(305A2) తెలుగు సూక్తి భారతి (వేమన సూక్తులు -2)

 

    (11)  పురుషులు :
237 ఆడువారి వంక నందరు చుట్టముల్ !
238 ఇంటి యాలు విడిచి యెట్లుండ వచ్చురా!
239 గతులు సతుల వలన గానంగ లేరయా
240 ఘనతర మోహంబు చేటు గదరా వేమా!
(13) స్త్రీలు ) :
(13/1) స్త్రీల విశిష్ట గుణాలు :
241 గుణవతి యగు యువతి – గృహము చక్కగ నుండు  
242 స్త్రీలు గల్గు చోట చెల్లాటములు గల్గు
243 స్త్రీలు లేని చోటు చిన్నబోవు
244 స్త్రీల నడక వలన సిగ్గు బోయె.
245 ఇక్కడ తగుగాక నక్కడ తగదిట్లు.
246 ఇచ్చి పుచ్చుకున్న హితమైన మనుములు , –
      కాచి పూచి పండి కడు రమ్యమై యుండు!
(13/2) శీల రక్షణ – భద్రత :
247 అల్పనరుల కెల్ల నతివలపై మోజు!
248 పల్లు దెరచి నగిన బట్టు పెన్భూతంబు!
249 మగువ రూపు జూచి మనసు మరచు.
250 అతను చేతి కత్తు లమరంగ కాంతలు! 
     ( అతను = తనువు లేనివాడు, మన్మథుడు )
251 మంచి రుచుల గోరు మంచి స్త్రీలను గోరు, –
           మనుజు డెంత చెడ్డ మనసు జూడ 
(13/3)  సతి – పతుల ప్రేమ బంధం :
252 స్త్రీ నెరి రొమ్మున హరికిని
253 స్త్రీ నెత్తిని రుద్రునకును   (నెత్తి నెక్కిన గంగకు, –
              – అర్థాంగి గౌరి కున్న గౌరవం లేదు)
254 పతి సతు లొకటైన పరమ పావన మందున్
255 పరమ సాధ్వి చూడ పరుల నంటదు సుమీ
256 పతిని దిట్ట రాదు సతి రూపవతి యైన
257 మనసు నిలక త్రాడు మరి వన్నె దెచ్చునో? (మాంగల్యం)
258 ఆనుకూల్యము గల యంగన గలిగిన, –
          సతికి పతికి పరమ సౌఖ్య మమురు  
259 సతికి పతికినైన సంపద సంపదే? –
        పుత్త్ర సంపదలును భువిని మేలు
260 పతి యొనర్చు మంచి సతికి సగము,
     పతి యొనర్చు చెడ్డ సతి కేల రాదురా?
(13/4) గృహంలో (ఆర్థిక) శాంతి సౌఖ్యాలు :
261 కలిమి లేమి రెండు గలవెంత వారికి
262 నింటి లోని పోరు నింతింత గాదయా
14.చతుర్విధ పురుషార్థాలు: ( ధర్మార్థకామమోక్షాలు )
(14/1)  ధర్మం  (మానవ సామాన్య ధర్మాలు) :
263 తనువు లస్థిరములు ధర్మంబు నిత్యము
264 చేయు ధర్మమెల్ల చెడని పదవి
265 ధార్మికునకు గాని ధర్మంబు గనరాదు
266 చిత్తశుద్ధి గల్గి చేసిన పుణ్యంబు, –
       కొంచె మైన నదియు కొదువ గాదు
267 ఇరుగు పొరుగు వారి కెనయు సంపద జూచి, –
          తమకు లేదటన్న ధర్మమేమి? 
268 ధర్మమన్న తొల్లి దన్నుక చచ్చిరి, –
          కర్మఫలము నేడు గలిగె వేమ !
269 ఇహము నందు బాధ లెన్నైన బడవచ్చు, –
        పరము బాధ లేక బ్రతుకుడీ నరులార
270 దానములను యన్నదానము దొడ్డది  
271 ఆకలన్న వారికన్నంబు బెట్టితె, 
      హరున కర్పితముగ నారగించు  
272 తట్టుబడక మదిని తన్నుకోక, –
     తన్ను గాదనుకొని తా బెట్టినది పెట్టు
(14/2)  ధర్మం   (విశేష ధర్మాలు):(వర్ణాశ్రమ, కులవృత్త్యాది) :
273 కులము హెచ్చు తగ్గు గొడవలు పనిలేదు, –
          సానుజాత మయ్యె సకల కులము
(14/3) వర్ణ ధర్మములు –  (ద్విజులు) :
274 జ్ఞాన సత్యములును సమమైన ద్విజుడగు
275 ద్విజుడ నేననగ నధిక మేమి తనవల్ల?
276 మంచి గుణము లేక మరి ద్విజు డెట్లగు?
277 మనసు నిల్పకున్న మరి ద్విజు డెట్లగు!
(14/7)  అర్థం  (ధనం) :
( 14/7- i )  ధనం – ప్రాధాన్యం :
278 ధనమే మూలము జగతికి, –
   ధనమే మూలంబు సకల ధర్మంబులకున్
279 ధనము యెవరి సొమ్ము,ధర్మమే తన సొమ్ము
280 భూమి నాది యన్న భూమి పక్కున నవ్వు, –
          దానహీను జూచి ధనము నవ్వు.
281 రోగి కిడిన వాని రాగి బంగారౌను!
282 ధనము లేమి యనెడు దావానలంబును, –
        తన్ను జెరుచును  దరిదాపు జెరుచు
283 కలిమి లేములు రెండు గల వెంతవారికి
( 14/7 – ii )  ధనం – ఆర్జన :
284 ధైర్య మొదవదేని ధనము లేదు
285 కుడవకెల్ల ధనము కూడబెట్టు.
286 ఋణము సేయు మనుజు డెక్కువ కెక్కునా ?
287 పరుల మోసపుచ్చి పరధన మార్జించి, –
        కడుపు నింపుకొనుట కాని పద్దు 
288 యెన్నాళ్ళును దాను నేర్చి యెన్నిట వెలయున్?
(14/7 – iii )  ధనం – వినియోగం :
289 బహుళ ధనము గలిగి భద్ర మార్గంబున, –
          పరుల కుపకరించి ప్రబలు వేమ !
290 తాము నొకరి కిచ్చు ధన మింతియే కాక, –
          కడమది తమ కేల కలుగు వేమ ! 
291 ఇచ్చేవారల సంపద, హెచ్చేదే కాని లేమి యేలా కలుగున్?
292 అదన భుక్తి చేత మొదటి సొమ్ముకు హాని.
293 ధనము యెవ్వరి సొమ్ము దాచుకొనగ.
294 వట్టి లేని పేదవాని కీదగు నీవి
(14/7 – iv )  ధనం – నష్టాలు :
295 కలిమి నాడు నరుడు కానడు మదమున
296 ధన మెచ్చిన మద మెచ్చును.
297 సంపద గల వాని సన్నిపాతక మిది.
298 చెయ్యి సాచి కాసు నియ్య లేడు
299 అర్థికీని సొమ్ము వ్యర్థ మౌను
300 వ్యర్థమైన సొమ్ము వ్యర్థుల జేరురా 
301 ధనము లెచటి కేగు దా నేగు నెచటికి?
302 కొంచ బోడు, వెంట గుల్ల కాసును రాదు
303 తాము దినక నటుల ధర్మంబు సేయక, –
        సొమ్ము పరుల నంటు జూడు వేమ !
304 దానములను సేయ ధర చేతు లాడక,  
   తుదను దండుగ నిడి,మొదలు చెడు నరుడు !
305 కలిగి పెట్టలేని కర్మజీవుల కెల్ల, –
      తిరిపెమును దొరకదు దీనులార !
306 దీనులైన వారి దిగువాయిగా జూచి, –
      పరము గనక నూత బడును వేమ !
(14/7 – v )  ధనం  – లోకరీతి :
307 కలిమి గలిగెనేని కాముగా జూతురు
308 కలిగిన మనుజుండు కాముడు సోముడు, –
        మిగుల తేజమునను మెరయుచుండు
309 ఎంత సంపదొనరు నంత కష్టపు చింత, –
      చింత లేక నున్న చెడని సంపద జూడ !
310 సాగిపారని తరి సమకూడదొక్కటి, 
     ధనము యెంత యున్న ధరను వేమ !
311 సకల సంపదలును సతము లనుచు
312 ధనము జూచినపుడె తగులు మనసు.
313 ధనము లేమి ఘనత దప్పు వేమ!
314 లేని కాలమునకు లేని మనము నొందు.
(14/7 – vi )   ధనం  Vs. విద్య :
315 ఎందరికి నొసంగ నెప్పటి యట్లుండు
(14/9) మోక్షం :
316 ఎన్ని తనువు లైన మృతికి యడ్డము గావు, –
            మృతిని గెలువ లేని యెరుక లేల ?
317 నిశ్చలాత్మ యెన్న నిర్వికారంబున, –
          నుండెనేని ముక్తి యండ్రు వేమ
(17) మతము :
318 తమకు భేదమయిన తత్త్వంబు భేదమా !
319 మతము లెన్ని యైన సతముగా నుండవు
320 సతముగాను యుండు జగతి నొకటి
321 షణ్మతముల జిక్కి చావ నేల?
322 శైవ వైష్ణవాది షణ్మతంబుల కెల్ల, –
      దేవుడొక్కడనుచు దెలియ లేరు
323 ఎన్ని మతము లైన నే మంత్ర మైనను, –
          సత్య మింత లేక జాడ నిడడు
324 మొదల తన మతము వదలక, –
   తుద నెవ్వరి మతమునైన దూషింపకయున్ 
325 భక్త వర్గమునకు భవు జూప నేరక, –
      కాని మతములోన గలుప రాదు.  
28/1 కర్మ యోగం :
326 వ్రాత వెంట గాని వరమీడు దైవంబు –
        సేత కొలది గాని వ్రాత గాదు 
327 వ్రాత కజుడు కర్త సేతకు దా కర్త !      
328 యేమి లేని నరున కేగతి లేదుర 
28/2. ధ్యానయోగం :
(28/2 – i )  ధ్యానయోగం – ప్రయోజనం :
329 పరము కొరకు యోగి పాటించు దేహంబు!
(28/2 – ii ) :  ధ్యానయోగం – విధి విధానం :
330 యోగి గాడు లోన బాగు గాకుండిన
(28/2 – iii )  ధ్యానయోగం – భావనలు :
331 అమలమైన పలుకు లభిషేక వారిధి
332 గాలి లేని దీప కళిక చందంబున
333 కడగి గాలి లేని గగనంబు భంగిని, 
        బలు తరగలు లేని జలధి మాడ్కి
(28/3) భక్తి యోగం :
(28/3 – i )  భక్తి యోగం – ప్రాశస్త్యం :
334 దేవ పూజ సేయ దివ్య భోగము గల్గు
(28/3 – ii )భగవంతుడు నిర్గుణం:
335 విశ్వమును నడిపెడి విశ్వేశ్వరుండు.
336 తెలియ విశ్వ మెల్ల దేవాది దేవుడౌ !
337 దేవుడొక్కడనుచు దెలియ లేరు
338 లేడు లేడన్నను  లేక పోడు 
339 దర్శనంబు వేఱు, దైవంబు యొక్కటి!
340 మరియు దధిని ఘృతము, మానులం దనలంబు
341 చారు సుమము లందు సౌరభంబు
342 తిలల తైలమట్ల దేజరిల్లు జిదాత్మ
(28/3 – iii )  భగవంతుడు – సగుణం :
343 సర్వ సురల కన్న సర్వేశ్వరుడు మేలు!
344 తోడు తోడనినను తోడనె తోడౌను
345 శివుడు భర్త కర్త చింతింప నేలరా?
346 పటము గోడలందు ప్రతిమలందు, –
     తన్ను దెలుసుకొరకు తగలదా పరమాత్మ !
347 మంట లోహమందు మాకుల శిలలందు, 
     తన్ను దెలుసుకొరకు తగలదా పరమాత్మ !
(28/3 – iv )  భక్తి భావనలు – నిర్గుణం :
348 కడక నఖిలమునకు నడి నాళ మందున్న, –
        వేగు చుక్క వంటి వెలుగు దిక్కు 
349 అందు గలుగు దేవు డిందు లేడె, –
    యిందు నందు గలడు హృదయంబు లెస్సైన !
(28/3 – v )  భక్తి భావనలు – సగుణం :
350 హరుని యెరుక లేక యాకు నల్లాడునా!
351 తామెందులోన దిరిగిన, 
     దేవుడు తోడగుచు వచ్చు వెంటనె వేమా!
 (28/3 – vi ) భక్తి విధానం – నిర్గుణం:
 (28/3 – vii ) భక్తి విధానం – సగుణం:
352 పూజ సేయువాడు పుణ్యమూర్తి!
353 భక్తి లేని పూజ ఫలము లేదు ( భక్తి యనగా-భగవంతుని-
నామ, రూప, గుణముల యందు నిష్కామ పరమ ప్రేమ!)
 (28/3 – viii )  ప్రార్థనలు :
(28/3 – ix ) భక్తులు – లోకరీతి :
354 ప్రణవ మెరుగనోడు భక్తు డెప్పుడు గాడు
355 తన్ను దిప్పు వాని తానేల కానడో ?
(28/4) జ్నాన యోగం :
i. విశిష్టత :
356 లోను జూడ జూడ లోకాభిరామంబు
ii. పరమాత్మ –  (పరబ్రహ్మ), (బ్రహ్మం) :
357 ఆరు రుచులు వేరు, సారంబు యొక్కటి, –
        సత్య నిష్ఠ వేరు, సత్య మొకటి.
358 ఘటము లెన్ని యైన గగనంబు యేకమే
359 పరమ ఋషులు వేరు, భావ్యుండు యొక్కడు
360 బ్రహ్మ మన్నిటందు పరిపూర్ణమై యుండు.
361 అఖిల జనుల కెల్ల నానందమే సాక్షి !
iii. జీవాత్మ
362 స్థిరము నస్థిరమును దెలియ జీవికి ముక్తి
363 చూచు కనులు వేరు చూపు వేరు!
364 తత్త్వ మెరిగెనేని దైవ సముడె
365 గుడి దేహ మాత్మ దేవుడు!
iv. జగత్తు :
366 నీవు నిలిచి యుండు, నిఖిలంబు నిలువదు
367 సుఖము లంతమందు చూడంగ దుఃఖంబు, –
        సుఖములును కష్ట పూర్వకములు
v. ఈశ్వరుడు :
368 సకలాకారు డనంతుడు, –
     సకలాత్మల యందు సర్వ సాక్షియు దానై
vi. మాయ :
369 నీవు నిశ్చయంబు నిఖిలంబు మాయయు
vii. మోక్షం
370 దుఃఖస్పర్శ లేని సుఖమన్న మోక్షమే !
371 యేకత్వంబని యెరిగిన, –
     శోకములే కల్ల! ముక్తి సులభము వేమా !
viii. కైవల్యం ( సాయుజ్యం – జీవ బ్రహ్మైక్యం ) :
372 జీవు నరసి చూడ శివుడు గాడె!
ix. లోకరీతి :
(28/5) జ్నాన సాధన :
i. సాధన చతుష్టయము :
373 ఆత్మశుద్ధి లేక నంటునా మోక్షంబు ! 
374 ఆశ కన్న దుఃఖ మతిశయంబుగ లేదు
375 ఆశ విడక కాని పాశ ముక్తుడు గాడు
ii. మనో సాధన :
376 మనసు నిలుపకున్న మరి ముక్తి లేదయా 
377 హృదయ మందు నున్న యీశుని దెలియరో !
iii. వేదాంత భావన :
378 వెదుక వెదుక దొరుకు వేదాంత వేద్యుండు
iv. అంతర్దృష్టి :
379 తెలివి యనెడు గొప్ప దీపంబు చేపట్టి , –
        ముక్తి జూడవచ్చు మొనసి వేమా
v. సర్వాత్మత్వ భావన :
380 నిఖిలాత్ముడు సర్వసాక్షి నిజముగ తానై
381 సకలాత్మల యందు సర్వ సాక్షియు దానై.
382 నిర్మలునకు గలుగు ముక్తి నిజముగ వేమా!
          ( అద్వితీయత్వమే  నిర్మలత్వం )
     
ప్రకటనలు

4 వ్యాఖ్యలు to “(305A2) తెలుగు సూక్తి భారతి (వేమన సూక్తులు -2)”

 1. rathnamsjcc77 Says:

  జగన్మిధ్యా బ్రహ్మసత్యమని నమ్మర
  జీవో బ్రహ్మైవ నాపర:యని తెలియర
  అద్వైత మార్గంలో ఆత్మనిలుకడ చెందర
  పరమ శివాత్మోహం అనుచు నీ నిజస్థితిని తెలియర చింతలులేని ఇల్లు శివాలయంబుర
  కోర్కెలుడిగిన హృదయం కోవెలయని తెలియర
  ఆదర్శ దంపతులు పార్వతి పరమేశ్వరులుర
  విలువలేని చోట నీవు నిలువబోకు చూడర
  గుర్తింపు లేనిచోట అవమానము పొందకుర
  కాని చోటు చెరి నీవు కలత చెందబోకుర
  ఆత్మాభిమాన మెపుడు చంపుకోవాకుర

 2. rathnamsjcc77 Says:

  ఆత్మానుభూతిపొంది, నిస్వార్ధ చిత్తులై అన్నింటితో తాదాత్మ్యం చెంది, జీవనంలో ప్రవేశించినవారే మహర్షులు. సర్వవిధములైన చైతన్యముతో సంబంధముగలిగి ఉండటమే మానవత్వానికి పరమావధి. ఇదియే జీవన్ముక్తి మార్గమని సర్వ పరిపూర్ణ దైవజ్ఞానికి ప్రత్యేకించి యనకుండ సమస్త ప్రాణులపట్ల పవిత్ర ప్రేమానురాగములు గోచరిస్తాయి. కేవలం ఆలయాలలోనే గాకుండ విశాల విశ్వంలో ఎక్కడ చూచినా అక్కడ పూజార్హమైన వస్తువు గోచరిస్తుంది. పవిత్ర ప్రేమకు అసహ్యమనునది లేదు. నీ శక్తిని దైవ శక్తితో జోడించి చూడు. ఎవడు శాశ్వతుడో, సర్వ పరిపూర్ణుడో, సర్వోన్నతుడో, ఎవని శక్తిచే సూర్యుడు చైతన్యవంతుడై ప్రకాశించు చున్నాడో, ఎవని మూలమున పంచభూతములు, గ్రహమండలములు చలించుచున్నవో అట్టి సర్వకేంద్ర స్వామి నీలో అంతర్యామిగ ఉన్నాడుమనసు నిలుపుకొనిన అంతే. మనోంతర్గత సూక్ష్మ ప్రపంచ వింతలు, అద్భుతములు విచిత్రముగ ఉండును. కాలపరిమితి తీరగనే అద్దె ఇంటిలోనివారిని ఇంటినుండి ఖాళీ చేయించు నట్లు, మనసులో నిలుపుకొనిన దుష్ట సంస్కారములను అలా బయటికి నెట్టాలి. వ్యష్టి మనసు బలంరాగ ద్వేషములు ఉండిన చిత్తంలో శాంతి నిలువదు కాబట్టి శత్రువును ఇంటినుండి మెడలుపట్టి బయటికి నెట్టునట్లు బాహ్య విషయాలను

 3. rathnamsjcc77 Says:

  తెలుసుకున్నప్పుడు ,జ్ఞాని ఎంతటి కర్మ తనద్వార తనద్వార జరుగుతున్న నిశ్చలంగా ఉంటాడు.తాను కర్తను
  కాను అనే జ్ఞానం కలవాడే నిజమైన సన్యాసి.కర్మ ఫలితాలు అతనిని తాకనైనా తాకలేవు.ఆత్మ . నేను అనే సృహలేకుండా ఉన్న వారెవ్వరు లేరు కాబట్టి అందరిలో ఆత్మ వ్యాపించి ఉంది.కాకపోతే అజ్ఞాని ఈ శరీరమే నేను అనుకోంటాడు,ఈ శరీరం ఆత్మకంటే భిన్నం కాదని జ్ఞాని
  తెలుసుకొంటాడు.జ్ఞాని అయినవారికి ఆగామి,సంచిత కర్మలే (భవిష్యత్తులో అనుభవించే,జమ ఐన కర్మలు) కాదు ప్రారభ్ద కర్మ కూడ మిగలదు.నేను’’ అనేది ఒక మహా మంత్రం.ఇది ఓంకారం కన్నా శక్తివంతమైనది.ఇది భగవంతుని మొదటి నామం. ఈ నామం ద్వార ‘‘నేనెవరు’’మీద ధ్యాసపెట్టి ధ్యానం చేయండి.ధ్యానం చేయడం మీ స్వప్రయత్నం, మనసుమంత్రపుష్పం ( స్తోత్రం ) : అన్నిటినీ తెలుసుకునేవాడే గానీ, దేనిచేతా మునకు ( వేద-వాక్కుల చేతకూడా ) తెలియబడని వాడైన స్వామికి లోపలా, బయటా వ్యాపించియున్నట్టి మనసుస్తోత్రం చేయగలము నీకు సకలోపచార పూజలను చేస్తూనే ఉంటాంధూపం : నిరంజనుడైన స్వామికి ధూపము లెందులకు దీపం : సర్వసాక్షియై, సర్వ దృశ్యములకూ దృక్ స్వరూపుడైనట్టి స్వామికి దీపదర్శనము వలన ఏం ప్రయోజనంనైవేద్యం : అఖండ – ఆత్మానందము ననుభవిస్తూ తృప్తుడైన స్వామికి నైవేద్యముగా ఏమి ఇవ్వగలము తాంబూలం : విశ్వాన్ని అంతటినీ ఆనందమయము చేసే స్వామికి ఆనందకరంగా ఉండే తాంబూలం ఏమివ్వగలం నీరాజనం : వేదములు ఎవరినైతే, ” చిద్రూపుడు, స్వయం ప్రకాశ స్వరూపుడు సూర్య చంద్రాగ్ని గ్రహ నక్షత్రాదులను భాసింప జేస్తున్నాడు “అని కీర్తిస్తూన్నాయో, అట్టి స్వామికి ఏమి హారతులివ్వ గలము ప్రదక్షిణం : దిక్కులు అన్నీ కూడా ఎవరిలోనే లయిస్తూన్నాయో, అట్టి
  ప్రదక్షిణం : దిక్కులు అన్నీ కూడా ఎవరిలోనే లయిస్తూన్నాయో, అట్టి అనంతుడైన స్వామికి ప్రదక్షిణములు సాధ్యమా ?నమస్కారం : సర్వమూ తానేయైన వానికి, రెండవ వస్తువే లేని అద్వితీయుడైనస్వామికి నమస్కారము చేయగలవారు ఎవరు ?B.రత్నం బెంగళూరు

 4. rathnamsjcc77 Says:

  మన మనస్సు లో కలిగే ఆలోచనలు అన్నిటిలో మొదటిది ‘ మనస్సు ఆలోచన. దాని ఆధారముగా తర్వాత మిగిలిన ఆలోచనలను సృష్టిస్తుంది. మనస్సు ఆలోచనలను అది సృష్టింఆలోచన ఆవేశ పూరితమైనది , ఉద్రిక్తమైనది కాబట్టి అది ప్రేమ కాదు . ఆలోచన ఉన్నప్పుడు ప్రేమకి తావులేదు .ఆలోచన జ్ఞాపకాల మీద ఆధార పడిఉంటుంది . ప్రేమ జ్ఞాపకం కాదు . మీరు ప్రేమించే వొక వ్యక్తి గురించి మీరు ఆలోచించినప్పుడు ఆ ఆలోచన ప్రేమ కాదు . మీ స్నేహితుని అలవత్లనూ , ప్రవర్తించే తీరునూ గుర్తుకు తెచ్చుకోవచ్చు . ఆ వ్యక్తీ తో మీకున్న సంబంధ రీత్యా జరిగిన మంచి సంఘటనలనీ చెడు సంఘటనలనీ గుర్తుకు తెచ్చుకోవచ్చు . కాని , ఆ ఆలోచనలు ప్రేరేపించే మనోచిత్రాలు మాత్రం ప్రేమ కాదు .
  విభజన చేయడం ఆలోచన సహజ లక్షణం . సమయ భావం ,స్థలాభావం ,దూరము ,దుఃఖము , అన్నీ ఆలోచన వల్ల వచ్చినవి మనస్సు .ఆలోచనా ఆగిపోయినప్పుడే ఉండటానికి సాధ్యమవుతుంది .
  .
  ఆలోచనని అర్థం చేసుకోవాలి అంతే కాని , ఆలోచనలో బంధించడానికి ప్రయత్నించటం కాదు మనస్సు లో కలిగే ఆలోచనలు అన్నిటిలో మొదటిది ‘నేను’ ఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు “మనస్సు ” మూలం. కనుక మానవుడు ముందుగా “జ్ఞానం” సంపాదించాలి. అనగా అన్ని ప్రాణులలో ఉన్నది నేనే ఆత్మ అనే విషయాన్ని అర్ధంచేసుకుని, అనుభూతి చెందాలి. అన్నీ తానే ఐనప్పుడు, అన్నింటిలో ఉన్నది ఆత్మ తానే అని తెలుసుకున్నప్పుడు మరొకర్ని ఎలా బాధపెట్టగలడు? ఇతరులను ఎలా మోసం చేయగలడు? నీవలెనే నీ ఎదుటివారికి కూడా కొన్ని ఆశలు ఉంటాయని గ్రహించగలిగితే వారి ఆశలను అడియాశలు చేయలేవుగదా! అంతటి ఉన్నతమైన స్ధితికి మానవుని ఆలోచనా విధానం ఎదగాలి. ఈ విషయం బాగా అర్ధమై వంటబట్టాలంటే మనం ఎల్లప్పుడూ మనస్సు సాధన చేయాలి. ,మనస్సు సదాచారము, చేయాలి. మంచి ఆలోచనలు చేస్తూ, పదిమందికి ఉపయోగపడే పనులు చేస్తూ ఉండాలి.వేదాంతం అనగానే కంగారుపడవలసిన అవసరంలేదు. నిన్ను నీవు తెలుసుకోవడమే వేదాంతం. నీ నిజస్వరూపాన్ని చక్కగా అర్ధం చేసుకోవడమే అసలైన ఆధ్యాత్మిక విద్య. లౌకిక విద్యలు విజ్ఞానాన్ని, ధనాన్ని, కీర్తి ప్రతిష్టలను కలిగిస్తే ఆత్మవిద్య అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. నీవు ఎంత గొప్ప చదువు చదివి ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎన్ని కోట్లు సంపాదించినా చివరకు మృత్యువాత పడక తప్పదు. చివరకు అప్పుడైనా ఆత్మ విద్యను ఆశ్రయిం చక తప్పదు. కాబట్టి ఆధ్యాత్మిక విద్యను, అంటే నీ అసలు స్వరూపాన్ని నీవు చక్కగా అర్ధంచేసుకొని, అర్ధవంతంగా, పదుగురికి ఆదర్శవంతంగా జీవించాలి. అప్పుడే మానవ జన్మ ఎత్తినందుకు సార్ధకత లభిస్తుంది. కన్న తల్లి, ఉన్న ఊరు, పుట్టిన దేశం రుణం తీర్చుకున్నవాళ్ళం ఔతాం.వేదాంతమంటే ముసలితనంలో నేర్చుకునే విద్య అసలే కాదు. శరీరంలోని అన్ని అంగాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మనస్సు స్ధిరంగా, స్ధిమితంగా ఉంటుంది. అప్పుడే మన శరీరం ఆధ్యాత్మిక సాధనకు చక్కగా సహకరిస్తుంది. మనం తెలుసుకున్న విషయాలు హృదయసీమలో హత్తుకుని చక్కటి ఆచరణకు దోహదం చేస్తుంది. తద్వారా సత్ఫలితాలను సాధించడానికి చక్కగా సహకరిస్తుంది. వేదాంతసారమును సంక్షిప్తముగ చెప్పాలనిన “అజ్ఞానిగ ఉండిన జీవుడు – సుజ్ఞానిగ నిలిచిన దేవుడు. భ్రమలో ఉండిన జీవుడు – భ్రమలుడిగిన దేవుడు. సాకారుడైన జీవుడు – నిరాకారుడైన దేవుడు. శరీరభావన గలవాడైన జీవుడు – అశరీరాత్మ భావన గలవాడైన భగవంతుడు. సంకుచిత పరిధిలో జీవుడు – సర్వాత్మ స్ధితిలో దేవుడు. వ్యష్టిగ ఆలోచించిన జీవుడు – సర్వ సమిష్టి భావముతో దేవుడు. పలికినంతసేపు జీవుడు – పలుకులేనివాడే దేవుడు. పూనక శిగములు ఊగినంతకాలం జీవుడు – ఊరకుండిన (అచలం) దేవుడు. చూచినంతకాలం జీవుడు – చూడబడేవాడు మనస్సు . చపల చిత్తుడు జీవుడు – స్ధితప్రజ్ఞుడు దేవుడు. మాయాలోలుడు జీవుడు-మాయాతీతుడు దేవుడు. ఖండ దృష్టిలో జీవుడు – అఖండ దృష్టిలో దేవుడు. ద్వైత దృష్టి లో జీవుడు – అద్వైత స్ధితిలో దేవుడు. కావున మనం ఏ అంతస్తులో ఉన్నామో తెలుసుకోవాలి ప్రజలు ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొని, ఆచరించి, ఫలితాలను సాధించాలని తాపత్రయపడుతున్నారు. దేవుడు, జీవుడు, ప్రపంచానికి మధ్య గల సంబంధాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. మానవ సేవయే మాధవ సేవ యని గ్రహించి మనిషిలో దైవాన్ని దర్శిస్తున్నారు మనస్సు నిలిపి ఏకాగ్రపరచుటయే సమాధి స్థితి;మనస్సును నిస్సంకల్పముగా ఏకాగ్రపరచుటయే మనోలయ ధ్యానం. అనంత చైతన్య స్రవంతి నీ స్వరూపం. ఈ జ్ఞానం సమస్తం స్పష్టంకాగలదు. శాస్త్రాలను మించినది ప్రత్యక్షానుభవం. నీలో నిన్ను లోతుగ వెళ్ళి తరచి చూచుకో. ఇదియే అసలైన మార్గం.
  సమాధి స్థితి;బ్రహ్మానుభూతిని చవిచూస్తుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: