‘(306) సంస్కృత సూక్తి భారతి’ అనే వర్గంలోని టపాలు

హితోపదేశం నీతి సూక్తులు ( సంస్కృతం ) – 200

అక్టోబర్ 12, 2009

పంచతంత్ర కథలతో శ్రీ నారాయణ పండితుడు సంస్కృతంలో రచించిన ” హితోపదేశం ” గ్రంథం ఒక అద్భుత నీతిశాస్త్రం ! మధురమైన శైలిలోనున్న నీతికావ్యం ! సమస్త భారతీయ నీతిసార సంగ్రహం !

ప్రస్తుతానికి, మిత్రలాభము ( 1 & 2 అధ్యాయాలు ) నుండి పిల్లలకు కంఠస్థయోగ్యమైన 200 సూక్తులను ఎంపిక చేసి,మీ ముందు ఉంచుతున్నాం. ఇదివరకే ఇదే బ్లాగులోనే అందించిన వేమన సూక్తులు, భగవద్గీతా సూక్తుల తరువాత ఈ హితోపదేశ సూక్తులను కూడ పిల్లలకు ” రోజుకో సూక్తి ” పద్ధతిలో నేర్పిస్తే, వారియొక్క దృక్పథం ( Outlook ), శీలం ( Character ), వ్యవహారజ్ఞత ( Behavioural Aspects ) విషయాలలో మంచి పరిజ్ఞానంతోబాటుగా, భారతీయ సంస్కృతియొక్క పూర్తి పరిచయంకూడ కలిగితీరుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. మాతృభాషతో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది కూడా.
వీలు వెంబడి వీటి భావం తెలుగులోగాని, ఇంగ్లీషులోగాని అందిస్తాము.
ఈ నీతి సూక్తులను చూడటానికి ఇలా చేయండి:

Please click on the title ” KAMTHASTHA BHARATHI ” at the top of this Post, to get a full view of the side-bar. Then click on the page ” Hitopadesm Niti Suktulu ” in the side-bar. You have so many other Pages also on related topics useful for School Children ! BEST OF LUCK !

భగవద్గీతా సూక్తులు ( విద్యార్థులకు )

సెప్టెంబరు 28, 2009

భగవద్గీతా సూక్తులు కొన్నైనా తెలియనివారు భారతీయులే కారు !
వేమన సూక్తులు కొన్నైనా తెలియనివారు తెలుగువారే కారు !
Primary / Upper Primary School విద్యార్థుల గ్రహణ శక్తిని
దృష్టిలో నుంచుకొని, గీతాహృదయం స్ఫురించేలా, వారికి జీవితాంతం
గుర్తుకు వస్తూండేలా, కంఠస్థ యోగ్యమైన 315 one-line
quotations ను సేకరించి, విషయానుక్రమంలో అందిస్తున్నాం.
శ్లోకసంఖ్యలను కూడ ఇవ్వటం జరిగింది కాబట్టి, వీటి భావాన్ని ఏ చిన్న
గీతాపుస్తకంలోనుండి అయినాగ్రహించే వీలుంది. అయినా,
వీలువెంబడి తాత్పర్యమును కూడ అందించే ప్రయత్నం చేస్తాము.

For viewing the Quotations, please click on the
Title ” KAMTHASTHA BHARATHI ” at the top of
this Post; then in the side-bar, click on the Page
” భగవద్గీతా సూక్తుకు – 315 ( విద్యార్థులకు ).

OR, you may directly visit the blog ” kamthasthabharathi.wordpress.com “
( preferably through INTERNET EXPLORER ).