(1310) మహిళా భారతి – వేమన, మొ: గ్రంథ సూక్తులు

(I) వేమన సూక్తులు: (13 – స్త్రీలు )

****************************
(13/1)  బాలికలు:
_______________________
1-71.     గుణవతి యగు యువతి – గృహము చక్కగ నుండు       

              చీకటింట దివ్వె చెలగు రీతి

              దేవి యున్న యిల్లు-దేవార్చన గృహంబు||విశ్వ||

1-73/3.         అల్పనరుల కెల్ల నతివలపై మోజు!

2-5/3.       ఆడువారి చిత్త మటువలె నుండురా! 

2-29/3.        పసిడికన్న మిగుల పడతి మాటలు తీపి.

2-30.         పనస తొనల కన్న పంచదారల కన్న

                  జుంటి తేనె కన్న జున్ను కన్న

                  చెరుకు రసము కన్న చెలిమాట తీపిరా!

2-45/3.        తనకు గలుగు సిగ్గు దైవ మెరుంగురా!

2-70.        నీళ్ళమీద జూడు నెరయ నోడల పర్వు

                బయలు మీద జూడు  పక్షి పర్వు

                నాడువారి గమన మాలాగు నుండురా! ||విశ్వ||

2-124/3. పరమ సాధ్వి చూడ పరుల నంటదు సుమీ

2-193/3.       ఇక్కడ తగుగాక నక్కడ తగదిట్లు.

2-226.     స్త్రీ నెత్తిని రుద్రునకును

                 స్త్రీ నోటను బ్రహ్మ కెపుడు, సిరి గుల్కంగా

                  స్త్రీ నెరి రొమ్మున హరికిని

                  స్త్రీ నెడపగ గురుడ వీవు దేవర వేమా !

2-380/2.  స్త్రీల నడక వలన సిగ్గు బోయె.
*****************************************
(13/2)   యువతులు :        
________________________

1-61/2. తెచ్చిపెట్ట, యాలు మెచ్చ నేర్చు.

1-237/1. అమ్మ సుమీ యాలనగా

2-9/3.     పేద పడ్డ వెనుక పెండ్లాము గతి చూడు.

2-11/2,3. అఖిల నింద కెల్ల నాలయంబు

                పరపురుష గమనము ప్రత్యక్ష నరకంబు.

2-16/1.   మాట వినని యాలు మగనికి మృతి యౌను

2-25.     కలిమి గలిగెనేని కాముగా జూతురు

             లేమి చేత జిక్కి లేవలేని

            .మదను వంటి వాని మొప్పెగా జూతురు|విశ్వ|

2-36/1,2.మంచి రుచుల గోరు మంచి స్త్రీలను గోరు

               మనుజు డెంత చెడ్డ మనసు జూడ!

2-42.     పతిని విడువరాదు పదివేల కైనను

              పెట్టి చెప్పరాదు పేదకైన

              పతిని దిట్టరాదు సతి రూపవతి యైన||విశ్వ||

2-71/1,2. ఆలు రంభ యైన, సతి శీలవతి యైన

                జారపురుషు డేల జాడ మాను?

                ఊరివాడ కుక్క మరిగిన చందంబు ||విశ్వ||

2-73/1,2. కలిమినాడు మగని కామిని సూచును

                 లేమి జిక్కునాడు లేవకుండు!

2-77/1,2. పంకజాక్షి గన్న, బంగరు బొడగన్న

                 దిమ్ముబట్టి యుండు తెలివి కెల్ల !

2-132.     సతుల జూచి నరుడు సౌఖ్యంబు గోరును

               గతుల గానలేడు కర్మమందు

               గతులు సతుల వలన గానంగ లేరయా |విశ్వ|

2-134.    స్త్రీలు గల్గు చోట చెల్లాటములు గల్గు

                స్త్రీలు లేని చోటు చిన్నబోవు

                స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా|విశ్వ|

2-146.   ఎర్రనాడుదాని నేపార జూచిన

             వేకి బుట్టి చాల వెర్రి బుట్టు                              

            పల్లు దెరచి నగిన బట్టు పెన్భూతంబు!  ||విశ్వ||

2-209/1,2.. ఆలిహపర సౌఖ్యములకు

                 నాలయ మైనట్టి దైన నాలన వచ్చున్
    
                 ఆలాగున గాకుండిన

                 కాలుని పెనుదూత యదియె గదరా  వేమా!

2-296/1. పతికి మారు బల్కు పడతియే దుఃఖంబు

2-334/3.  వారకాంత లేల వలతురు యూరక !

3-32/3.     ఇంతికి పతిభక్తి యెంతన వచ్చును!      

3-145.     పతి యొప్పిన సతి యొప్పును

               పతి సతు లొకటైన పరమ పావన మందున్

               సతి పతి న్యాయమె మోక్షం

               బతులిత పరమాత్మ నైక్య మగురా వేమా !

3-187.       .బాహ్య విద్యలెల్ల వేశ్యల వంటివి

                  భ్రమల బెట్టి తేటపడగ నియవు

                  గుప్త విద్య యొకటి కులకాంత వంటిది||విశ్వ||

3-255.    ఆనుకూల్యము గల యంగన గలిగిన

              సతికి పతికి పరమ సౌఖ్య మమురు

             .ప్రాతికూల్య మైన పరిహరింప సుఖంబు||విశ్వ|| 
**********************************************

(13/3)   గృహిణులు :
__________________________
1-121.  మగని కాలమందు మగువ కష్టించిన

             సుతుల కాలమందు సుఖము బొందు   

             కలిమిలేమి రెండు గల వెంతవారికి

             బలిమి పుత్రబలిమి బలిమి వేమ.     

2-69/3.   సతికి సుతుని వలన సౌఖ్యంబు గలుగును
 
***************************************************************************

 
(II) హితోపదేశం-మిత్రలాభం-7వ కథ నుండి —–
**************************************

 

13/1. బాలికలు:

_____________________

195. శ్లో|| అసత్యం సాహసం మాయా మాత్సర్యం చాతిలుబ్ధతా |
           
              నిర్గుణత్వ మశౌచత్వం  స్త్రీణాం దోషాః స్వభావజాః ||

(వ్యాఖ్య):   అబద్ధము లాడుట, సాహసము, మాయా వర్తనము, అసూయ, లోభిత్వము, గుణరాహిత్యము, శుచిత్వరాహిత్వము అనునవి
సాధారణ స్త్రీలకు సహజ స్వభావము.  ఈ దోషములను దరిజేర నివ్వని స్త్రీలు
సౌశీల్యవతులు.

 

13/2. యువతులు :

________________________

196.* శ్లో|| సా భార్యా యా గృహే దక్షా    సా భార్యా యా ప్రజావతీ |

             సా భార్యా యా పతిప్రాణా    సా భార్యా యా పతివ్రతా || 

(వ్యాఖ్య): ఏ యువతి అయితే – ఇల్లు చక్కదిద్దు కోవటంలో సమర్థురాలో, 
                   ”           -సంతానం కలిగి ఉంటుందో్,  
                   ”           -పతికి ప్రాణముగా ఉంటుందో,   మరియు
                               – పతియే ప్రాణముగా కలిగి ఉంటుందో,
                   ”           – పతివ్రతగా, అనగా పతియొక్క హితము                                      ప్రియములే పరమ లక్ష్యములుగా కలిగి ఉంటుందో
            అట్టి స్త్రీయే  ” భార్య ” అనబడ దగినది!
 
197. శ్లో || న సా భార్యేతి వక్తవ్యా    యస్యా భర్తా న తుష్యతి |

              తుష్టే భర్తరి నారీణాం    సంతుష్టాః సర్వదేవతాః ||

(వ్యాఖ్య):  ఏ స్త్రీయొక్క భర్త అయితే సంతుష్టి చెందడో, ఆమె ” భార్య” అని చెప్పబడ దగినది గాదు!  భర్త సంతుష్టి చెందితే, ఆ నారీరత్నము పట్ల సకల
దేవతలూ సంతుష్టి చెందుతారు!

******************************************************************************************

(III)”శ్రీ శుష్క వేదాంత తమో భాస్కరము” అను గ్రంథము నుండి
                  శ్రీ మళయాళ స్వామి వారి ఉపదేశాలు
                 ****************************************

 

13/1. బాలికలు :

________________

 

 

 

 

* ” స్త్రీణాం బుద్ధి శ్చతుర్గుణమ్ ” . (. అబలలు అని పిలవబడే స్త్రీలకు దేహబలము      కన్న బుద్ధిబలము నాలుగురెట్లు ఉంటుంది.) 

*విద్య శబ్దమునకు జ్నానమని అర్థము. జ్నానమనగా నిది చేయవచ్చును, ఇది చేయ దగదు; ఇది పుణ్యము, ఇది పాపము అని తెలుసుకొనుట. ఇది అమృతము అని తెలిసిన తరువాత విషమును తినువారు ఎవరైన నుందురా? (జ్నాన)సూర్యుడు ఉదయించిన తరువాత (అజ్నాన) అంధకారం నిలుస్తుందా?

*పురుషుల కంటె స్త్రీలకే జ్నానము ముఖ్యముగా నుండవలెను.
అందరమూ బుద్ధి వచ్చు వరకు తల్లి యొద్ద నుండుటచే, తల్లియొక్క జ్నానము, గుణములే బిడ్డలకు తప్పక గలుగును .

*కుటుంబములో తమ తరువాతి 2,3 తరములకు మార్గదర్శనం చేయటం, విభిన్న మనస్తత్వాలు గల వ్యక్తుల మధ్య సమన్వయం సాధించ వలసిన స్త్రీలకు- విద్య ఎంతేని అవసరం.

*జోలపాటలు కూడ మంచి కీర్తనలు, తత్త్వములు పాడేవారు గదా! మరి నేడో !
చిన్నతనమునుండి బిడ్డలకు “మంచి నడతలను ” నేర్పించినచో అవి యెప్పటికినీ
నశించదు.
(ఉదా):గుమ్మడితీగ దేనిని ఆశ్రయించునో, దానినుండి వేరు చేయ సాధ్యముకాదు.
(వ్యాఖ్య): ” మంచి నడతలు” ఏవి అనే అవగాహన అందరికీ ఒకేలాగ ఉండదు.
             అందుకే, వేల సంవత్సరాలుగా అన్నిటినీ కాచి వడబోసిన మన                          మహర్షులు, పూర్వీకుల అనుభవ సారాన్ని గ్రహించి, ఆచరించటం                   సులభం,లాభం,క్షేమం.

13/2. యువతులు:

__________________

* శ్లో||  అనుకూల కళత్రో యః  తస్య స్వర్గ ఇహైవ హి |
        ప్రతికూల కళత్రస్య  నరకో నాత్ర సంశయః ||

* శ్లో||  సంతుష్టో భార్యయా భర్తా   భర్త్రా భార్యా తథైవ చ |
        తస్మిన్నేవ కులే నిత్యం  కళ్యాణం తత్ర వై ధృవమ్ ||

*భార్య భర్తయొక్క అదుపాజ్నలలో నుండుట – భర్తయొక్క మానసికగ్లాని నివారణకును, సంతాన శ్రేయోభివృద్ధికిని,   ఆమెయొక్క సామాజిక గౌరవమునకును, ఆ కుటుంబముయొక్క కళాకాంతులకును అత్యావశ్యకము!

*మంచి గురువునకు శ్రేష్ఠుడైన శిష్యుడు దొరకిన యెట్లు అనుకూలమో,
అట్లే పురుషునకు మంచి భార్య దొరకినచచో అన్ని విషయములకు పూర్తి
అనుకూలకరము.  అట్లే,
శ్రేష్ఠుడైన గురువు దొరకిన శిష్యున కెంత యుపయోగకరమో,  అట్లే
పవిత్రుడగు భర్త సిద్ధించిన, స్త్రీకి జన్మసాఫల్యము!

*పతివ్రతలై, దైవభక్తి పరాయణలై, సత్యధర్మ పరాయణలై, అతిథిసత్కార నిష్ఠ
గలవారిని లోకపాలికలు, జగన్మాతలని నేను నమ్ముచున్నాను.

13/3. గృహిణులు:

__________________

*సతీపతుల మనఃప్రాణము లేకముగా నుండవలెను.
భర్తయొక్క బ్రహ్మనిష్ఠకు భార్య సహకరించ వలెను.
భార్యయొక్క భగవద్భక్తికి భర్త ఆటంకము చేయరాదు.
భార్యకూడ భర్తను మంచిమార్గములో త్రిప్పుటకై మరల మరల ప్రయత్నించు చుండవలెను. వేగముగ భర్తను నిరసింపరాదు.

*గర్భవతుల విచారము(ఆలోచన) ననుసరించి సంతానము కలుగును. విచారము(ఆలోచన, భావన) “మూస” వంటిది;
మనస్సు ” కరిగిన కంచు” వంటిది.
(ఉదా) :  ప్రహ్లాదుడు, అభిమన్యుడు.

*స్థూల దేహమునకు మాత్రమే స్త్రీ-పురుష భేదము గాని, సూక్ష్మదేహ కారణదేహములకు ఎలాంటి భేదమును లేదు.కావుననే ఇప్పుడు స్త్రీగా నున్న జీవుడు జన్మాంతరమున పురుషుడుగా జన్మించ వచ్చును!

*తల్లిదండ్రులకు అన్నవస్త్రములు కష్టములేక సిద్ధించుటకు, ప్రపంచ సంగతి
వారితో జెప్పక, వారి నిష్ఠ పూర్తి యగుటకు తగు సహాయము చేయుట అనునదే
సంతానముయొక్క ప్రథమ కర్తవ్యం గాని, చనిపోయిన తరువాత పుత్రుడు పితృతర్పణాది క్రియలచే తల్లిదండ్రుల నుద్ధరించుట అనునది ద్వితీయ కర్తవ్యమే.

*విశేష ధనమున్న వారికిని, అధిక దారిద్ర్య మున్నవారికిని బ్రహ్మనిష్ఠ కష్టము.
అధిక సమయము పని చేయాలి. అన్నవస్-త్రాదులకు కష్టములేని స్థితి పరమాత్మ యేర్పరచినచో, గృహస్థబ్రహ్మనిష్ఠులు బహు భాగ్యవంతులు!

****************************************************************************************

 

(IV) ఇతర గ్రంథాల సూక్తులు:

***********************************

13/1.  ” భార్యా శ్రేష్ఠతమ స్సఖా ! ” 

13/2. “అనుకూలాం విమలాంగీం
             కులజాం కుశలాం సుశీలసంపన్నామ్ |
         సుభార్యాం పురుషః   — పుణ్యోదయాత్ లభతే!  

(V)ఆలోచనలు:  (స్త్రీలు)
************************

(13/2) యువతులు :
__________________
*తమ పుట్టినింటి లో రెండు(తాతల, తండ్రుల) తరాలను గమనించిన అనుభవంతోను,  పెళ్ళి అయేవరకు బంధుమిత్రుల కుటుంబాలలో గమనించిన అనుభవముతోను, పురాణేతిహాసాది సద్విషయములను వినటం, చదవటం,చూడటం వల్ల గ్రహించిన ఉచితానుచిత వివేకంతోను, మానసిక పరిణతి చెందిన యువతులు – పెళ్ళి అయ్యాక తమ అత్తవారింటిలోనూ ఇరుగు పొరుగులలోనూ ఎంతగా రాణిస్తారు!

*పెళ్ళి అవగానే ఆడపిల్ల గోత్రం మారుతుంది. అంటే మామ (భర్త) గారి గోత్రంలో (వంశంలో) తరువాతి తరాన్ని అందించే పవిత్ర బాధ్యత తనదే నన్నమాట!తమ పుట్టింటి పద్ధతులు ఎలా ఉన్నా,అత్తవారింటి పద్ధతులనే (మరీ శాస్త్రవిరుద్ధం కానంతవరకు) పాటిస్తూ, తమ పిల్లలకూ అవే నెర్పే ఇల్లాలు ఇల్లు నిజంగా శాంతినివాసమే!

ప్రకటనలు

ఒక స్పందన to “(1310) మహిళా భారతి – వేమన, మొ: గ్రంథ సూక్తులు”

  1. ravi Says:

    this is very good sir/medam. your role is very importent in our socity. BCZ all our old history to protect & save that valueble matter.in future all are appriciate to you. thank you for giving this valueble poems & sentences.

వ్యాఖ్యలను మూసివేసారు.


%d bloggers like this: