(1101B2) వేమన శతక సారం – 1 ( 59-116)

శ్రీరామ

“సమన్వయ భారతి” వారి

వేమన సార పద్య శతకం : 1 (59 – 116)
****************************************

(పిల్లలకు అవశ్యం కంఠస్థయోగ్యం)

(సూచన: పద్య సంఖ్యలు సి.పి.బ్రౌన్ 1839 సంకలనము లోనివి)

మొత్తం 1,166 వేమన పద్యాల నుండి పిల్లల కంఠస్థ యోగ్యతను

దృష్టిలో నుంచుకుని ఎంపిక చేసినవి 116 పద్యరత్నాలు.

వీటిని 58 పద్యాల చొప్పున రెండు భాగాలుగా విభజించి

అందిస్తున్నాము. వీటితో మొత్తం భారతీయ సంస్కృతికి సంబంధించిన

స్థూల అవగాహనకలుగుతుంది! తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గూడ

తప్పక ఒకసారైనా చదువ దగినవి. ఈ పద్యాలను తమ

పిల్లలకు, విద్యార్థులకు కంఠస్థం చేయిస్తే, వారికి సాంస్కృతిక

వారసత్వం అందించినట్లే! ఇంకా యేం ?

ఈ పద్య రత్నాలహారం మీ పిల్లల కంఠాలలో అలంకరించండి !

( కంఠస్థం చేయలేక పోయినా, భావం గ్రహించ దగిన

ఇంకొక 121 పద్యాలను రెండవ భాగంగా

telugubharathi.wordpress.com ( తెలుగు భారతి )

అనే మా సహచర బ్లాగులోని ” వేమన శతక సారం – 2 (121 )”

అనే పేజీలో ఇవ్వటం జరిగింది.)

********************************************************

201 తల్లిదండ్రులు :
******** **************

59 201
(3-72)
ప్రాకు జేసిన వర్తనల్ పదట గలిపి

కొత్త వర్తన జేతురు కోడెకాండ్రు

కన్నతల్లిని విడనాడి కష్టపెట్టి

యన్య కాంతల బోషించు నట్లు వేమ !

203 గురువు :
******** *********

60 203
(2-72)
చాకి వాడు కోక చీకాకు పడజేసి

మయిల బుచ్చి మంచి మడుపు జేయు

బుద్ధి జెప్పువాడు గుద్దిన నేమయా?||విశ్వ||

61 203
(1-105)
కాకి గూటి లోన కోకిల మన్నట్లు

భ్రమర మగుచు పురువు బ్రతికినట్లు

గురుని గొల్చు వెనక గురువు తానౌనయా!||విశ్వ||

204 పెద్దలు :
******** *********

62 204
(1-57)
ఉసురు లేని తిత్తి యిసుమంత వూదిన

పంచ లోహములును భస్మమౌను

పెద్ద ‘లుసురు’ మంటె పెను మంట లెగయవా|విశ్వ|

63 204
(1-167)
కన్ను లందు మదము గప్పి గానరు గాని

నిరుడు ముందటేడు నిన్న మొన్న

దగ్ధు లైన వారు తమకంటె తక్కువా?||విశ్వ||

309 విద్య :
******** *******

64 309
(1-4)
నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు

తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల ?

చదువ పద్య మరయ జాలదా యొకటైన ||విశ్వ||

65 309
(3-187)
బాహ్య విద్యలెల్ల వేశ్యల వంటివి

భ్రమల బెట్టి తేటపడగ నియవు

గుప్త విద్య యొకటి కులకాంత వంటిది||విశ్వ||

600 లోకరీతి :
******** ********

604 లోకరీతి – మంచివారు :
******** ***********************

66 604
(1-93)
తేనె తెరల జాడ తేనెటీగ యెరుంగు

సుమ రసంబు జాడ భ్రమర మెరుగు

పరమ యోగి జాడ భక్తుండెరుంగును||విశ్వ||

605 లోకరీతి – చెడ్డవారు :
******** ********************

67 605
(1-72)
ఇంటి యాలు విడిచి యిల జారకాంతల

వెంట దిరుగు వాడు వెఱ్ఱి వాడు

పంట చేను విడిచి పఱిగె యేరిన యట్లు! ||విశ్వ||

68 605
(2-7)
ఇచ్చు వాని వద్ద నీని వాడుండిన

చచ్చు గాని నీవి సాగ నీడు

కల్పతరువు కింద గచ్చ చెట్టున్నట్లు||విశ్వ||

69 605
(1-15)
వేరుపురుగు చేరి వృక్షంబు జెరుచును

చీడపురుగు చేరి చెట్టు జెరుచు

కుత్సితుండు చేరి గుణవంతు జెరుచురా |విశ్వ|

70 605
(1-56)
మేడిపండు జూడ మేలిమై యుండును

పొట్ట విచ్చి చూడ పురుగు లుండు

బెరుకువాని మదిని బింక మీలాగురా |విశ్వ|

71 605
(2-81)
పట్ట నేర్చు పాము పడగ యోరగ జేసు

చెరుప జూచువాడు చెలిమి జేసు

చంప దలచు రాజు చనవిచ్చు చుండురా !..

72 605
(2-212)
కుక్క గోవు గాదు కుందేలు పులి గాదు

దోమ గజము గాదు దొడ్డదైన

లోభి దాత గాడు లోకంబు లోపల||విశ్వ||

606 లోకరీతి – మూర్ఖులు :
******** ********************

73 606
(3-129)
ఓగు బాగెరుగని యొట్టి మూఢ జనంబు

లిల సుధీ జనముల నెంచుటెల్ల

మృగము తోడ కుక్క మొరగిన సామ్యమౌ||విశ్వ||

607 లోకరీతి – రాజనీతి :
******** *******************

74 607
(3-62)
సాధు సజ్జనులను సంతరించిన వాడు

ప్రజల సంతసంబు పరచువాడు

కదసి శాత్రవులను కరుణ జూచినవాడు

.పాదుకొన్న ధర్మప్రభువు వేమ !

609 లోకరీతి – మానవ సామాన్యం :
******** ********************

75 609
(1-134)
కనులు పోవు వాడు, కాళ్ళు పోయిన వాడు

ఉభయు లరయ, గూడి యుండినట్లు

పేద పేద గూడి పెనగొని యుండును||విశ్వ||

(పరస్పర సహకారం బహుళార్థ సాధకం )

76 609
(2-116)
బడుగు నెరుగలేని ప్రాభవం బది యేల?

ప్రోది యిడని బంధు భూతి యేల?

వ్యాధి దెలియలేని వైద్యుడు మరి యేల?||విశ్వ||

77 609
(2-218)
కూళ గూళ మెచ్చు గుణవంతు విడనాడి

యెట్టి వారు మెత్తు రట్టి వారి!

మ్రాను దూలంబులకు జ్ఞానంబు దెల్పునా?||విశ్వ||

78 609
(2-253)
తవుటి కరయ బోవ తండులంబుల గంప

శ్వాన మాక్రమించు సామ్యమునను

.లోభివాని సొమ్ము లోకుల పాలౌను|విశ్వ|

79 609
(2-185)
యొడలు బడల జేసి యోగుల మనువారు

మనసు కల్మషంబు మాన్ప లేరు

పుట్ట మీద గొట్ట భుజగంబు చచ్చునా||విశ్వ||

80 609
(2-160)
తనకు ప్రాప్తి లేక దాత లివ్వరటంచు

దోష బుద్ధి చేత దూరుటెల్ల

ముక్కు వంక జూచి ముకురంబు దూరుట||విశ్వ||

81 609
(3-267)
దేశ దేశములను గాసిలి దిరుగంగ

నాత్మ యందు ధ్యాన మంటుకొనునె?

కాసులకును దిరుగ గలుగునా మోక్షంబు ?|విశ్వ|

82 609
(2-100)
మధు రసంబు గోరి మక్షికంబులు చేరి

చొచ్చి వెడల లేక జొక్కినట్లు

మునిగి వెడల లేడు మోహాంబు రాశిలో||విశ్వ||

705 దృక్పథం ( Attitude & Outlook ) :
******** ************************************

83 705
(1-187)
జనన మరణములకు సరి స్వతంత్రుడు గాడు

మొదల కర్త గాడు తుదను గాడు

నడుమ కర్త ననుట నగుబాటు కాదొకో?||విశ్వ||

84 705
(3-84)
తనకు లేని నాడు దైవము దూరును

తనకు గలిగెనేని దైవ మేల?

తనకు దైవమునకు తగులాటమే శాంతి!||విశ్వ||

706 సుగుణాలు (good qualities) :
******** ****************************

85 706
(2-131)
ఒడ్డు పొడుగు గలిగి గడ్డంబు పొడుగైన

దాన గుణము లేక దాత యగునె?

యెనుము గొప్పదైన యేనుగు బోలునా||విశ్వ||

707 దుర్గుణాలు ( bad qualities) :
******** ****************************

86 707
(3-59)
కోపమునను ఘనత కొంచమై పోవును

కోపమునను మిగుల గోడు జెందు

కోప మడచెనేని కోరిక లీడేరు ||విశ్వ||

800 ప్రవర్తన – నడవడిక: ( conduct and behaviour ) :
******** ************************************************

802 చెడ్డ అలవాట్లు ( bad habits ), :
******** ******************************

87 802
(2-318)
నీచుల వినుతులు సేయుచు

యాచకమున దిరిగి తిరిగి యలసుట కంటెన్

యేచిన నింద్రియ పశువుల

గాచిన వా డిందు నందు ఘనుడగు వేమా !

1000 చతుర్విధ పురుషార్థాలు ( ధర్మార్థకామమోక్షాలు ) :
******** *************************************************

1010 ధర్మం ( శాంతి, సామరస్యం ) :
******** *****************************

88 1010
(3-27)
ఇహము నందు బాధ లెన్నైన బడవచ్చు

యముని బాధ లేక నమర వలెను

పరము బాధ లేక బ్రతుకుడీ నరులార ||విశ్వ||

89 1010
(2-284)
తనువు లస్థిరములు ధర్మంబు నిత్యము

చేయు ధర్మమెల్ల చెడని పదవి

కని విని మరి తెలియ గనరు నర పశులు||విశ్వ||

90 1010
(1-42)
పూర్వ జన్మమందు పుణ్యంబు సేయని

పాపి ధనము కాశ పడుట యెల్ల

విత్త మరచి, కోయ వెదకిన చందంబు |విశ్వ|

1011 ధర్మాలు విశేష ( ప్రత్యేక ) :
********** *******************************

91 1011
(3-220స)
యెరుక గలుగుటకును నే జాతియును నేమి

యెరుక లేక దిరుగ నేమి గలదు?

యెరుక గలుగు వరకె యీ జాతి ధర్మములు! |విశ్వ|

(ఏ జాతియును నేమి అంటే భారత జాతి గాని,
ఇతర జాతులైనా సరే అని)
( యీ జాతి ధర్మములు అంటే –
వర్ణ, ఆశ్రమ, మత, వృత్తి ధర్మాలు అని)

1050 అర్థం ( ధనం, సంపాదన ) :
******** **************************

92 1050
(2-26)
కలిగిన మనుజుండు కాముడు సోముడు

మిగుల తేజమునను మెరయుచుండు

విత్తహీను డెంత రిత్తయై పోవును |విశ్వ|

93 1050
(3-30)
అర్థవంతు సొమ్ము లాసింతు రర్థుల

య్యర్థికీని సొమ్ము వ్యర్థ మౌను

వ్యర్థమైన సొమ్ము వ్యర్థుల జేరురా |విశ్వ|

94 1050
(1-129)
ధనము గూడ బెట్టి ధర్మంబు సేయక

తాను దినక లెస్స దాచు గాక

తేనె నీగ గూర్చి తెరవరి కియ్యదా?||విశ్వ||

95 1050
(3-18)
ఆకలన్న వారికన్నంబు బెట్టితె

హరున కర్పితముగ నారగించు

ధనవిహీనున కిడు దానము లటువలె||విశ్వ||

1060 కామం (కోరిక, ఆశ, ధన వినియోగం ) :
******** *************************************

96 1060
(1-69)
ఎక్కుడైన యాశ లినుమడి యుండగా

తిక్క బట్టి నరుడు తిరుగు చుండు

కుక్క వంటి యాశ కూర్చుండ నివ్వదు||విశ్వ||

1080 మోక్షం ( సర్వాధిక ఆనందం ) :
******** ******************************

97 1080
(2-170)
మనసు లోని ముక్తి మరియొక్క చోటను

వెదుక బోవువాడు వెర్రివాడు

గొఱ్ఱె చంక బెట్టి గొల్ల వెదుకు రీతి||విశ్వ||

(శక్తి, యుక్తి, భుక్తి , రక్తి, భక్తి, ముక్తి, –
అన్నీ మనసు లోనే ఉన్నాయి!)

1310 స్త్రీలకు ప్రత్యేక విషయాలు :
******** *****************************

98 1310
(2-226)
స్త్రీ నెత్తిని రుద్రునకును

స్త్రీ నోటను బ్రహ్మ కెపుడు, సిరి గుల్కంగా

స్త్రీ నెరి రొమ్మున హరికిని

స్త్రీ నెడపగ గురుడ వీవు దేవర వేమా !

99 1310
(2-134)
స్త్రీలు గల్గు చోట చెల్లాటములు గల్గు

స్త్రీలు లేని చోటు చిన్నబోవు

స్త్రీల చేత నరులు చిక్కుచున్నారయా|విశ్వ|

100 1310
(1-64)
వెర్రివాని కైన వేషధారికి నైన

రోగి కైన పరమ యోగి కైన

స్త్రీల జూచినపుడు చిత్తంబు రంజిల్లు! |విశ్వ|

101 1310
(1-121)
మగని కాల మందు మగువ కష్టించిన

సుతుల కాల మందు సుఖము బొందు

కలిమి లేమి రెండు గలవెంత వారికి

బలిమి పుత్రబలిమి బలిమి వేమ !

(“పుత్త్ర బలిమి” అంటే “సంతాన కలిమి” అని అర్థం )

102 1310
(2-175)
చెప్పు లోని రాయి చెవి లోని జోరీగ

కంటిలోని నలుసు కాలి ముల్లు

నింటి లోని పోరు నింతింత గాదయా||విశ్వ||

1400 కాలం – స్వరూపం, మహిమ :
******** ****************************

103 1400
(3-70)
కాలము తనకిక చాలా

కాలము గలదంచు నున్న కాలము నందున్

కూళుడు తను దా దెలియక

కూలెను తొలి బాము నందు గొబ్బున వేమా!

1700 మతం :
******** ********

104 1700
(2-359)
మతము లెన్ని యైన సతముగా నుండవు

సతముగాను యుండు జగతి నొకటి

యంత మదము విడిచి నా బ్రహ్మ మరయుట|విశ్వ|

1900 చర్చనీయాంశాలు ( Debatables ) :
******** *************************************

105 1900
(1-106)
మాట దిద్ద వచ్చు మరి యెగ్గు లేకుండ

దిద్ద వచ్చు రాయి తిన్నగాను

మనసు దిద్ద రాదు మహి నెంత వారికి |విశ్వ|

106 1900
(1-169)
ఏరు దాటి మెట్ట కేగిన పురుషుండు

పుట్టి సరకు గొనక పోయినట్లు

యోగ పురుషు డేల యొడలు పాటించురా!|విశ్వ||

2300 మోక్ష సాధనా మార్గాలు :
******** *************************

2310 కర్మయోగం :
******** *************

107 2310
(2-224)
ఒల్లనన్న బోదు, యొలెనన్నగా రాదు

తొల్లి జేయునట్టి ధూర్తు ఫలము

యుల్ల మందు వగవ కుండుట యోగ్యంబు||విశ్వ||

2320 ధ్యానయోగం :
******** **************

108 2320
(1-303)
అంతరంగమందు నభవు నుద్దేశించి

నిల్చి చూడ జూడ నిలుచు గాక

బాహ్యమందు శివుని భావింప నిల్చునా||విశ్వ|

2330 భక్తియోగం :
******** ************

109 2330
(2-167)
ఒక్క తోలు దెచ్చి యొరపు బొమ్మను జేసి

యాడునట్లు జేసి యట్టె వేసె

తన్ను దిప్పు వాని తానేల కానడో?||విశ్వ||

2340 జ్ఞానయోగం :
******** *************

110 2340
(1-170)
మంటి కుండ వంటి మాయ శరీరంబు

చచ్చు నెన్నడైన, జావ దాత్మ!

ఘటము లెన్ని యైన గగనంబు యేకమే||విశ్వ||

111 2340
(2-171)
ఆశ కన్న దుఃఖ మతిశయంబుగ లేదు

చూపు నిలుపకున్న సుఖము లేదు

మనసు నిలుపకున్న మరి ముక్తి లేదయా||విశ్వ||

112 2340
(1-122)
ఆరు రుచులు వేరు, సారంబు యొక్కటి

సత్య నిష్ఠ వేరు, సత్య మొకటి

పరమ ఋషులు వేరు, భావ్యుండు యొక్కడు|విశ్వ|

113 2340
(1-195)
కల్మషంబు పోక కనుపించ దెందును

రూప మెవ్వరికిని రూఢి తోడ

తామసం బుడిగిన, దగ గల్గు జ్ఞానంబు||విశ్వ||

114 2340
(1-115)
స్వానుభూతి లేక శాస్త్ర వాసనలచే

సంశయంబు చెడదు సాధకునకు

చిత్రదీపమునను జీకటి చెడనట్లు ! ||విశ్వ||

115 2340
(1-182)
జీవిలోన నుండు స్థిరమును గానక

తిరుగు నస్థిరంబు వరుస నమ్మి

స్థిరము నస్థిరమును దెలియ జీవికి ముక్తి|విశ్వ|

116 2340
(1-218)
ఆత్మబుద్ధి వలన నఖిలంబు తానయ్యె

జీవబుద్ధి వలన జీవుడయ్యె

మోహబుద్ధి లయము ముందర గనుగొను||విశ్వ||

*****************************************

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s


%d bloggers like this: