(1101A) కృష్ణ శతక సారం (6+6+6 ) పద్యాలు

(1101A) కృష్ణ శతక సారం (6+6+6 ) పద్యాలు 
“కృష్ణ శతకం ” భక్తి రస మాధుర్యానికి పెట్టింది పేరు!
అతి చిన్నపిల్లలకు కూడ నోఱు తిరిగేటంతటి
పదలాలిత్యం! ఆస్వాదింప జేయండి!
*************************

2330 భక్తియోగం :
2334 నిర్గుణ స్తోత్రాలు
2335 సగుణ స్తోత్రాలు ;

1 2334 2
నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడునీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా !

2 2334 9
ఓ కారుణ్య పయోనిధి !
నాకాధారంబ వగుచు నయముగ బ్రోవన్ |
నాకేల యితర చింతలు
నాకాధిప వినుత ! లోకనాయక కృష్ణా !

3 2334 33
చుక్కల నెన్నగ వచ్చును
గ్రక్కున భూరేణువులను గణుతింప నగున్
జొక్కపు నీ గుణజాలము
నక్కజమగు లెక్కపెట్ట నజునకు కృష్ణా!

4 2334 78
గ్రహభయ దోషము లొందవు
బహు పీడలు చేర వెఱచు పాయును నఘముల్
ఇహపర ఫలదాయక! విను
తహతహ లెక్కడివి నిన్ను దలచిన కృష్ణా!

5 2334 82
నీ నామము భవహరణము
నీ నామము సర్వసౌఖ్య నివహ కరంబున్
నీ నామ మమృత పూర్ణము
నీ నామము నే దలంతు నిత్యము కృష్ణా!

6 2334 92
దండమయా ! విశ్వంభర !
దండమయా ! పుండరీక దళనేత్ర హరీ !
దండమయా ! కరుణానిధి !
దండమయా ! నీకు నెపుడు దండము కృష్ణా !

( “హరీ !” అనగా ” పాపములను హరించువాడా ! ” )

సూచన:

ప్రపంచం మొత్తం మీద తెలుగు భాష అర్థమయ్యే
సర్వ మానవులూ చేయదగిన నిత్య ప్రార్థనగా,
పై ఆరు పద్యాల చివరలో ” కృష్ణా ! ” అనే చోట
ఎవరి ఇష్ట దైవం పేరును వారు రెండక్షరాలలో-
నాలుగు మాత్రలలో – చేర్చుకొనవచ్చును !

ఉదా:- రామా,శంభో,దేవా,దేవీ, అంబా, తల్లీ,
అల్లా, యేసూ, “ప్రభువా”, “గురువా”,…, ఇలా

ఏ మతం వారైనా, ఎవరి ఇష్టదైవాన్ని వారు
ఎంత సుందరమైన, అద్భుతమైన భక్తిభావ
కుసుమాలతో అర్చించుకొవచ్చో చూశారా !

Universal Prayer అంటే ఇదీ !

****************************

7 2334 10
వేదంబులు గననేరని
ఆది పరబ్రహ్మమూర్తి వనఘ మురారీ!
నా దిక్కు చూచి గావుము
నీ దిక్కే నమ్మినాడ నిజముగ కృష్ణా!

8 2335 21
అండజవాహన! విను బ్ర
హ్మాండంబుల బంతులట్ల యాడెడి నీవా
కొండల నెత్తితి వందురు
కొండిక పని గాక దొడ్డకొండా కృష్ణా!

9 2335 36
అగణిత వైభవ! కేశవ!
నగధర! వనమాలి! యాదినారాయణ! యో
భగవంతుడ! శ్రీమంతుడ!
జగదీశ్వర! శరణు శరణు శరణము కృష్ణా!

10 2335 95
సర్వేశ్వర ! చక్రాయుధ !
శర్వాణీ వినుత నామ ! జగదభిరామా !
నిర్వాణనాథ ! మాధవ !
సర్వాత్మక ! నన్ను గావు సదయత కృష్ణా !

11 2335 61
గజరాజవరద! కేశవ!
త్రిజగత్ కల్యాణమూర్తి! దేవ! మురారీ!
భుజగేంద్రశయన! మాధవ!
విజయాప్తుడ! నన్ను గావు వేగమె కృష్ణా!

12 2335 3
నారాయణ! పరమేశ్వర!
ధారాధర నీలదేహ! దానవ వైరీ!
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా! నను గావు కరుణ వెలయగ కృష్ణా!

***************************

13 2335 1
శ్రీ రుక్మిణీశ ! కేశవ !
నారద సంగీత లోల ! నగధర ! శౌరీ !
ద్వారక నిలయ ! జనార్దన !
కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా !

14 2335 14
అందెలు గజ్జెలు మ్రోయగ
చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందుని సతి యా గోపిక
ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా!

15 2335 27
జయమును విజయున కియ్యవె
హయములు ములుకోల మోపి యదలించి మహా
రయమున రొప్పవె తేరును
భయమున రిపుసేన విఱిగి పాఱగ కృష్ణా!

16 2335 56
పురుషోత్తమ! లక్ష్మీపతి!
సరసిజగర్భాది మౌని సన్నుత చరితా!
మురభంజన! సురరంజన!
వరదుడవగు నాకు భక్తవత్సల! కృష్ణా!

17 2335 66
బలమెవ్వడు కఱి బ్రోవను
బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్ |
బలమెవ్వడు సుగ్రీవుకు
బలమెవ్వడు నాకు నీవె బలమౌ కృష్ణా !

18 2334 100
కందర్పకోటి సుందర!
మందరధర! భానుతేజ! మంజులదేహా!
సుందర విగ్రహ! మునిగణ
వందిత! మిము దలతు భక్తవత్సల! కృష్ణా!

***************************

ప్రకటనలు

4 వ్యాఖ్యలు to “(1101A) కృష్ణ శతక సారం (6+6+6 ) పద్యాలు”

 1. Asooryampasya Says:

  కృష్ణ శతకం – వికీసోర్సు లో పెట్టబడుతూ ఉంది… మీరు దానికి ఇక్కడ లంకె ఇస్తే చాలు… మీకు ఇదంతా టైపింగ్ శ్రమ అని…చెబుతున్నాను 🙂

  te.wikisource.org/wiki/కృష్ణ_శతకము
  Thank you, Asooryampasya ! Due to temporary problem in my system in typing telugu script , I am replying in English. A good suggestion. Will be followed. However, our aim is to provide not the entire text, but to give only a slect few poems, selected to suit the age and cultural requirements of Elementary-school going children; and to provide that essence in well arranged order, readily referable, and copy printable. The objective is to enable and encourage recitation (getting by heart) of gems of poems by kids.
  You will be able to appreciate this focussed effort if you visit the Page “VEMANA SATAKAM’ in the same blog. Thanking you.

 2. RAJANISH SEKHAR.T.TONPE Says:

  Manchi web site. Manchi aalochana. Desa bhashalandu telugu lessa!

 3. Sai Says:

  I want these padyala bhavaalu also how can I get it

 4. samanvayabharathi Says:

  సాయి గారూ, నమస్తే! మీరు ఆంధ్రప్రదేశ్ లోనే నివాసం ఉంటూంటే, పుస్తకాల షాపుల్లో కృష్ణ శతకం (తాత్పర్య సహితం) దొరుకుతుంది. On-lineలో కూడ ప్రయత్నించి, దొరకకపోతే మళ్ళా తెలియజేస్తే, ఈ కొన్ని పద్యాలకు మాత్రం తాత్పర్యం వ్రాసి బ్లాగులో పెడతాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: