నామ స్మరణం

భారతీయుల నరనరాల లోను దైవీ భావన నిండి ఉంటుంది. ఇష్ట దైవాలు వేరు కావచ్చు; కాని దైవానుగ్రహం కోసం ప్రయత్నం అందరూ చేస్తారు. వాటి అన్నింటిలోకీ, ఎటువంటి నియమాల బాదరబందీ లేకుండా సర్వకాల సర్వావస్థల లోను ఎవరైనా సరే తమ తమ ఇష్ట దైవంతో భక్తి పూర్వక సంబంధం ఏర్పరచుకోగల  గొప్ప సాధనం ” నామ స్మరణం”.

భగవన్నామాలను భక్తిభావనతో రంగరించి, మనం హాయిగా ఆవృత్తి చేసుకోవటానికి వీలుగా, ఒక లయతో, ఛందోబధ్ధంగా శ్లోక, పద్య మకుటాలుగానో పాదాలుగానో కూర్చి మనకు అందించిన మహర్షులకూ, భక్త కవులకూ, వాగ్గెయ కారులకూ శత కోటి వందనాలు !

అలాంటి వాటిలో లభ్యమైన వాటిని క్రమ క్రమంగా మీ ముందు ఉంచే ప్రయత్నం కొనసాగిస్తాం. మీరు సేకరించిన పరిమళ కుసుమాలను కూడా అందజేస్తే, పదిమందికీ మేలు చేసిన వారౌతారు !

ముఖ్యంగా చిన్న పిల్లలకు ఒక ఇష్ట దైవాన్ని ఎంచుకోమని చెప్పి, ఆ దైవానికి సంబంధించిన, వారి నోటికి పట్టే నామాన్ని అలవాటు చేస్తే, వారు పెద్దవారు అయ్యే సరికి కొన్ని లక్షల నామ స్మరణం పూర్తి అయి, పురాణ గాథలలో వలె భగవంతుని కృపకు విశేష పాత్రులు కాగలరు !
(1)శివ నామం:
హర నమః పార్వతీ పతయే | హర హర మహాదేవ ||
హర హర మహాదేవ | శంభో శంకర పాహి మామ్ ||
సాంబ సదాశివ శంభో శంకర | శరణం మే తవ చరణ యుగమ్ ||
నమో నమ శ్శంకర పార్వతీభ్యామ్ ||
నమ శ్శివాయై చ నమ శ్శివాయ ||
దారిద్ర్య దుఃఖ దహనాయ | నమ శ్శివాయ ||
క్షంతవ్యో మే2పరాధం | శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో !
తదేకొ2వశిష్టః | శివః కేవలో2హమ్ ||
చిదానన్ద రూపః శివో2హం శివో2హమ్ ||

(Please click on the title of this Post “Kamthastha Bharathi”, to get a full view of the Side-bar. Namams of other daities also will be added on a continuing basis.)

ప్రకటనలు

ట్యాగులు: , , ,

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s


%d bloggers like this: