‘(1101) గ్రంథ సార భారతి’ అనే వర్గంలోని టపాలు

పోతన భాగవత సారం – 1వ స్కంధం

నవంబరు 27, 2008

ఈ బ్లాగును ప్రారంభించి ఒక సంవత్సరం నిండింది. తెలుగులో ప్రార్థనా పద్యాలలో అత్యంత ఉన్నత శ్రేణికి చెందినది – గజేంద్రమోక్షం లోని ” ఎవ్వనిచే జనించు ” అనే పద్యం. ఈ బ్లాగులోని ’ పోతన భాగవతం ” అనే పేజీలొ ఆ ఒక్క పద్యాన్నేప్రచురించాము. అన్ని పేజీలలోకీ ఈ పేజీకే వీక్షకులు ఎక్కువమంది వచ్చారు. గత ఏడాదిగా వీరంతా ఎంతో ఆశగా పేజీని తెరిచి చాలా నిరాశకు గురి అయి ఉంటారు. ఇది తలచుకుంటే అపరాధ భావన (guilty conscience ) కలుగుతోంది.

      దీనికి పరిహారంగా, పోతన భాగవథం – 1వ స్కంధం మొత్తం పరిశీలించి, పిల్లల నుంచీ పెద్దలదాకా ( భక్తి, జ్ఞాన మార్గాలలొ తీవ్ర సాధకులను మినహాయించి ) ఉపయోగ పడతాయని అనిపించిన పద్య, పద్యపాద, వచన సూక్తులను సేకరించాము. వాటిని మా విషయానుక్రమణిక ప్రకారం ఒక వరుసలో అమర్చాము.

స్కూలు విద్యార్థి స్థాయి వరకు తెలియ దగినవి ఈ ” కంఠస్థభారతి ” లో ఇస్తున్నాము. ఆ పై స్థాయి వ్యక్తులు ఆస్వాదించ దగినవి అనుబంధ బ్లాగు ” తెలుగుభారతి ” లో పొందు పర్చాము.

            పోతన పద్య మధుర మకరందాలను ఆస్వాదించండి; ముఖ్యంగా, ఇంకా మీ చేతిలోనే ఉన్న పిల్లలకు వాటిని రుచి చూపించండి!

  NOTE :

      (1) Please click on the title  KAMTHASTHA BHARATHI  at the top of this Post , to get a full view

of the side-bar. Then you may click on the page ” SRIMAD BHAGAVATAM ( Bammera Potana ) ” , to

get the text of Potana’s poems collected. You may also click on the required page-name in the side-

bar,  for any other related topics of interest to you.

      (2) Please click on the NAME ” TELUGU BHARATHI ” in the Blog – Roll in the side-bar of this

blog.   Then click on the page పోతన భాగవతం to view the second ( higher ) part.

       (3) OR, you may directly visit the website ” telugubharathi.wordpress.com “

అతి మధుర పద్యాలు

సెప్టెంబరు 11, 2008


మధురాధిపతే రఖిలం మధురం  !
“కృష్ణ శతకం” భక్తి రస మాధుర్యానికి పెట్టింది పేరు!
అతి చిన్న పిల్లలకు కూడ నోఱు తిరిగేటంతటి
పదలాలిత్యం!  ప్రతి పద్యమూ రస గుళికే.
 అయినా, నా జిహ్వకు అత్యంత మధురంగా
తోచిన కొన్నిటిని మాత్రం
మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
పాఠకలోకం యొక్క సమయ పరిమితులను
దృష్టిలోనుంచుకుని నవరత్నాలను మాత్రం
అందిస్తున్నాను.
పెద్దలు ఆస్వాదించటం మాత్రమే కాదు;
పిల్లలు, మనుమలు, మనుమరాళ్ళకు నేర్పి,
వారి చిట్టి పొట్టి ముద్దు పలుకులద్వారా వింటే,
మీకు బ్రహ్మానందమే !
ఆస్వాదింప జేయండి!
1
1 శ్రీ రుక్మిణీశ ! కేశవ !
నారద సంగీత లోల ! నగధర ! శౌరీ !
ద్వారక నిలయ ! జనార్దన !
కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా !
2
2 నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడునీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా !
3
3 ఓ కారుణ్య పయోనిధి !
నాకాధారంబ వగుచు నయముగ బ్రోవన్ |
నాకేల యితర చింతలు
నాకాధిప వినుత ! లోకనాయక కృష్ణా !
4
4 అగణిత వైభవ! కేశవ!
నగధర! వనమాలి! యాదినారాయణ! యో
భగవంతుడ! శ్రీమంతుడ!
జగదీశ్వర! శరణు శరణు శరణము కృష్ణా!
5
5 గజరాజవరద! కేశవ!
త్రిజగత్ కల్యాణమూర్తి! దేవ! మురారీ!
భుజగేంద్రశయన! మాధవ!
విజయాప్తుడ! నన్ను గావు వేగమె కృష్ణా!
6
6 గ్రహభయ దోషము లొందవు
బహు పీడలు చేర వెఱచు పాయును నఘముల్
ఇహపర ఫలదాయక! విను
తహతహ లెక్కడివి నిన్ను దలచిన కృష్ణా!
7
7 సర్వేశ్వర ! చక్రాయుధ !
శర్వాణీ వినుత నామ ! జగదభిరామా !
నిర్వాణనాథ ! మాధవ !
సర్వాత్మక ! నన్ను గావు సదయత కృష్ణా !
8
8 నారాయణ! పరమేశ్వర!
ధారాధర నీలదేహ! దానవ వైరీ!
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా! నను గావు కరుణ వెలయగ కృష్ణా!
9
9 దండమయా ! విశ్వంభర !
దండమయా ! పుండరీక దళనేత్ర హరీ !
దండమయా ! కరుణానిధి !
దండమయా ! నీకు నెపుడు దండము కృష్ణా !
***********************************
NOTE ;
సహచర బ్లాగర్లకు మనవి : మీ దృష్టికి వచ్చిన ఆణిముత్యాల లాంటి
 పద్యము ( పాదా ) లను , అవకాశం ఉంటే మీ వ్యాఖ్యతో సహా , మన
 అందరికీ అందించమని మనవి.
Please click on the title “kamthasthabharathi ” at the top
of this Postto get a full view of the side-bar. Then, pl. click
on the required page name to view similar essence
of standard works, useful for children and students, and
even for adults who had no exposure earlier.

భగవద్గీతా రత్నాలు

జనవరి 27, 2008

   భారతీయ సంస్కృతీ సారం భగవద్గీత!

ప్రతి భారతీయునికి కనీసం ఒక్క గీతా శ్లోకమైనా వచ్చి ఉండాలి. 700 శ్లోకాలలో నుంచి పిల్లలకు ఉపకరించే అతి ముఖ్యమైన శ్లోకాలు షుమారుగా 70 వరకు ఎంచి మీకు అందిస్తున్నాం. ఇవ్వవలసినవి ఇంకా ఎన్నో ఉన్నా, ఇచ్చినవన్నీ ఆణిముత్యాలే. చిన్నప్పుదు అభిరుచి, ఆదర భావం కలిగితే, పెద్దయ్యాక ఎప్పుడో ఒకప్పుడు మొత్తం గీతనే ఔపాసన పట్టకుండా వదలరు!

     ( ఈ పోష్టు పై భాగం లోని శీర్షిక “కంఠస్థ భారతి” మీద క్లిక్ చేస్తే, side-bar కనుపిస్తుంది. అందులో “భగవద్గీత” పేజి మీద క్లిక్ చేస్తే, పూర్తి పాఠం చూడవచ్చు.  అవకాశం ఉన్నవారు print-out  తీసుకుని, కాపీలను ఆసక్తి గల బంధుమిత్రులకు అందించటం కూడ సంస్కృతీ సేవయే!)

వేమన శతక రత్నములు

జనవరి 26, 2008
  • “నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు

        తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?

        చదువ పద్య మరయ జాలదా యొకటైన?

        విశ్వదాభిరామ  వినుర వేమ !” 

అన్నట్టి వేమనయే తట్టల కొలది పద్యరత్నాలను గ్రుమ్మరించాడు మన అదృష్టం కొద్దీ.  రండి! కొన్నింటినైనా ఏరుకుందాం!   

     ఈ పోష్టు పైన గల “కంఠస్థ భారతి” శీర్షిక మీద క్లిక్ చేస్తే side-bar వస్తుంది. మీకు కావలసిన పేజి లేదా blogroll లోని అనుబంధ బ్లాగును  ఎంచుకోండి.