(305A1) తెలుగు సూక్తి భారతి (వేమన సూక్తులు – 1)

 

     
    2.నా మేలు కోరే వారు:(ఆత్మీయులు):
(1) తల్లిదండ్రులు,(2)కుటుంబ సభ్యులు,       (3)గురువులు, (4)పెద్దలు:  (5)సజ్జనులు,
(6) మంచి స్నేహితులు .
2.1 తల్లిదండ్రులు :
1 తల్లి గౌరి తనకు తండ్రియే శంభుండు
2 తల్లిదండ్రు లెన్న తన మొదలి గురులు
2.3 గురువులు :
3 గురువు లేక విద్య గురుతుగా దొరకదు
4 గురువు లందు జూడ భయభక్తు లమరిన
5 మంచి చెడ్డ జెప్పు  గురువులె గురువులు.
6 పార్వతీ భవులును పరమ గురులు!
7 సద్గురువే దైవమనుచు జాటర వేమా.
8 అఖిలమునకు గురువు యాధారమై యుండు.
2.4 పెద్దలు: 
9 బుద్ధి జెప్పువాడు గుద్దిన నేమయా?
10 పెద్ద ‘లుసురు’ మంటె పెను మంట లెగయవా
11 దగ్ధు లైన వారు తమకంటె తక్కువా
2.5 సజ్జనులు :
12 సాధు సజ్జనముల సాంగత్యముల చేత, 
     మూఢ జనుడు బుద్ధి – మంతు డగును.
2.6 స్నేహితులు :
13 కానివాని తోటి కలసి వర్తించెనా, 
     హాని వచ్చు నెంతవాని కైన 
3. ముందుగా నేర్చుకోవలసినవి:
(1) ప్రార్థన,  (2) ఆటపాటలు :(3) దినచర్య, 
     (4) భాష: మాతృ భాష (తెలుగు), సంస్కృతం,-
          హిందీ, ఇంగ్లిష్ :  (5) విద్య , (6) పాఠశాల .
3.4 భాష :
14 భాష లింతె వేరు పరతత్త్వ మొక్కటి .
3.5విద్య :
15 విద్యలేమి ఘనత దప్పు వేమ!   
16 యెరుక లేక దిరుగ నేమి గలదు?
17 తెలియ లేని వాని తెలివదేమి?
18 తెలిసిన మనుజునకు దివ్యామృతంబురా
19 చదువ పద్య మరయ జాలదా యొకటైన
20 ఎందరికి నొసంగ వృద్ధి జెందుచునుండు !
4. శరీర పోషణకు అతి ముఖ్యమైనవి :
(1) ఆరోగ్యం , (2) ఆహారం , (3) విహారం, –
     (4)వ్యాయామం, (5)విశ్రాంతి, (6)వైద్యం.
4.1 ఆరోగ్యం :
21 వంటు దప్పునపుడు వంటకము విషంబు –
     ( వంటు = ఆరోగ్యం )
4.2ఆహారం :
22 అన్నరసమ యొడలి కతి మదంబగు సుమీ !
23 చంప నొంప బువ్వ చాలదా వెయ్యేల?
5. త్రికరణములు :(మనకి ఉన్న 3 సాధనాలు):
(1) దేహం, (2) వాక్కు, (3) మనస్సు.- ‘చిత్తశుద్ధి”- 
     (4), ” త్రికరణ శుద్ధి ” గలవారు మహాత్ములు !
5.1దేహం :
24 దేహము లెస్సగ నుండిన , –
     పోహణ తత్త్వంబు లన్ని పొందుగ దెలుసున్.
5.2వాక్కు :
25 సజ్జనుండు బలుకు చల్ల గాను
5.3 మనస్సు. :
26 ఒక్క మనసు తోడ నున్నది సకలంబు , –
     తిక్కబట్టి నరుడు తెలియ లేడు 
27 మాట కన్న నెంచ మనసు దృఢము
28 మనసు నిలుపు వాడు మంచివాడు.
29 చింత చేత మిగుల చివుకు మేను
30 మోహ పడును బుద్ధి మోసపోయి.
31 తన మది కపటము విడచిన, –
     తన కెవ్వడు కపటి లేడు ధరలో వేమా !
6. లోకరీతి – అవగాహన :
 (1) ప్రకృతి, (2) వస్తుజాలం, (3) జీవజాలం, (4) మంచివారు
  (5) చెడ్డవారు, (6) మూర్ఖులు, (7) రాజనీతి (8) ప్రజలు
   (9) మానవ సామాన్యం.
6/1. లోకరీతి – ప్రకృతి :
32 తివురు భాను జూచి తిమిరంబు నిలుచునా?
33 భానుడుండ దివ్వె బట్టి వెదుకు రీతి !
34 చెలగు దివ్వె లేక చీకటి వాయునా?
35 నీరు పల్ల మెరుగు నిజము గాను. 6/1
36 యేటి వంక దీర్ప నెవ్వరి తరమయా!
37 నీరు జొరక లోతు నిజముగా దెలియదు
38 గంగ పారుచుండు కదలని గతి తోడ, –
     ముఱికి కాల్వ పారు మ్రోత తోడ.
39 తరువ తరువ బుట్టు తరువున ననలంబు
40 విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత?
41 చెట్టు ముదరనిచ్చి చిదిమిన బోవునా – 
     వెనుక వంతు ననుట వెర్రి తనము !
42 హరుని యెరుక లేక యాకు నల్లాడునా
43 పుష్పమందు తావి పొసగి నట్లగు విద్య!
44 పచ్చి కాయ దెచ్చి పడవేయ ఫలమౌనె?
45 యెగర వేయు పండు యెందాక నిల్చురా
46 పంట చేను విడిచి పరిగె యేరిన యట్లు!
47 పరగ మూలికలకు పనికివచ్చు
(6/2) లోకరీతి – వస్తుజాలం :
48 పాల గలయు నీరు పాలెయై రాజిల్లు
49 తరువ తరువ బుట్టు దధిని ఘృతము!
50 వెన్న బట్టి నెయ్యి వెదికిన చందంబు.
51 కొండ యద్దమందు కొంచెమై యుండదా ?
52 ఉసురు లేని తిత్తి యిసుమంత వూదిన, –
     పంచ లోహములును భస్మమౌను.
53 పెద్ద లుసురుమంటె  పెనుమంట లెగయవా ?
54 నీళ్ళమీద జూడు నెరయ నోడల పర్వు
55 నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు, –
     తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?
56 కరగ కరగ బుట్టు కనకంబునకు వన్నె
57 కంచు మోగు నట్లు కనకంబు మోగునా
58 కొయ్య దుంగ దెచ్చి చెక్కితే గుణి యవదె ?
59 కప్పురంబు జ్యోతి గలసి నట్లగు ముక్తి !
(6/3) లోకరీతి – జీవజాలం :
60 తేనె తెరల జాడ తేనెటీగ యెరుంగు  
61 సుమ రసంబు జాడ భ్రమర మెరుగు 
62 పుష్పజాతి వేఱు, పూజ యొకటి
63 పసుల వన్నె వేఱు, పాలేక వర్ణమౌ
64 గంగి గోవు పాలు గంటెడైనను చాలు, –
     కడివెడైన నేమి ఖరము పాలు.
65 పాల నీరు క్రమము పరమ హంస యెరుంగు.
66 పుట్ట మీద గొట్ట భుజగంబు చచ్చునా ?
67 తెలిసి త్రాడటన్న తీరు భయము.
68 పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా ?
69 పులిని జూచి నక్క పూత బూసిన యట్లు !
70 యెనుము గొప్పదైన యేనుగు బోలునా ?
71 యేనుగు పడియున్న నెత్తునా మశకంబు?
72 కొండముచ్చునకును  కోతియు విందౌను! 
73 వనము లోని కోతి వసుమతి నడుపునా!
74 కొలకు లింకెనేని కొంగ లందుండునా?
75 పరిమళముల గర్దభము మోయంగ ఘనమౌనె?
76 పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా!
77 కంచము కడ పిల్లి గాచినట్లు.
78 కుక్క యిల్లు జొచ్చి కుండలు వెదకదా?
79 మృగము తోడ కుక్క మొరగిన సామ్యమౌ.
80 కుంటి కుక్క కేల కుందేటి పరుగులు?
81 కుక్క తోక గట్ట చక్కగా వచ్చునా ?
(6/4) లోకరీతి – మంచివారు :
82 ఉత్తమోత్తముండు తత్త్వజ్ఞు డిలలోన
83 పురుషులందు పుణ్యపురుషులు వేరయా
84 అందరొకట గలియ నన్నదమ్ములె గదా! 
85 సాధు సజ్జనులను సంతరించిన వాడు, –
     ప్రజల సంతసంబు పరచువాడు
86 గుణ యుతునకు మేలు గోరంత జేసిన, –
     కొండ యౌను వాని గుణము చేత 
(6/5) లోకరీతి – చెడ్డవారు :
87 కొండకొద్ది మేలు గుణహీను డెరుగునా
88 నీతి హీను నొద్ద నిర్భాగ్యు లుందురు
89 వేషధారి యుదర పోషకు డధముండు.
90 కుత్సితుండు చేరి గుణవంతు జెరుచురా
91 పొట్టు దినెడి వనిత బువ్వలు బెట్టునా !
92 లోభివాని నడుగ లాభంబు లేదయా
93 దాత లేని యూరు దయ్యాల పేటిరా!
94 ఒప్పు దుర్జనములు తప్పుగ నెంతురు.
95 ఒకరి నోరు గొట్టి యొకరు భక్షింతురు, 
96 హీను డవగుణంబు మానలేడు.
97 కూళ గూళ మెచ్చు గుణవంతు విడనాడి
98 దోషకారి కెట్లు దొరకురా యా కాశి !
(6/6) లోకరీతి – మూర్ఖులు, అమాయకులు:
99 మూర్ఖు డేమెరుంగు మోక్షంపు త్రోవను.
100 పాపపుణ్యములను పసి పాపెరుంగునా !
101 లోకులెల్ల వెర్రి పోకిళ్ళ బోదురు!
102 నరుడు బడెడు పాట్లు నగుబాట్లు చూడగా.
103 గొర్రె జంక బెట్టి గొల్ల వెదకు రీతి.
104 కడుపు నిండ నింత కష్టంబు లేలరా!
105 తను దా దెలియక నుండిన , –
     దన కెవరున్ దెలుప లేరు తథ్యము వేమా!
(6/7) లోకరీతి – రాజనీతి ;
106 దాన ధర్మములును దయయు సత్యము నీతి, –
     రాజు పాలిటి కివి రాజయోగంబులు .
107 యడ్డమైన జనుల నంటగట్టి, 
     దోచుకున్న నట్టి దోష మెక్కడ బోవు? 
108 వారి యుసురు దాకి వగ చెడి పోవరా?
(6/8) ప్రజా ధర్మం :
109 నీచుల వినుతులు సేయుచు, –
     యాచకమున దిరిగి తిరిగి యలసుట కంటెన్
110 యెట్టి వారు మెత్తు రట్టి వారి!
111 దండసాధ్యు లైరి ధర్మసాధ్యులు గాక
112 తమకు భేదమయిన తత్త్వంబు భేదమా !
113 ప్రభున కిచ్చినట్లు పెద్దల కియ్యరు!
114 కలిమి లేమి రెండు గల వెంత వారికి!
115 తాటి క్రింద పాలు తాగిన చందమౌ
116 చెలగి మధువు గ్రోల చేదు రుచించునా?
117 పేదవాని యింట పెండ్లైన నెరుగరు
118 చేటు కాలమునకు చెడు బుద్ధి పుట్టును!
119 తెలివి విడిచి భూమి దిరుగంగ నేటికి?
120 కుక్కతోక బట్టి గోదావరీదునా? 
(6/9) లోకరీతి – మానవ సామాన్యం :
6.9/1 తత్త్వం :
121 ఉత్తమోత్తముండు తత్త్వజ్ఞు డిలలోన   
122 మహిమ జూపు వాడు మధ్యముండు
123 వేషధారి యుదర పోషకు డధముండు
124 దీపంబు లేని యింటను, 
     రూపంబుల దెలియ లేరు రూఢిగ తమలో
125 దీపమగు తెలివి గలిగియు, –
     పాపంబుల మరుగు త్రోవ బడుదురు వేమా!
126 వెన్న చేత బట్టి వివరంబు దెలియక, –
     ఘృతము గోరునట్టి యతని భంగి
6.9/2 ధర్మం :
127 పరగ ముందరి తమ బ్రతుకు తెర్వెరుగక
6.9/3 మనస్సు :
128 అల్ప సుఖము లెల్ల నాశించి మనుజుండు, –
     బహుళ దుఃఖములను బాధ పడును   24′
129 కడుపు నిండ సుధను గ్రమముతో ద్రావిన, –
     పాల మీద నేల పారు మనసు?
130 పంట చేను విడిచి పఱిగె యేరిన యట్లు!    24′
131 దగ్ధులైన వారు తమకంటె తక్కువా?
132 ఆరు రుచులు వేరు సారంబు యొక్కటి, –
     పుష్పజాతి వేరు, పూజ యొకటి!
133 తిక్క బట్టి నరుడు తిరుగు చుండు
6.9/4 వాక్కు:
134 పదుగు రాడు మాట పాటియై ధర జెల్లు.
6.9/5 దేహం :
135 యేమి పాట్లు పడుదు రీ దేహమున కిల     24′.
6.9/6 వ్యక్తిగతం :
136 సత్యమాడు వాని సామి యెరుగు
137 కంటిలోని పాప కన నెంత వాడురా !
138 తెలుప వచ్చు, దన్ను దెలియ రాదు
139 ఆలి వంక వార లాత్మ బంధువు లైరి.
6.9/7  సామాజికం :
140 యెట్టి వారు మెత్తు రట్టి వారి!
141 లోకులెల్ల వెర్రి పోకిళ్ళ బోదురు!
142 వ్యాధి దెలియలేని వైద్యుడు మరి యేల?
143 తాటి క్రింద పాలు తాగిన చందమౌ
6.9/8 అర్థం ( ధనం ) :
144 సురకు నిచ్చినట్ల సుమతుల కియ్యరు
145 వ్యర్థమైన సొమ్ము వ్యర్థుల జేరురా 
146 పేద పేద గూడి పెనగొని యుండును (=పరస్పర సహకారం)

     
    7. మానసిక దృక్పథం: ( mind-culture & Outlook):
(1) నిత్య సత్యాలు, న్యాయాలు  (eternal truths& laws)
(2) భావనలు(concepts)
(3) వ్యక్తిత్వ వికాసం ( personality development ):
(4) సహజ ప్రేరణలు (natural instincts )
(5) దృక్పథం – (attitude & outlook)
(6) సుగుణాలు (good qualities)
(7) దుర్గుణాలు ( bad qualities)
7.1 నిత్య సత్యాలు,న్యాయాలు(eternal truths& laws
147 దర్శనంబు వేఱు, దైవంబు యొక్కటి! 
148 పని తొడవులు వేఱు, బంగార మొక్కటి
149 మొదల విడిచి గోడ తుది బెట్ట గలుగునా!
150 నిందు నీని వాని కెందును గలుగదు
7.3 వ్యక్తిత్వ వికాసం( personality development ):
151 తాను తానె యైన తల్లడం బేలరా? (Nothing to worry,-
           – ( if you be your Natural Self )
7.5 దృక్పథం – (attitude & outlook):
  [తత్త్వం, ధర్మం , మానసికం , వాచికం ,
   వ్యక్తిగతం ,సామాజికం  అర్థం , కామం , ]
7.5/1. తత్త్వం:
152 తేనె పంచదార తియ్య మామిడి పండు, –
          తిన్నగాని తీపి తెలియ రాదు!
153 యరయ తిండ్లు వేరు యాకలి యొక్కటి!
154 తనదులోని వెలుగు దానెరుంగగ వలయు.
155 తమకు భేదమయిన తత్త్వంబు భేదమా! 
156 వాదమేల దైవ భేదమేల?
7.5/2ధర్మం:
157 చెట్టు బెట్ట ఫలము చేకూర కుండునా?   
158 తన యదృష్ట మెల్ల దైవంబునకు దెల్సు!
159 భక్తి గల్గు పూజ బహుళ కారణమురా.
160 భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు.
161 యేమి లేని నరున కేగతి లేదుర
7.5/3. మానసికం :
162 శివుడు భర్త కర్త, చింతింప నేలరా?
163 చక్రి భర్త కర్త, చింతింప నేలరా?
164 కల్ల నిజము రెండు కరకంఠు డెరుగును
165 తొల్లి జేసినట్టి దోషంబు తగిలెనో
166 యుల్ల మందు వగవ కుండుట యోగ్యంబు. 
167 కుండ పగిలెనేని కొత్తది గొనవచ్చు
168 భాండశుద్ధి లేని పాకమేల?
169 నడుచు కాల మేమి నమ్మరాదు
170 బలిమి లేని వేళ పంతంబు సెల్లదు
171 బుద్ధి జెప్పువాడు గుద్దిన నేమయా? 
172 వేరు బడెడు వాడు  వెర్రి వాడు 
173 యాశయంబు లెరుగ రిట్టివార్లు! (know the Objectives)
174 సాధనమున బనులు సమకూరు ధరలోన!
175 పరగ రాతి గుండు పగుల గొట్టగ వచ్చు, –
            కొండలన్ని పిండి గొట్ట వచ్చు.
176 మేలిమిగా బ్రతుక వచ్చు మేదిని వేమా! 
177 పరు లెన్నగ బ్రతుకు వాడు ప్రాజ్నుడు వేమా!
178 జీవిలోన నుండు స్థిరమును గానక, –
            తిరుగు నస్థిరంబు వరుస నమ్మి.
7.5/4. వాచికం :
179 చేతగాని కూత చెల్లదెపుడు. 
7.5/6. సామాజికం :
180 ఉత్తమ పురుషుండు యొక్కడె జాలడా ?
181 పరుల కుపకరించి ప్రబలు వేమ !
182 పొసగ మేలు జేసి పొమ్మనుటే చాలు !  24
183 నిలువ దగని చోట నిలువ నిందలు వచ్చు
184 అనువు గాని చోట నధికుల మనరాదు!
185 నెలవు దప్పుచోట నేర్పరి కొఱగాడు.
186 కులము కన్న  మిగుల గుణమె ప్రధానంబు
7.5/7. అర్థం :
187 ప్రాప్తము గల చోట ఫలమేల తప్పునో? 
188 సొమ్ము లేని చోట శోధ యేల?
189 కడుపు కెట్ల యైన గలుగును భుక్తిరా!
190 తరచుగా నొసగక దాత గాడు 
191 పెట్టి చెప్పరాదు పేదకైన 
192 24 అప్పు లేనివాడె యధిక బలుడు.
7.6 సుగుణాలు (good qualities):
193 నిర్మల హృదయుండు నీ రూపమున నుండు
194 గొనమే మూలము సిరులకు  
195 జ్నాన మమరి యుండ సత్యముండు
196 శాంత బుద్ధి నుండ సమకూరు సుఖంబు.
197 దాన ధర్మములును దయయు సత్యము నీతి, –
               వినయ ధైర్య ధుర్య వితరణములు 
198 నరుని పాలిటి కివి రాజ యోగంబులు    
199 వినవలె నెవ్వరు చెప్పిన.
200 పరు లలిగిన తానలుగక
201 దానమీని వాడు ధన్యుండు కాడయా
202 మరువంగా వలదు మేలు మహిలో వేమా.
203 నిలువైన చిత్తము నిర్భీతి నొందించు
204 తెలిసినందుకు మరి ధీరుండు గావలె.
7.7 దుర్గుణాలు  ( bad qualities ) :
7.7/1. ఇతరులకు హాని చెయ్యటం :
205 అన్నమదము చేత నన్ని మదంబులౌ.
206 పరు నిందం జేయువాడు భ్రష్టుడు వేమా!
207 పెట్టినంత ఫలము తాను జెరుపక యున్న !
7.7/2. ఇతరులకు మేలు  చేయక పోవటం :
7.7/3. తన అధోగతికి కారణం – అరి షడ్వర్గం :
      ( కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ):
208 విర్రవీగువారు వెర్రివారు
209 మద ముడిగిన దుర్గుణంబు మానును వేమా!
210 మత్తులకును లేదు ముక్తి మహిలో వేమా !
211 లోభి దాత గాడు లోకంబు లోపల!
212 ఇరుగు పొరుగు వారి కెనయు సంపద జూచి
213 మచ్చరమే తన్ను జెరుచు మహిలో వేమా!
214 ఆశ బుట్టి మనుజు డారీతి జెడిపోవు!
215 తెలివి కన్న నాస దెగవేసినది హెచ్చు.
216 ఆశ కన్న దుఃఖ మతిశయంబుగ లేదు.
217 కుక్క వంటి యాశ కూర్చుండ నివ్వదు! –
          తిక్క బట్టి నరుడు తిరుగుచుండు  !
218 కోప మడచెనేని కోరిక లీడేరు
7.7/4. తన ఉన్నతికి ఆటంకం :
219 తన మది కపటము విడచిన, తన కెవ్వరు కపటి లేరు ధరలో వేమా!
220 చింత లేక నున్న చెడని సంపద జూచు.
221 దాన మడుగు వాడు ధరలోన నధముండు
222 తిండిపోతు వశమె తెలియంగ జ్నానంబు!
223 కల్లలాడు కంటె కష్టంబు మరి లేదు
224 ఆడితప్పు వార లభిమాన హీనులు.

    8. ప్రవర్తన – నడవడిక: ( conduct and behaviour ) :
(1)మంచి అలవాట్లు (good habits ),
(2) చెడ్డ అలవాట్లు ( bad habits ),
(3) విధులు (dos ),
(4) నిషేధాలు (donts),
(5) వ్యవహార నీతులు ,
(6) నీతి కథలు
(8.5) వ్యవహార నీతులు ,
225 నిజము లాడ రాదు నీచుతోను
226 వెర్రివాని మాట వినగ రాదు .
227 మొప్పెతోడ మైత్రి మొదలె రోత.
228 చేతగాని పనుల జేయరాదు.  24
229 స్థాన బలిమి గాని తన బలిమి కాదయా
230 బలిమి లేని వేళ పంతంబు సెల్లదు
231 అనువుగాని చోట నధికుల మనరాదు, –
          కొంచె ముండుటెల్ల కొదువ గాదు   
232 విడువ వలయు నూరు విశ్రాంతి గాకున్న.   24
233 నిలువ దగని చోట నిలువ నిందలు వచ్చు
234 నేల నున్న రాయి నెత్తి కెత్తిన యట్లు!    24
235 ఋణము సేయు మనుజు డెక్కువ కెక్కునా
236 తామసించి సేయ తగ దెట్టి కార్యంబు, –
          వేగిరింప నదియు విషమ మగును
ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: