(1101C) సుమతీ శతక సారం (15+12 పద్యాలు)

శ్రీరామ

“సుమతీ శతకం ” చాలా సులభంగా వ్యవహార జ్ఞానాన్ని కలిగిస్తుంది.
పిల్లలకు అవసరమయ్యే ‘సకారాత్మక’(positive) నీతులను మాత్రం
ఈ క్రింద అందిస్తున్నాం.

* * * * *

609 మానవ సామాన్యం – లోకరీతి
******* ****************************
1 609
27
కమలములు నీటబాసిన

గమలాప్తునిరశ్మి సోకి కమలిన భంగిన్

దమ తమ నెలవులు దప్పిన

దమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ !

2 609
90
లావు గల వాని కంటెను

భావింపగ నీతిపరుడు బలవంతుండౌ

గ్రావంబంత గజంబును

మావటివా డెక్కినట్లు మహిలో సుమతీ!

705 దృక్పథం ( Attitude & Outlook )
******** **********************************
3 705
93
విన దగు నెవ్వరు చెప్పిన

వినినంతనె వేగ పడక వివరింప దగున్

గని కల్ల నిజము తెలిసిన

మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ!

4 705
66
పరనారీ సోదరుడై

పరధనముల కాస పడక, పరులకు హితుడై

పరులు దను బొగడ నెగడియు

బరు లలిగిన నలుగ నతడు పరముడు సుమతీ!

5 705
97
సరసము విరసము కొఱకే

పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే

పెరుగుట విరుగుట కొఱకే

ధర తగ్గుట హెచ్చు కొఱకె తథ్యము సుమతీ !

6 705
36
కులకాంతతోడ నెప్పుడు

గలహింపకు, వట్టితప్పు ఘటియింపకుమీ

కలకంఠి కంట కన్నీ

రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ!

706 సుగుణాలు (good qualities)
******** ***************************
7 706
47
తన కోపమె తన శత్రువు

తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ

దన సంతోషమె స్వర్గము

తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ!

8 706
45
చేతులకు దొడవు దానము

భూతల నాథులకు దొడవు బొంకమి భువిలో

నీతియ తొడవెవ్వారికి

నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!

9 706
15
ఉపకారికి నుపకారము

విపరీతము కాదు సేయ వివరింపంగా

నపకారికి నుపకారము

నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ !

801 మంచి అలవాట్లు (good habits ),
******** ********************************
10 801
17స.
ఎప్పటి కెయ్యది ప్రస్తుత

మప్పటికా మాటలాడి యన్యుల మనముల్

నొప్పింపక తానొవ్వక

“మెప్పించుచు మెలగువాడు ” మాన్యుడు సుమతీ !

(తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ !)

803 విధులు (dos ),
******** ***************
11 803
64
పతి కడకు దన్ను గూర్చిన

సతి కడకును వేల్పు కడకు సద్గురు కడకున్

సుతు కడకు రిత్త చేతుల

మతిమంతులు చనరు, నీతి మార్గము సుమతీ!

12 803
46
తడవోర్వక యొడలోర్వక

కడు వేగం బడిచి పడిన కార్యం బగునే

తడవోర్చిన నొడలోర్చిన

చెడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతీ!

13 803
6
అప్పిచ్చువాడు వైద్యుడు

నెప్పుడు నెడతెగక పాఱు నేఱును ద్విజుడున్

జొప్పడిన యూర నుండుము

చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ!

804 నిషేధాలు (donts),
******** ******************
14 804
61
నవ్వకుమీ సభ లోపల

నవ్వకుమీ తల్లి-దండ్రి-నాథుల తోడన్

నవ్వకుమీ పర సతితో

నవ్వకుమీ విప్రవరుల నయ మిది సుమతీ!

15 804
50
తనవారు లేని చోటను

జనవించుక లేనిచోట జగడము చోటన్

అనుమానమైన చోటను

మనుజునకున్ నిలువ దగదు మహిలో సుమతీ!

**** ***************************

609 మానవ సామాన్యం – లోకరీతి
******** *****************************
16 609
77
పుత్త్రోత్సాహము తండ్రికి

బుత్త్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా

పుత్త్రుని గనుగొని పొగడగ

బుత్త్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

17 609
98
సిరి దా వచ్చిన వచ్చును

సరసంబుగ నారికేళ సలిలము భంగిన్

సిరి దా బోయిన బోవును

కరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతీ!

18 609
43
చీమలు పెట్టిన పుట్టలు

పాముల కిరవైన యట్లు, పామరుడు తగన్

హేమంబు కూడబెట్టిన

భూమీశుల పాల జేరు భువిలో సుమతీ!

19 609
62
నీరే ప్రాణాధారము

నోరే రస భరితమైన నుడువుల కెల్లన్

నారియె నరులకు రత్నము

చీరయె శృంగార మండ్రు సిద్ధము సుమతీ!

20 609
37
కూరిమి గల దినములలో

నేరము లెన్నడును గలుగ నేరవు, మఱి యా

కూరిమి విరసంబైనను

నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!

705 దృక్పథం ( Attitude & Outlook )
******** **********************************

21 705
11
ఇమ్ముగ జదువని నోరును

నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్

తమ్ముల బిలువని నోరును

గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ !

22 705
12
ఉడుముండదె నూఱేండ్లును

బడియుండదె పేర్మి బాము పదినూఱేండ్లున్

మడువున గొక్కెర యుండదె

కడు నిల బురుషార్థపరుడు కావలె సుమతీ!

(మానవులు తమ జీవిత కాలంలో సాధించ వలసిన లక్ష్యములే -
నాలుగు పురుషార్థాలు : అవి “ధర్మ, అర్థ, కామ, మోక్షము”లు.
అర్థం(ధనం), కామం (కోరిక) అందరూ కోరుకుంటారు. కాని వాటి
సంపాదన, వినియోగం ధర్మబద్ధంగా ఉంటేనే, మనిషికి నిజమైన
ఉన్నతి, మంచి కీర్తి, మోక్షం సులభం. మనిషి “ఎంత నిలవ
చేశాడు” అనేదాని కంటే, ” ఎలా సంపాదించాడు,
” ఎలా వినియోగించాడు” అనేవే ప్రధానం.
ఇదే భారతీయ సంస్కృతి యొక్క విశిష్టత!)

23 705
79
పెట్టిన దినముల లోపల

నట్టడవుల కైన వచ్చు నానార్థములున్

పెట్టని దినముల గనకపు

గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ!

(దైవానుగ్రహం కోరుతూ, మానవ ప్రయత్నం సంపూర్ణంగా
చేయ వలసిందే ! అయినా తగినంతగా ఫలితం రాక పోతే,
అప్పుడు అనుకోవలసిన భావం “పురాకృత కర్మ ఫలం”-
చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ.
ఇదే “కర్మ సిద్ధాంతం”. ఇది భారతీయ సంస్కృతి
యొక్క విశిష్టతలలో ఒకటి.)

804 నిషేధాలు (donts),
******** ******************
24 804
74
పాలను గలిసిన జలమును

పాల విధంబుననె యుండు బరికింపంగా

బాల చవి జెఱచు గావున

బాలసు డగు వాని పొందు వలదుర సుమతీ!

25 804
57
నడువకుమీ తెరువొక్కట

గుడువకుమీ శత్రునింట గూరిమి తోడన్

ముడువకుమీ పరధనముల

నుడువకుమీ యొరులమనసు నొవ్వగ సుమతీ.

26 804
82
బలవంతుడ నాకేమని

పలువురతో నిగ్రహించి పలుకుట మేలా

బలవంతమైన సర్పము

చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!

27 804
63
పగ వల దెవ్వరి తోడను

వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్

దెగనాడ వలదు సభలను

మగువకు మనసియ్య వలదు* మహిలో సుమతీ!

(వివాహం అయ్యే వరకు, లేదా యోగ్య వధూ వర అన్వేషణ
ముగిసేవరకు, లేదా కనీసం విద్యార్థి దశ పూర్తి అయ్యే వరకు,
ప్రేమ వ్యవహారం పనికి రాదు – అని భావం గ్రహించాలి.
ఇది యువతీ యువకు లిద్దరికీ లాభకరం, క్షేమకరం.)

***** **********************************

ప్రత్యుత్తరమిమ్ము