(00)”కంఠస్థ రత్న మాలిక ” గురించి

(Kindly Note : In case the Telugu script appears jumbled here,

(1) Please open this web site through Internet Explorer .

( Mizilla Firefox is giving distortion of the font selected.)

Or, (2) you may select the required page, copy and paste into Wordpad or Notepad and view in required format, which was originally set as “Gautami – bold – 14 “)

 

ప్రియమైన తల్లిదండ్రులారా!

అభివందనములు !

 • అల్పాక్షరములలో అనల్పార్థమును నిక్షిప్తం చేయటమే ఉత్తమ సాహిత్యం యొక్క లక్షణం.
 • కంఠస్థం చేయటానికీ, చాలా కాలం తరువాత జ్ఞాపకం చేసుకోవటానికీ ఛందోబధ్ధమైన పద్య సాహిత్యం ఎంతో అనుకూలం.
 • చిన్నవయసులోనే కంఠస్థం చేసిన విద్య జీవితాంతం గుర్తుండి పోతుంది.
 • నీతులు, సామెతలు, సూక్తులు, వ్యవహార పధ్ధతి, ధోరణులు, దృక్పథాలు, సంస్కారం (mind-culture), భక్తి స్తోత్రాలు, ఆధ్యాత్మిక విషయాలు మొ || సమయోచితంగా స్ఫురిస్తుంటే, వ్యక్తిత్వ వికాసానికి (PERSONALITY DEVELOPMENT) కి ఇంతకంటే కావలసిందేముంటుంది?
 • సాంస్కృతిక విలువల పునాది ఉన్న పిల్లలు, విదేశాలకు వెళ్ళినా, భారతీయతకు గౌరవం తెచ్చేవిధంగా ఉంటారు.
 • ఈ విషయాలన్నీ మాతృభాషలో అయితే సులభంగా, పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు.
 • భారతీయ భాషలన్నిటికీ మూలం సంస్కృత భాష.
 • అక్షరాల వర్ణమాలలో గాని, ఉచ్చారణలో గాని, ఎక్కువ సంస్కృత పదాలని తనలో కలుపుకోవటంలో గాని-తెలుగుభాష సంస్కృతానికి అత్యంత సన్నిహితం.
 • వేలాది సంవత్సరాలుగా జీవనదిలా ప్రవహిస్తూ వస్తూన్న మన భారతీయ సంస్కృతి మూలాలు సంస్కృతభాష లోనే ఉన్నాయి గదా!
 • అందుకనే సంస్కృత శ్లోకాలు, సూక్తులు కూడ పిల్లలకు నేర్పించటం వారి మానసిక పరిణతికి అత్యవసరం.
 • కంఠస్థం చేసే శక్తి, సమయం పరిమితం కనుక ప్రామాణిక గ్రంథాలనుంచి పిల్లలకు అవసరమైన అంశాలు మాత్రం సేకరించి అందించాలి.
 • పద్య గద్య రత్నములను సేకరించి, కూర్చి “కంఠస్థ రత్నమాలిక” గా మీకు అందించే బాధ్యత మాది !
 • దానిని పిల్లల కంఠాలకు అలంకరించే బాధ్యత మీది !
 • మిలమిల మెరిసే భాగ్యం మీ పిల్లలది !
 • అమ్మ స్వయంగా నేర్పించితే, ఆ తల్లీబిడ్డల అనుబంధం ఎంత హృదయంగమం !
 • తల్లికి కుదరక పోతే తండ్రి.
 • ఇద్దరికీ కుదరక పోతే, పేరెంట్స్‌గా స్కూలు మేనేజ్‌మెంట్‌తో మాట్లాడవచ్చు- అందరికీ అవసరమైన విషయమే గాబట్టి- కనీసం వారానికి ఒక పీరియడైనా ఈ మానసిక వికాసానికై కేటాయించమని !
 • అదీ కుదరక పోతే ఇక భాషా ఉపాధ్యాయులతో ట్యూషన్ చెప్పించడం.
 • అవసరాన్ని గ్రహిస్తే – ఖర్చు, శ్రమ ఎంతైనా వెనుదీయక పోవటం మనకు చేతనయినదే గదా !
 • శుభస్య శీఘ్రమ్ !
ప్రకటనలు

11 వ్యాఖ్యలు to “(00)”కంఠస్థ రత్న మాలిక ” గురించి”

 1. bulusuvsmurty Says:

  manchi prayatnam abhinandanalu. ade darilo ma prayatnamu. kalisi naduddamu.

 2. ఉష Says:

  ఆలస్యంగానైనా మీ వెబ్ సైట్ ను కనుక్కున్నందుకు సంతోషంగా ఉంది. “ఉదారచరితానాం తు వసుధైవ కుటుమ్బకమ్” అన్న సూక్తికి తాత్పర్యం అన్వేషిస్తూ ఇక్కడికి రావటం జరిగింది. మరిన్ని వివరాలు తెలుసుకొనగలిగాను. ధన్యవాదాలు.

 3. ravindra tummala Says:

  Mi web site chala bagundi sir……..

 4. జాజిశర్మ Says:

  అద్భుతం. ఇది ప్రతి తల్లిదండ్రులకు కనువిప్పుకావాలి.
  మీకు మాపత్యేక శుభాభివందనములు.జాజిశర్మ

 5. rathnamsjcc Says:

  why we should not send email to you whether there is some mistake in my email then why are posting for public issues thank you

 6. samanvayabharathi Says:

  ప్రియమైన Rathnamsjcc గారికి, నమస్కారములు. మీయొక్క అభిప్రాయములు యథాతథంగా ఈ Comments Boxలో వ్రాయవచ్చు. వేరే E-Mail సౌకర్యం లేదు. మీరు ఏమి వ్రాసినా, ప్రచురించటానికి అభ్యంతరం లేదు. ఎందుకంటే – పాాఠకులకు భిన్న భిన్న అభిప్రాయాలు తెలియవలసిన అవసరం ఉన్నదిగదా !

 7. rathnamsjcc Says:

  మనసు నిలుపకున్న ముక్తి లేదయా చూపు నిలుపకున్న సుఖము లేదుబ్రహ్మ మనగ వేరె పరదేశమున లేడు బ్రహ్మ మనగ జూడు బట్ట బయలు, తనకు తానె బ్రహ్మ తారక మౌనయా సకల చరాచర జీవ సమూహమును, తరులు, గిరులు, నరులు, అనే తార తమ్యం లోకుండా సమస్త ప్రవక్తలను, సమస్త గురువులను, బోధకులను, సమస్త పీఠాధిపతులను, , మాతలను, సమస్త దైవావ తారముల మనస్సునిలిపి నీ నిజస్వరూ పం బట్టబయలుగమీకు సూక్ష్మం అనుభూతి కాగలదు.“లోపట – బయట సూక్ష్మంచైతన్యమై, పరిపూర్ణమైన సూక్ష్మంబ్రహ్మానుభూతిని చవిచూస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ. పరిశుద్ధ మనస్సు పరమాత్మ స్వరూపం. ఈ దశలో మనసు బ్రహ్మాకారం గ వర్ధిల్లుతుంది. జాగ్రదావస్ధలో బ్రహ్మ0. అనుభవమే సమాధి..మనస్సు నిలిపి. సర్వమత సంబంధ, సమస్త జ్ఞానబోధల సారం ఇందే ఇమిడియున్నది.
  సద్గురువు సూక్ష్మం అనుభవము
  B. రత్నం గారి

 8. nagamanikanta Says:

  గౌరవనీయులైన బ్లాగు ఓనరు గారు నాకు ” నీవు మారు , నీ కోసం ప్రపంచం మారుతుంది ”
  అనే అంశం పై ఒక వ్యాసం ను —
  kmani.143143@gmail.com
  ఈ మెయిల్ కు పంపగలరు.

 9. B V KRISHNA RAO Says:

  your website is an excellent, for all telugu people who want to learn and appreciate the ancient telugu culture, and its practical applicability to current situations.

 10. raju Says:

  Deshabashalandu TELUGU lessa! I love telugu

 11. rathnam.B Says:

  ఓ మిత్రులారా! మనం అందరం చిన్నప్పటి నుండి మన పెద్ద వాళ్ళు చెప్పారని దేవాలయాలకు పోతున్నాము. అక్కడ గర్బగుడిలో వున్న ఈశ్వర లింగాన్ని లేక అక్కడ వున్నా దేవత ప్రతిమని చూసి మనసార మొక్కుకొని, మన కోరికలన్నీ కోరుకొని ఇంటికి వచ్చి ఈరోజు గుడికి వెళ్లి నేను దేవుడిని దర్శనం చేసుకున్నాను అనుకోని మనం సంతృప్తి పడతాము. కానీ ఇక్కడ ఒక వేదాంత విషయాన్నీ గ్రహించాలి.అది ఏమిటంటే దేవాలయం అంటే మట్టితో కట్టిన ఒక భవనం అందులో (గర్భ గుడిలో) అంటే అంతరంలో ఈశ్వరుడు . అతని దర్శనం నిజానికి పరిపూర్ణమైన, సుందరమైన ఆలయమంటే మానవశరీరం. ఇక్కడ “తత్” (ఆత్మ) ఇల్లు చేసుకొని జ్ఞానేంద్రియాలు,కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచవిషయాలు అంతరంగ వృత్తులు (అంత: కరణ, మనస్సు, చిత్త, బుద్ధి,అహంకారాలు) తమ క్రియలను నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చింది. దేహమే దేవాలయం. దేహంలో ఉన్న జీవమే పరమత్మ. జీవాత్మ పరమాత్మకంటె వేరన్న అజ్ఞానమే నిర్మాల్యం; నేనే అతనని పూజించలి అని అగమాలు ఘోషిస్తాయి. దేవాలయం ఒక దేహం లాంటిది. శిఖరం శిరస్సు; గర్భగృహం మెడ, ముందరి మంటపం ఉదరం; ప్రాకారపు గోడలు కాళ్ళూ; గోపురం పాదాలు; ధ్వజ స్తంభమే జీవితం. ఇలా ఆలయం భగవన్మూర్తిగా భావింపబడుతోంది. అందువల్లనే దేవలయాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నము. అక్కడే మనం విశ్వసిస్తున్నాము. దేవాలయ ప్రాచీనత : భగవంతుడు లేకుండా మానవుడు జీవించలేడనీ, శివుని అజ్ఞ లేనిదే చీమైనాకుట్టదనీ, అందుకనే భగవన్మూర్తిని ఒకచోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాము.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: