(1101D) శ్రీమద్ భాగవతం (బమ్మెర పోతన)-1 వ స్కంధ సారం

శ్రీరామ
పోతన భాగవతం ( 1 వ స్కంధ సారం )
************************************
సూచన: ( పిల్లలకు ఈరోజుల్లో కంఠస్థ యోగ్యమైన పద్యాలను, పద్య-వచన
 భాగాలను క్రింద ఇవ్వటం జరిగింది. 1వ స్కంధంలోచే ఎంపిక
 చేసిన ఇంకా చాలా మంచి మంచి పద్యాలు, భావాలు,
 వచనాలను ’ కంఠస్థ భారతి ’ కి  అనుబంధ బ్లాగు అయిన
 ” తెలుగు భారతి ” లో పొందు పర్చాము.)
****************************************************
గురువు
1 203 42/1,2 క. గురువులు ప్రియశిష్యులకుం
బరమ రహస్యములు దెలియ బలుకుదు (రచల ).
లోకరీతి 
2 601 520 వ. గ్రహ నక్షత్ర తారక మధ్యంబునం దేజరిల్లు
రాకాసుధాకరుండునుం బోలె
3 603 378/1  క. బలములుగల మీనంబులు
బలవిరహిత మీనములను భక్షించు క్రియన్
దృక్పథం
4 705 18/2 పలికించెడివాడు రామభద్రుండట !
ప్రారబ్ధం
5 705 483/3,4 దైవయోగమున్ దాటగ రాదు.
సుగుణం
6 706 14/3,4 తే. దయయు సత్యంబు లోనుగా దలపడేని
గలుగనేటికి దల్లుల కడుపు జేటు !
7 706 19/3,4 విబుధజనుల వలన విన్నంత కన్నంత
తెలియవచ్చినంత తేటపఱతు !
సంభాషణ ( పరీక్షిత్తు – శుకమహర్షితో )
8 807 521/4  ఉ. ( ఈ ) వేళకు నీవు వచ్చితివి
వివేకవిభూషణ ! దివ్యభాషణా !
లోకక్షేమం ( ధర్మదేవత – పరీక్షిత్తుతో )
9 1010 427 వ. మా వలన దుఃఖంబు నొందెడు పురుషుండు లేడు.
మానవ కనీస ధర్మం ( పరీక్షిత్తు- శమీకముని గురించి )
10 1010 462 ఆ. వారి గోరుచున్న వారికి శీతల
వారి యిడుట యెట్టివారి కయిన
వారితంబుగాని వలసిన ధర్మంబు
వారి యిడడు, దాహవారి గాడు !
రాజధర్మం ( పరీక్షిత్తు-భూదేవితో )
11 1011 423 క. సాధువులగు జంతువులకు 
బాధలు గావించు ఖలుల భంజింపని రా
జాధము నాయు స్స్వర్గ
శ్రీ ధనములు వీటిబోవు సిద్ధము తల్లీ!
( పరీక్షిత్తు- భూదేవితో )
12 1011 424 క. దుష్టజన నిగ్రహంబును
శిష్టజనానుగ్రహంబు జేయగ నృపులన్
స్రష్ట విధించె, బురాణ
ద్రష్టలు సెప్పుదురు పరమ ధర్మము సాధ్వీ!
13 1011 483 . సీఆ. ( మన ) కింక, రాజు నశించిన రాజ్యమందు
బలవంతుడగువాడు బలహీను పశు
దార హయ సువర్ణాదుల నపహరించు;
ఆదర్శ భార్య  ( 1వ స్కంధ పీఠికలో)
14 1384 9–337 సిగ్గుపడుట గల్గి సింగారమును గల్గి
భక్తి గల్గి చాల భయము గల్గి
నయము ప్రియము గల్గి నరనాథు చిత్తంబు
 సీత తనకు వశము చేసికొనియె.
కాలం
15 1400 210 ఉ. పాయుచు గూడుచుండు నొకభంగి చరింపదు కాలమన్నియుం
జేయుచునుండు గాలము విచిత్రము దుస్తర మెట్టివారికిన్
కలికాలం
16 1401 403/2  క. ఘోరకలి ప్రే – రణమున బాపసమూహ
వ్రణయుతులగు జనులజూచి వగచెద దండ్రీ!
 
కలి – వెసులుబాటు
17 1401 442/1,2 ఉ. చేసినగాని పాపములు సెందవు;  చేయదలంచి నంతటం
జేసెదనన్న మాత్రమున జెందుగదా కలివేళ బుణ్యముల్!
కలిలో ధీరులు
18 1401 443 వ. ధీరులైన వారికిం గలి వలని భయంబు లేద” ని  
పదాల పొందిక
19 1427 86/8 సీ. నయ విశారదుండు నారదుండు
( పరీక్షిత్తు గురించి ధర్మరాజుతో, విప్రులు ) 
20 1427 293/8. తే.  మానధనుడు నీ మనుమడు మానవేంద్ర!
21 1427 506/2. రమ్మా నా కెదుర గంగ !  రమ్య తరంగా !
ధర్మదేవత 4 పాదాలు 
22 1520 429 వ. ” కృతయుగంబునం దప, శ్శౌచ, దయా, సత్యంబులు ” .
ధ్యానం
23 2320 220/4 మ. పరమేశుండు వెలుంగుచుండెడును  హృత్పద్మాసనాసీనుడై
ప్రార్థన (”గజేంద్రమోక్షం” ) 1 వ స్కంధ పీఠికలో
24 2334 73 ఉ. ఎవ్వనిచే జనించు జగమెవ్వని యందునుండు లీనమై
యెవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వ డనాదిమధ్యలయు డెవ్వడు సర్వము తానయైన వా
 డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్.
25 2335 009/4 భావాంబరవీధి విశ్రుత విహారిణి
నన్ గృపజూడు భారతీ !
26 2335 010/4 దుర్గ మాయమ్మ కృపాబ్ధి యిచ్చుత 
మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ !
27 2335 252/1,2  ఉ. తండ్రులకెల్ల తండ్రియగు ధాతకు తండ్రివి దేవ! నీవు మా
తండ్రివి దల్లివిం బతివి దైవమవున్ సఖివిన్ గురుండ ( వే )
*****************************************************
NOTE:
To view the other blog ” Telugu Bharathi “, pl. do as follows.
For a full view of the side-bar, please click on the title  
” KAMTHASTHA BHARATI ” at the top of this Post.
You may click on the name ” TELUGU  BHARATHI “
in the Blog – Roll in the side-bar of this page.
Or, you may directly visit the website ( blog )
” telugubharathi.wordpress.com ” .      
                           
ప్రకటనలు

ఒక స్పందన to “(1101D) శ్రీమద్ భాగవతం (బమ్మెర పోతన)-1 వ స్కంధ సారం”

  1. Rajesh.B Says:

    Hi konni mukyamaina padyalu unchi, daniki teeka tatpryalu unchite inka baguntundi.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: