| మధురాధిపతే రఖిలం మధురం ! | ||
| “కృష్ణ శతకం” భక్తి రస మాధుర్యానికి పెట్టింది పేరు! | ||
| అతి చిన్న పిల్లలకు కూడ నోఱు తిరిగేటంతటి | ||
| పదలాలిత్యం! ప్రతి పద్యమూ రస గుళికే. | ||
| అయినా, నా జిహ్వకు అత్యంత మధురంగా | ||
| తోచిన కొన్నిటిని మాత్రం | ||
| మీతో పంచుకోవాలనుకుంటున్నాను. | ||
| పాఠకలోకం యొక్క సమయ పరిమితులను | ||
| దృష్టిలోనుంచుకుని నవరత్నాలను మాత్రం | ||
| అందిస్తున్నాను. | ||
| పెద్దలు ఆస్వాదించటం మాత్రమే కాదు; | ||
| పిల్లలు, మనుమలు, మనుమరాళ్ళకు నేర్పి, | ||
| వారి చిట్టి పొట్టి ముద్దు పలుకులద్వారా వింటే, | ||
| మీకు బ్రహ్మానందమే ! | ||
| ఆస్వాదింప జేయండి! | ||
| 1 | ||
| 1 | శ్రీ రుక్మిణీశ ! కేశవ ! | |
| నారద సంగీత లోల ! నగధర ! శౌరీ ! | ||
| ద్వారక నిలయ ! జనార్దన ! | ||
| కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా ! | ||
| 2 | ||
| 2 | నీవే తల్లివి దండ్రివి | |
| నీవే నా తోడునీడ నీవే సఖుడౌ | ||
| నీవే గురుడవు దైవము | ||
| నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా ! | ||
| 3 | ||
| 3 | ఓ కారుణ్య పయోనిధి ! | |
| నాకాధారంబ వగుచు నయముగ బ్రోవన్ | | ||
| నాకేల యితర చింతలు | ||
| నాకాధిప వినుత ! లోకనాయక కృష్ణా ! | ||
| 4 | ||
| 4 | అగణిత వైభవ! కేశవ! | |
| నగధర! వనమాలి! యాదినారాయణ! యో | ||
| భగవంతుడ! శ్రీమంతుడ! | ||
| జగదీశ్వర! శరణు శరణు శరణము కృష్ణా! | ||
| 5 | ||
| 5 | గజరాజవరద! కేశవ! | |
| త్రిజగత్ కల్యాణమూర్తి! దేవ! మురారీ! | ||
| భుజగేంద్రశయన! మాధవ! | ||
| విజయాప్తుడ! నన్ను గావు వేగమె కృష్ణా! | ||
| 6 | ||
| 6 | గ్రహభయ దోషము లొందవు | |
| బహు పీడలు చేర వెఱచు పాయును నఘముల్ | ||
| ఇహపర ఫలదాయక! విను | ||
| తహతహ లెక్కడివి నిన్ను దలచిన కృష్ణా! | ||
| 7 | ||
| 7 | సర్వేశ్వర ! చక్రాయుధ ! | |
| శర్వాణీ వినుత నామ ! జగదభిరామా ! | ||
| నిర్వాణనాథ ! మాధవ ! | ||
| సర్వాత్మక ! నన్ను గావు సదయత కృష్ణా ! | ||
| 8 | ||
| 8 | నారాయణ! పరమేశ్వర! | |
| ధారాధర నీలదేహ! దానవ వైరీ! | ||
| క్షీరాబ్ధిశయన యదుకుల | ||
| వీరా! నను గావు కరుణ వెలయగ కృష్ణా! | ||
| 9 | ||
| 9 | దండమయా ! విశ్వంభర ! | |
| దండమయా ! పుండరీక దళనేత్ర హరీ ! | ||
| దండమయా ! కరుణానిధి ! | ||
| దండమయా ! నీకు నెపుడు దండము కృష్ణా ! | ||
| *********************************** | ||
| NOTE ; | ||
| సహచర బ్లాగర్లకు మనవి : మీ దృష్టికి వచ్చిన ఆణిముత్యాల లాంటి | ||
| పద్యము ( పాదా ) లను , అవకాశం ఉంటే మీ వ్యాఖ్యతో సహా , మన | ||
| అందరికీ అందించమని మనవి. | ||
| Please click on the title “kamthasthabharathi ” at the top | ||
| of this Postto get a full view of the side-bar. Then, pl. click | ||
| on the required page name to view similar essence | ||
| of standard works, useful for children and students, and | ||
| even for adults who had no exposure earlier. |
టాగులు: కంఠస్థం, కృష్ణ శతకం, చిన్న పిల్లలు, తెలుగు పద్యాలు, తెలుగు శతకాలు, మధుర పద్యాలు, hello parents