(1311) కుమారీ శతక సారం

కుమారీ శతక సారం

***************

(I)కుమారీ శతక సూక్తులు:
*****************************
(13/1) బాలికలు:
________________
హితమాచరింప వలయును
*బ్రతుకున కొక వంక లేక పరగు కుమారీ.
నీ తలిదండ్రులకు నప
ఖ్యాతులు రానీయగూడ దమ్మ కుమారీ.
సత్సేవ యందు దిరిగిన
మాత్సర్య మణగు దెలిసి మనుము కుమారీ.
..  లేమి మెలగ నేర్చిన
వనితకు లోకమున వన్నె వచ్చు కుమారీ.
ఇరుగు పొరుగిండ్ల కైనను
తరుణి స్వతంత్రించి పోవ దగదు కుమారీ.
..    పెద్దలు రా,
నురవడి బీటలు మంచము
లరుగులు దిగుచుండ వలయు నమ్మ కుమారీ.
బంతులను బక్షపాత మొ
కింతైనను జేయరాదు
ఎంతటి యాకలి గలిగిన
బంతిన గూర్చుండి ముందు భక్షింపకు.
అధికారము లేని పనుల
కధికారము సేయబోకు.
(13/2) యువతులు:
______________
..      కోరిన రీతిన్
ధవుని కొనగూర్ప వలయును.(deb)
.విను చెడ్డ యైన నెప్పుడు
*దన పతియే తనకు దైవతంబు కుమారీ. (deb)
********************************************************

 

 

II. కుమారీ శతక సార పద్యములు :

(19/8)26.

పోకిళ్ళు పోక పొందిక

నాకులలో పిందె రీతి నడకువగా నెం

తో కలసి మెలసి యుండిన

లోకము లోపలను దా వెలుంగు గుమారీ!

(19/8)35.

బద్ధకము సంజ నిద్దుర

వద్దు సుమీ దద్దిరంబు వచ్చును దానన్

గద్దింతు రింటి వారలు

మొద్దందురు తోడివారు ముద్దు కుమారీ!

(19/8)39.

తల వాకిట నెల్లప్పుడు

నిలువగ రాదెప్పు డెంత నిద్దుర యైనన్

మెలకువ విడరాదు సుమీ

తల నడచుచు విప్పికొనుట తగదు కుమారీ!

(19/8)42.

నడకలలో నడుగుల చ

ప్పుడు వినబడకుండ వలయు భువి, గుంటలు క

న్పడరాదు మడమ నొక్కుల

బడతుల మర్యాద లెరిగి బ్రతుకు కుమారీ!

(19/8)43.

వారికి వీరికి గలిగెను

గోరిన వస్తువులు మాకు గొదువాయె నటం

చూరక గుటకలు మ్రింగుట

నేరముగా దలపవలయు నెలత కుమారీ!

(19/8)46.

పొంత పని సేయ కెన్నడు

పంతంబులు పలుక బోకు, ప్రాజ్ముఖముగ నీ

దంతంబులు దోమకు మే

కాంతంబులు బయలు పరుపకమ్మ కుమారీ!

(19/8)47.

వేళాకోళంబులు, గ

య్యాళితనంబులును, జగడ మాడుటలును, గం

గాళీపోకలు, గొండెము

లాలోచించుటయు గూడ వమ్మ కుమారీ!

(19/8)55.

సరకుల యెడ జాగ్రత్తయు

జురుకు పనుల యందు, భక్తి సుజనుల యందున్

గరుణ యనాథుల యెడలం

దరుణికి జెలువార వలయు ధరణి కుమారీ!

(19/8)58.

చెప్పకు చేసిన మేలు నొ

కప్పుడయిన గాని, దాని హర్షింపరుగా

గొప్పలు సెప్పిన నదియును

దప్పే యని చిత్తమందు దలపు కుమారీ!

(19/8)60.

చెడు గనిపించుకొనుటకున్

గడియైనను బట్టకుండు, గాంతలలో నె

క్కుడు గుణవతి యనిపించెడు

నడవడి నేర్చుటయె గొప్ప తనము కుమారీ!

(19/8)61.

తనకంటె బేదవాండ్రం

గని యంతకు దనకు మేలుగా యనవలయున్

దనకంటె భాగ్యవంతుల

గని గుటకలు మ్రింగ మేలు గాదు కుమారీ!

(19/8)63.

కోపముల నప్పుడాడ ని

రూపించిన మాట కొన్ని రోజులు చనినం

జూపట్ట దనుచు శాంతము

లోపల గొనవలయు ధర్మలోల కుమారీ!(&18)

(19/8)65.

విరుగబడి నడువ గూడదు

పరుల నడక లెన్ని, తప్పుబట్ట జనదు, ని

ష్ఠురములు వచింప గూడదు

కఱపగ వలె మేలు, మేలు గలదు కుమారీ!

(19/8)67.

సరకులు బట్టలు వన్నెల

కెరవులు తేదగదు, తెచ్చెనేని సరకుల

క్కర దీర్చుకొనిన వెంటనె

మరలింపక యున్న దప్పుమాట కుమారీ!

(19/8)69.

గొప్పదశ వచ్చె ననుచు నొ

కప్పుడయిన గర్వపడకు, మది తొలగినచో

జప్పట్లు జఱతు రందరు

దప్పని దండించు దండధరుడు కుమారీ!

(19/8)70.

గురుశుక్ర వారముల మం

దిర గేహళులందు లక్ష్మి తిరముగ నిలుచున్

గర గరిక నలికి మ్రుగ్గిడి

గురుభక్తి మెలంగ బాయు గొదువ కుమారీ!

 

(19/8)79.

పనిచేయు నపుడు దాసీ

వనిత విధంబునను మేను వంపగ వలయున్

ధనవంతుల సుత యైనను

ఘనత గలుగు దాని వలన గాదె కుమారీ!

(19/8)80.

శ్రమ యెంత సంభవించిన

క్షమ మరువగ రాదు, ధరణి చందంబున స

త్యమున బ్రవర్తించు యా

రమణియె లోకంబునందు రమణి కుమారీ!

(19/8)92.

తుడుపు దుమారమ్మును జెరు

గుడు ధూళియు, మేష రజము గూడదెపుడు మై

బడ నెఱిగి తిరుగ నేర్చిన

బడతుక మర్యాద లెఱిగి బ్రతుకు కుమారీ!

(19/8)94.

ఇద్దరు గూడుక యొకచో

నొద్దిక మాటాడుచుండ నొదిగి యొదిగి యా

యొద్దకు జన గూడదు తన

పెద్దతనం బెల్ల నణగ బెట్టు కుమారీ!

(19/8)95.

మఱువ వలె గీడు, నెన్నడు

మఱువంగా రాదు మేలు, మర్యాదలతో

దిరుగ వలె, సర్వజనములం

దరి బ్రేమ మెలంగ వలయు ధరణి కుమారీ!

(19/8)99.

సన్నెకలున్ బొత్రమ్మును

దన్నుకు పోరాదు, కాల దగిలిన యెడలన్

కన్నుల నద్దుకొన న్వలె

గ్రన్నన సిరి యందు నిలుచుగాన కుమారీ!

(19/9)87.

దృశ్య పదార్థము లెల్లను

నశ్యములని తలప కుండినను లోపంబౌ

దృశ్యంబున నస్థిరత న

వశ్యము చిత్తమున దలప వలదె కుమారీ!(

boys also)(19/17)71.

వాణియు శర్వాణియు హరి

రాణియు వాక్కునను మై నురంబున నుంటల్

రాణ దిలకించి మదిలో

బాణిగ్రాహి యెడ నిల్పు భక్తి కుమారీ!

(19/17)22.

ధనవంతుడైన యప్పుడు

పెనిమిటి చిత్తం బెరిగి పెండ్లాము మెలం

గును, లేమిన్ మెలగ నేర్చిన

వనితకు లోకమున వన్నె వచ్చు గుమారీ!

(19/17)76.

వడ్డించునపుడు తా గను

బిడ్డనికి దల్లి భంగి బ్రేమ దలిర్పన్

వడ్డింప వలయు భర్తకు

నెడ్డెతనము మానవలయు నెందు కుమారీ!

(19/18)20.

తన బావల పిల్లల యెడ

దన మఱదుల పిల్లలందు దన పిల్లల కం

టెను మక్కువ యుండ వలెన్

వనితల కటులైన వన్నె వచ్చు కుమారీ!

(19/18)25.

తలిదండ్రు లన్నదమ్ములు

తులదూగగ నిమ్ము పసిడితో నైనను, వా

రల యింట సతత ముండుట

వెలదికి మర్యాద గాదు వినవె కుమారీ!

(19/18)28.

పతి కత్తకు మామకు స

మ్మతిగాని ప్రయోజనంబు మానగ వలయున్

హిత మాచరింప వలయును

బ్రతుకున కొక వంక లేక బరగు కుమారీ!

(19/19)52.

విసుగకు పని తగిలిన యెడ

గసరకు సేవకుల మిగుల, గాంతుని తోడన్

రొసరొస పూనకు, మాడకు

మసత్య వచనంబు లెన్నడైన కుమారీ!

(19/19)68.

కలహపడు నింట నిలువదు

కలుముల జవరాలు గాన గలకాలంబే

కలహములు లేక సమ్మతి

మెలగంగా నేర్తువేని మేలు కుమారీ!

**************************

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: