:

  నీవు ఎవరివి ప్రశ్నకు, ” నేను నేనే ఆత్మ

 3. rathnamsjcc Says:

  నీవు ఎవరివి ?” అని ప్రశ్నిస్తే వెంటనే స్ఫురించవలసిన
  ఆదర్శవంతమైన జవాబు ఈపాటికే మీకు స్ఫురించి ఉంటుంది !నేను నేనే ఆత్మఆత్మ నేనే ఆత్మ కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. సద్గురు శిష్యుడు బేధంలేదు. ఆత్మను చక్కగా తెలుసుకొన్నాను’ అనుకొంటే నువ్వు గ్రహించింది నిశ్చయంగా అతి స్వల్పమే. అందువల్ల గురువు లో దానిని ఇంకా ఇంకా తెలుసుకోవాలి గురువు యొక్క అమృతవాక్యాలు

 4. samanvayabharathi Says:

  My dear Ratnamsjcc garu,
  నమస్కారములు. మీయొక్క వ్యాఖ్యలు చాలా విజ్ఞానాత్మకంగానూ, జ్ఞానసాధకులకు పనికివచ్చే విధంగానూ ఉన్నత స్థాయిలో ఉంటున్నాయి. ఈ బ్లాగు యొక్క ప్రధాన లక్ష్యం తెలుగు బాలబాలికలకు జీవితాంతం గుర్తుకు వస్తూ, నైతిక, ధార్మిక, సత్పౌరవిధులను, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించగల వివిధ భాషలలోని ( ప్రధానంగా తెలుగు, సంస్కృతం ) పద్య, గేయ, సూక్తి రత్నాలను అందించటం.
  కాబట్టి, ఈ లక్ష్యానికి అనుగుణమైన సూక్తి రత్నాలు మీ దగ్గర ఉన్న వాటిని అందరితో పంచుకుంటూ ఉండవలసిందిగా మనవి.

 5. rathnam.sjcc Says:

  భగవంతుడు ఒక్కడే ” ఏది నిత్యం? – ఆత్మ ఏది అనిత్యం? :: (దేహము ./ ఏది సత్యం? బ్రహ్మo

  భగవంతుడు ఒక్కడే అని అందరూ అంటారు కాని మతాలు ఎన్నో. తమ మతమే గొప్పది అంటూ ఇతరుల మతాన్ని విమర్శిస్తారు. ఒక్కోసారి ద్వేషిస్తారు. పరమాత్మ ఒక్కడే కాని పండితులు ఆయనను అనేక పేర్లతో పిలుస్తారు.
  మనలో కొంత మంది వివిధ పేర్లతో ఉన్న దేవుళ్లను పూజిస్తారు. కొంత మంది రాముని, మరి కొంత మంది కృష్ణుని, అల్లా, క్రీస్తు, దేవీలను పూజిస్తారు. అయితే కంటికి కన్పించే దేవుళ్లలో గురువు కూడా ఒకరని తెలుసుకోవాలి. మనుషులు ఒకచోటినుంచి మరొకచోటికి వలసపోవడం ఆదిమానవులకు తెలుసు కనక ఎన్నో ఏళ్ళుగా “అలవాటుపడ్డ” శరీరాన్ని వదిలి వెళ్ళవలసిన అవసరం ఆత్మకు కూడా ఏదో ఒకనాడు కలుగుతుందనేది గురువు కి సహజంగానే అనిపించి ఉంటుంది.
  బ్రహ్మo అనుభూతి సత్యాన్ని గురించి ఎవరూ, ఎవరికీ బోధించలేరు

  బ్రహ్మo అనుభూతి బయటలేదు. అది నీతో నీలోనే తెలియబడాలి. బ్రహ్మo సత్యాణ్వేషణ నిమిత్తం అరణ్యములు తిరగటం, కొండగుహలలో పడియుండటం అవసరంలేదు. ప్రతిదినము వీలున్నంత సమయంలో ఆత్మ విచారణ సలుపవలయును. ఇక కర్మ క్షేత్రంలో ఏ ఆటంకములు, విఘ్నములు ఏమి చేయలేవు. క్రమంగ సర్వత్ర ఆత్మానుభూతి సిద్ధిస్తుంది. ఈ దశలో అంతయు యోగశక్తిగ మీ పనులు సాగిపో గలవు. అడవులపాలై తిరిగినంత మాత్రమున లాభంలేదు. మిధ్యా నేనును, సైతాన్ భ్రాంతిని వదలాలి. ఇది అసలైన సన్యాసం, పరివ్రాజక స్ధితి. ముందుగ నిన్ను నీవు సన్యసించుకో. నిన్ను విసర్జించిన అసలైన నేను శేషిస్తుంది. ఆ నేనే సర్వలోకములకు వెలుగు. ఇదియే విశ్వగర్భ దైవ నేను. సంకుచిత, పరిమిత నేను అంతర్ధానమైనపుడు ఆత్మ కేంద్రంలో నిజమైన సత్య దైవ నేను వెలుగును. అరణ్య మధ్యంలో యున్నను కల్లోలిగ మనసుకు శాంతిలేదు. ఎటు వ్యవహరించినా శిరస్సును ప్రశాంతంగ ఉంచినచోట ఏకాంతం మానసికా వస్ధ. సర్వకాలాలకు చెందిన సత్యాత్మ స్వరూప స్వభావమే నిజముక్తి. ఇది ఫలానా వారికనే నిబంధనలేదు. మనో పరిపక్వత ననుసరించి ఎవ్వరైనను పొందవీలున్నది. ప్రతివారి చరమ లక్ష్యం ఇది. మోక్షానికి అడ్డు నిలిచే మిధ్యా నేనును తొలగించాలి. మానసిక అభ్యంతరాలు రహితం కావాలి. పరిస్దితుల మార్పుకన్న మనో మార్పు ముఖ్యం. ఈ మారు మనసే ఆత్మదర్శనకారి. ఏ వ్యక్తిగాని బహిర్గతమైన ప్రవర్తనవల్ల హక్కులను పొందలేడు. అతనెంతవరకు సత్యస్వరూపుడో అంతవరకే అతని హక్కులు పరిమితమై యుండును. అతని సత్యానికి కొలబద్ద అతని చైతన్యమే. ఈ చైతన్య స్వాతంత్ర్యము పొందడానికి ప్రతివ్యక్తి తన క్షుధ్ర అహమును విసర్జించాలి. గీతాసారమంతయు ఇందులోనే గలదు.
  జ్ఞానోదయం కానంతవరకు అజ్ఞాన దెబ్బలు తప్పవు. సమస్త జీవజగ త్తులు ఉప్పునీటిలో వలె ఎచ్చట లయిస్తున్నాయో, ఎచ్చట మానవ హృదయాలు ఐక్యతా భావంతో వర్ధిల్లుచున్నవో, ఎచ్చట సమస్త దేవతా దేవుండ్లు సర్వైక్య పరిపూర్ణ స్ధితిలో ప్రకాశిస్తున్నారో అదియే నా ప్రార్ధనా మందిరము. ఈ నా దేవాలయమును భూలోక సిరిసంపదల మొత్తం ధారవోసినను నిర్మించలేరు. కేవలం ఆత్మౌపమ్య భావ నిష్ట నొందిన యోగీశ్వరులకే నా ఆలయ ప్రవేశార్హత పరమ భాగ్యం. నామ, రూప, దృశ్య నాటకం, చూపు, రూపుల వ్యవహారం లేదు. సర్వాత్మ అనంత దివ్య భావ ప్రకటన సమస్త యుగముల ఆరాధన మూల సూత్రమిది. విశ్వ మతములన్ని ఇచ్చట సంగమించి తీరగలవు. ఇదియే సర్వకేంద్ర దైవపదవి. మీరందరు ఈ పదవిని పొందు నిమిత్తం వారస జ్యోతులై నిలువాలి.

  ఒక్కమాటలో అసలు విషయం బట్టబయలు చేయుచున్నాను.తన్ను తాను తెలుసుకొనక బ్రహ్మాండమంతయు పరిశీలించినను వృధా శ్రమయే మిగులుతుంది. తన నిజస్ధితిలోనే అఖిలాండకోటి బ్రహ్మాండ ములు విలీనమై యున్నవి. బాహ్య కర్మకాండ తతంగమంతయు మన తృప్తి కొరకే. మనసు జోడించని, హృదయశుద్ధిలేని కేవల బాహ్యాడంబర ములు నిజదైవమును మెప్పించలేవు. సర్వధరిత, సర్వభరిత, సర్వాధార, సర్వాకర్షణ సూక్ష్మ చైతన్య సర్వశక్తి కేంద్రుడైన విశ్వగర్భుని నుండియే సమస్త దివ్యశక్తులు ఉదయిస్తున్నాయి. అహమచల, అనంతాత్మాలయ, సర్వాకార, సర్వస్వరూప, సచ్చిదానంద నిలయ, బ్రహ్మవిద్వరిష్ఠా గరిష్ఠ, తురీయాతీతుడే సర్వేశ్వరుడు.
  అనంత సృష్టికి మూలకారణం ఏమిటి ఆ ఏమిలేని శూన్యం మాత్రం కాదు. ఇది సూక్ష్మ చైతన్య ప్రభావమేగాని ఇంకేమియునుకాదు. జగద్గురువుగ, అవతారమూర్తిగ నమ్మించవచ్చు. కాని పిదప అయోమయ దు:ఖ స్ధితి తధ్యం. వేర్లులేని కొమ్మలవంటివి స్ధితికుదురని చేష్టలు. తన్ను తానెరింగి ఆత్మార్చన శీలియైన ఘనుడు భగవంతుని నిండా అర్చించిన వాడగును. అందులకే నిన్ను నీవెరింగి నీ నిజాత్మ స్ధితిలో స్వస్వరూప ప్రజ్ఞతో వర్ధిల్లాలి. ఇదియే సమస్త మత ధర్మములసారం.సమస్త.పూజల.సారాంశం. అఖండం. నీ పరిధిలో నీవు నిశ్చలుడవై నిలువనేర్చుకో. ఎవరిని మందలించినా నేను అంటారు. ఆ నేను ఎవరు? ఆ నేను స్త్రీయా, పురుషుడా? ఆ నేనుకు వయస్సెంత? శరీరంలో నేననునది ఏ భాగము. శరీరము నేనుకాదు. శరీర నిలుకడకు ఆధారముగ నేనున్నానని తెలుసుకో. ఈ ఆత్మ నేనుకు కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. అదియే సజీవాత్మ. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ స్ధితిలో సైతం ఈ నేను అవిచ్చిన్నముగ భాసిల్లుచున్నది. ఇట్టి నేను పరిజ్ఞానమే పరలోక దైవరాజ్య ప్రవేశం. మీలో ఎందరు ఈ పరిజ్ఞాన మును కలిగియున్నారో పరీక్షించుకోండి. జీవాత్మ నేనుకు హృదయ మందిరమే సరియైన ఆలయం. ఈ లోకంలో నిర్మించిన దేవాలయములన్నియు ను బాహ్యవేడుకేలు మాత్రమే. సమస్త యాత్రలకు మూలం నేను అని తెలుసుకో. నీవు లేకుండ, నీవు పోకుండ ఏ యాత్రలు వర్ధిల్లనేరవు. నీతో సర్వం ఏకీభవించి యున్నదని రూఢిపరచుకో. ఆకాశము శబ్ధగుణ రూపమైనది. ఆకాశమునకావల పరమ నిశ్శబ్ధము, కేవల పరమశివ అచలాద్వైతం నిండి భాసిల్లుచున్నది. ఇట్టి శివస్వరూప శక్తివలన పంచభూతములు ఆవిర్భవించినవి. పంచమూతముల సం యోగమే జగత్తు. సంసారము, పంచభూతములు అన్నియును సూక్ష్మ చైతన్య శక్తిలోనే ఇమిడియున్నవి. కావుననే దానికి అనంతుడు, అవ్యక్తుడు, సూక్ష్మ చైతన్య సర్వవ్యాపియైన దేవదేవుడు దేహధారియైనపుడు జీవుడని పిలువబడు ను. జీవుడు అల్పజ్ఞుడు. భగవంతుడు సూక్ష్మ చైతన్య అన్నింటికి కర్తయై జీవుల యంత్రముగ గిరగిర త్రిప్పుచున్నాడు.
  బేధంలేదు. మమాత్మా సర్వ భూతాంతరాత్మ. నా సూక్ష్మ చైతన్య ఆత్మే సర్వ భూతములలో భాసిల్లుచున్నదని భావించి కేవలం ఆత్మౌపమ్య భావనిష్ఠలో నిలచిన జ్ఞాని సర్వమును తనలో, సర్వములో తనను దర్శించ గలుగును. ఇట్టి అఖండాత్ముని దైవస్ధితిలో పూజించినను దోషంలేదు. ఇట్టి అఖండ జ్ఞానమును ప్రతివారు సంపాదించి అనుభూతి చెందాలి.

 6. మహేష్ Says:

  నేను ఎవరొ తెలుసుకొనేందుకు కొన్ని మార్గాలున్నాయి. కొన్ని ప్రక్రియలున్నాయి.
  ఒకటి) సాత్వికాహారం : సాత్వికాహారం అంటే శాఖాహారం. మొక్కల లేక చెట్ల నుండి లభించే ఏ ఆహారం ఐనా సాత్వికాహారం అవుతుంది. పాలు సాత్వికాహారం కాదు. జంతువుల నుండి వస్థాయి కాబట్టి. కేవల సాత్వికాహార స్వీకరణ వలన మనస్సు మన స్వాధీనం లొ వుంటుంది.
  రెండు) సధ్గ్రంధ పఠనం : మనస్సుకు మంచి ఆలొచనలు వస్తాయి.
  మూడు) సధ్ద్ సాంగత్యం : సధ్ద్ గురువు లాంటి వాళ్ళతొ స్నేహం వలన దారి తప్పకుండా ఉంటాం.
  పైమూడు చేస్తూ, కొరికలను పూర్తిగా జఇంచి, ప్రతి పనిని నిశ్కామం గా చేయాలి. ప్రపంచం లొ ఉండీ, దానికి అతీతం గా ఉండాలి. ఇలా ఉంటే జ్ఞాని అంటారు. శరీరాన్ని వదలి కేవలం మనస్సు లొపలకు వెళ్ళి, ఎలాంటి ఆలొచనలు లేక నిశ్చలం గా వుండగలగాలి. దీన్నే యోగం అంటారు, చేసే వాడే యోగి. ఇలా చేస్తే అనంత మైన శక్తి వస్తుంది. దానికి ప్రలొభ పడక ధ్యనిస్తే తత్వమసి అని తెలుస్తుంది. అంటే అంతానేనే.

 7. rathnamsjcc Says:

  గురువు. ఉపదేశం .అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన0 దర్శనమయ్యింది

  అజ్ఞానంతో అంధకారంలో పడి కొట్టు మిట్టాడే వారికి. అహంకారం అనే చక్రంలో పడి గిర గిరా తిరిగే వారికి. “అతితీర్శతామ్ తమోంధమ్” గాఢమైన చీకటిలో ఆత్మేమిటో పరమాత్మేమిటో ఎందుకు మనం ఇక్కడికి వచ్చామో కూడా తెలుసుకోకుండా ఇందులోనే పడి కొట్టుకునే వారిని కూడా తరింపజేయటానికి వచ్చినటువంటి గురువు. ఉపదేశం గ్రంథం ఇది. రుచి ఉండి శ్రద్ధ ఉండి, జ్ఞానులని ఆశ్రయించి ప్రార్థన చేస్తే పెద్దలు చేసే ఉపదేశం తప్పకుండా తరింపజేస్తుంది. అందులో సందేహం లేదు అజ్ఞానులని కూడా జ్ఞానులుగా, భగవంతుని పరికరాలుగా తీర్చి దిద్దే మహోపదేశాన్ని గురువు. మనకి ఉపదేశించారు. గురువును మించిన దైవం మరొక్కటి లేదని, … ఈ మోక్షాన్ని కలిగించే మార్గాన్ని అనుసరించమని చేసిన ఉపదేశం
  ఆత్మ విషయంలో కానీ పరమాత్మ విషయంలో కానీ మనం చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉండటం అంటే ఏమిటంటే కన్ను ఉంటుంది, వస్తువు ఉంటుంది కానీ ఆకాన్ను వస్తువుని చూసే శక్తి చాలదు. మధ్యలో ఆవరించి ఉన్న చీకటిని తొలగించి కంటికి ఆ వస్తువుని కన్పింపజేసేట్టుగా మధ్యలో వెలుతురు కావాలి. వెలుతురునిచ్చే దీపం కావాలి. అనాదిగా అంటి పెట్టుకున్న కర్మ వాసనల దొంతరలు లెక్క లేనన్ని పేరుకొని ఉన్నాయి. మనలో జ్ఞానం సహజంగానే ఉంది కానీ , ఆ జ్ఞానాన్ని పైకి తెచ్చుకోవడానికి గురువులు తమ జ్ఞానాన్ని తోడుగా ఇచ్చి పైకి తెస్తారు. ఇదివరకు మనల్ని అడ్డే పొరలని దాటి వచ్చే శక్తిని గురువులు ఉపదేశం ద్వారా ఇస్తారు. వారి ఉపదేశం లోనికి వెళ్ళి క్రమేమి కర్మ వాసనలు తొలగుతాయి. “అధ్యాత్మ దీపమ్”, దీపం కొత్తగా వస్తువులని తెచ్చి చూపదు. వస్తువు అక్కడే ఉంటుంది కానీ దీపాన్ని వెలిగించి పెట్టుకుని ఉన్నంత వరకు ఆవస్తువుని కనిపించేట్టు చేస్తుంది. ఆత్మ స్వరూపాన్ని పరమాత్మ స్వరూప స్వభావాల్ని స్పష్ట పరిచే దీపాన్ని మహర్షి వెలిగించి పెట్టాడు,

 8. rathnamsjcc Says:

  మనిషి నిజ జ్ఞానాన్ని పొందాలంటే తనను తాను తెలుసుకోవాలి
  నీవు నీవు కాదని, నీవంటే నీలోపలే ఉన్నావని తెలుసుకోవాలి

  మనిషి నిజ జ్ఞానాన్ని పొందాలంటే తనను తాను తెలుసుకోవాలి నీవు నీవు కాదని, నీవంటే నీలోపలే ఉన్నావని తెలుసుకోవాలి
  నిన్ను నువ్వు తెలుసుకోవడం ఒక్కటే మార్గం. సమస్తం నీలోనే ఉందనే సత్యం వైపు అడుగులు పడాలి. అది నిజజ్ఞానాన్ని పొందేందుకు తోడ్పడుతుంది. నీలో మాన వుడు అతి శక్తివంతుడు. ఆ శక్తివంతుడైన మానవుడిని నీవు గుర్తించగలిగితే మరి వేటితోటి పని లేదు
  నేనెవరు? ఎక్కడినుండి వచ్చాను? ఎక్కడికి పోతు న్నాను? అనే ప్రశ్నలను నీకు నీవు ప్రశ్నించుకుంటూ కళ్లు మూసుకుని దృష్టిని లోపలికి సారిస్తే మొదట అంతా చీకటిగా కనిపిస్తుంది. కాని దానిని సాధన చేస్తూంటే వెలు గులు విస్తరిస్తాయి. నీవు వేసుకున్న ప్రశ్నలన్నింటికీ సమాధానం లభిస్తుంది.

  గురువు ఎవరు?ఆత్మ సత్యాన్ని తెలిసినవాడు. దానిని తెలుసుకోవాలను కొనేవారికి త్రికరణ శుద్ధిగా సహకరించేవాడు గురువు. గురువుల వచనాన్ని గ్రహించకపోవడమే విషయం గురుసేవ చేస్తూ, మనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని, గురువు అనుగ్రహానికి పాత్రులమై, గురువు అనుగ్రహం చేత ఉపదేశానుసారం మనం జీవితాలను నడుపుకోవాలి. విద్యకు పూర్ణత, అనుష్టానాన్ని కలిగించే వారు గురువులు. అజ్ఞానాంధకారం సద్గురువు అనుగ్రహం వలనే తొలగును. గురు కటాక్షంతో ఆర్తుడైన వాని చిత్తమందు అజ్ఞానం తొలగి ఆత్మ రూపుడైన భగవంతుని సాక్షాత్కారముచే నిత్య సుఖశాంతులు కలుగును
  గురువు నన్ను రక్షించుగాక అన్ని జన్మలలోను నేను గురువు యెడ నమ్మకము, విశ్వాసముతో ఉండి గురువుదేవుడు నా మనస్సులో ఎల్లప్పుడు నిలిచి యుండుగాక.
  అన్ని జన్మలకన్నా మానవ జన్మ ఉత్తమమైనది అని అందరికీ తెలుసు. మన జీవితాన్ని సార్థకం చేసుకొనే అవకాశం మనకి భగవంతుడు ఈ జన్మలోనే అందరికీ ఇచ్చాడు. మానవ జన్మ ఎత్తినందుకు ఆ అవకాశం ఉపయోగించుకోవటమనేది మన చేతుల్లోనే ఉంది. ప్రతివారు వారి కర్మ ఫలాన్ని తగ్గించుకోవటానికి, పూజలు చేయటం, సత్కార్యాలు చేయటం, తీర్థ యాత్రలు చేయటం చేస్తూ వుంటారు. పూర్వ జన్మ కర్మ ఫలితాన్ని తగ్గించుకోవటానికి మార్గం మనకు సద్గురువులు చూపారు

  మనలోనే ఉన్న దేవుడు మనకు ఇలాంటి అనుభూతులు కలిగిస్తాడు అని, దేవుడు సర్వాంతర్యామి అని. బయట ఉన్న దేవుడు, మనలో దేవుడు ఒక్కడే అని తెలుసుకొన్నప్పుడు నీవే నేను నేనే నీవు అనేది గుర్తుకు వస్తుంది. అలాంటి స్థితి మనం తెచ్చుకోవాలి ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించటమే మనం చేయవలసిన పని. ఆ మార్గానికి వెళ్లటానికి సద్గురువులే సహాయం చేస్తారు
  మనలోనే ఉన్న దేవుడే ప్రత్యక్ష సాక్షి. భగవంతుని నిరంతరం ధ్యానించిన వారికి, గురువు అనుగ్రహించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు

  గురువు బోధనతో శిష్యుడు తాను కూడా సర్వహితావలంబిని కావాలెనని మనసులో ధృఢంగా నిశ్చయించుకున్నాడు

  మనిషి నిజ జ్ఞానాన్ని పొందాలంటే తనను తాను తెలుసుకోవాలి. పైకి కనిపిస్తు న్నట్లు నీవు నీవు కాదని, నీవంటే నీలోపలే ఉన్నావని తెలుసుకోవాలి. ఇటువంటి విషయాన్ని గుర్తించడానికి ఎవరినో ఆశ్రయించాలి గురువు
  మానవుడు తనను తాను గుర్తించకుండా ఎక్కడో ఎవరో మహాను భావుడున్నాడని, ఎన్నో సాధించిన యోగిపుంగవుడు న్నాడని వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లడం చేస్తూనే ఉన్నారు. ఇదంతా నిన్ను నువ్వు తెలుసుకోవడానికి అడ్డంకి మాత్రమే. గుళ్లవెంట, గోపురాల వెంట తిరిగితే ఎలాంటి ప్రయోజనాన్ని పొందలేము. అలా వెళ్లినప్పుడు ఏదైనా ఆనం దం, తృప్తి కలిగినా అదంతా తాత్కాలికమేనని తెలుసుకోవాలి. శాశ్వత మైన ఆనందం దక్కాలంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం ఒక్కటే మార్గం. సమస్తం నీలోనే ఉందనే సత్యం వైపు అడుగులు పడాలి. అది నిజజ్ఞానాన్ని పొందేందుకు తోడ్పడుతుంది. నీలో మాన వుడు అతి శక్తివంతుడు. ఆ శక్తివంతుడైన మానవుడిని నీవు గుర్తించగలిగితే మరి వేటితోటి పని లేదు. దీనికి ఏ గురువులు లేరు. నీకు నీవే గురువు. నీకు నీవే శిష్యుడివి. నిన్ను నీవు తెలుసుకునే మార్గంలో, గుర్తించే మార్గంలో నీ నిశితమైన దృష్టిని నీ లోపలికి సారించాలి. అలా దృష్టిని నీలో నిలిపే క్రమంలో నీ దృష్టి అన్ని వస్తువులపైకి పదే పదే పోతుండవచ్చు. అయితే క్రమక్రమంగా అలవాటు పడుతుంది. దీనికి సాధన అవసరమని ముందే చెప్పుకున్నాము. అట్టి సాధనకు కాలపరిమితి ఆ వ్యక్తుల ఏకా గ్రతనుబట్టి ఉంటుంది. దీన్ని సత్యాన్వేషణగా చెప్పు కోవచ్చు. ఆ సత్యాన్వేషణ నిజ జ్ఞానంవైపు నడిపి స్తుంది. అప్పుడు నీలోని సర్వరుగ్మతలు తొలగి పోయి ఒక సత్య మానవుడిగా వెలుగొందుతాము.
  నేనెవరు? ఎక్కడినుండి వచ్చాను? ఎక్కడికి పోతు న్నాను? అనే ప్రశ్నలను నీకు నీవు ప్రశ్నించుకుంటూ కళ్లు మూసుకుని దృష్టిని లోపలికి సారిస్తే మొదట అంతా చీకటిగా కనిపిస్తుంది. కాని దానిని సాధన చేస్తూంటే వెలు గులు విస్తరిస్తాయి. నీవు వేసుకున్న ప్రశ్నలన్నింటికీ సమాధానం లభిస్తుంది.
  ఆ వెలుగులో నీకు నీవు కనిపించడం సాధ్యమవు తుంది. నిన్ను నీవు దర్శించుకుని, నీవెవరో తెలుసుకొని, సత్య మాన వుడిగా అవతరించడానికి అన్వేషణాపథంలో కదలాలి. అంతర్గత మానవుడిని దర్శించి నప్పుడు కలిగే ఆనందమే అన్నిటికన్నా అత్యుత్తమ మైన ఆనందం. ఆ ఆనందాన్ని పొందిన వాడే సత్య మానవుడు. విశ్వమానవుడు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: