(1311) కుమారీ శతక సారం
కుమారీ శతక సారం
***************
| (I)కుమారీ శతక సూక్తులు: |
| ***************************** |
| (13/1) బాలికలు: |
| ________________ |
| హితమాచరింప వలయును |
| *బ్రతుకున కొక వంక లేక పరగు కుమారీ. |
| నీ తలిదండ్రులకు నప |
| ఖ్యాతులు రానీయగూడ దమ్మ కుమారీ. |
| సత్సేవ యందు దిరిగిన |
| మాత్సర్య మణగు దెలిసి మనుము కుమారీ. |
| .. లేమి మెలగ నేర్చిన |
| వనితకు లోకమున వన్నె వచ్చు కుమారీ. |
| ఇరుగు పొరుగిండ్ల కైనను |
| తరుణి స్వతంత్రించి పోవ దగదు కుమారీ. |
| .. పెద్దలు రా, |
| నురవడి బీటలు మంచము |
| లరుగులు దిగుచుండ వలయు నమ్మ కుమారీ. |
| బంతులను బక్షపాత మొ |
| కింతైనను జేయరాదు |
| ఎంతటి యాకలి గలిగిన |
| బంతిన గూర్చుండి ముందు భక్షింపకు. |
| అధికారము లేని పనుల |
| కధికారము సేయబోకు. |
| (13/2) యువతులు: |
| ______________ |
| .. కోరిన రీతిన్ |
| ధవుని కొనగూర్ప వలయును.(deb) |
| .విను చెడ్డ యైన నెప్పుడు |
| *దన పతియే తనకు దైవతంబు కుమారీ. (deb) |
| ******************************************************** |
II. కుమారీ శతక సార పద్యములు :
(19/8)26.
పోకిళ్ళు పోక పొందిక
నాకులలో పిందె రీతి నడకువగా నెం
తో కలసి మెలసి యుండిన
లోకము లోపలను దా వెలుంగు గుమారీ!
(19/8)35.
బద్ధకము సంజ నిద్దుర
వద్దు సుమీ దద్దిరంబు వచ్చును దానన్
గద్దింతు రింటి వారలు
మొద్దందురు తోడివారు ముద్దు కుమారీ!
(19/8)39.
తల వాకిట నెల్లప్పుడు
నిలువగ రాదెప్పు డెంత నిద్దుర యైనన్
మెలకువ విడరాదు సుమీ
తల నడచుచు విప్పికొనుట తగదు కుమారీ!
(19/8)42.
నడకలలో నడుగుల చ
ప్పుడు వినబడకుండ వలయు భువి, గుంటలు క
న్పడరాదు మడమ నొక్కుల
బడతుల మర్యాద లెరిగి బ్రతుకు కుమారీ!
(19/8)43.
వారికి వీరికి గలిగెను
గోరిన వస్తువులు మాకు గొదువాయె నటం
చూరక గుటకలు మ్రింగుట
నేరముగా దలపవలయు నెలత కుమారీ!
(19/8)46.
పొంత పని సేయ కెన్నడు
పంతంబులు పలుక బోకు, ప్రాజ్ముఖముగ నీ
దంతంబులు దోమకు మే
కాంతంబులు బయలు పరుపకమ్మ కుమారీ!
(19/8)47.
వేళాకోళంబులు, గ
య్యాళితనంబులును, జగడ మాడుటలును, గం
గాళీపోకలు, గొండెము
లాలోచించుటయు గూడ వమ్మ కుమారీ!
(19/8)55.
సరకుల యెడ జాగ్రత్తయు
జురుకు పనుల యందు, భక్తి సుజనుల యందున్
గరుణ యనాథుల యెడలం
దరుణికి జెలువార వలయు ధరణి కుమారీ!
(19/8)58.
చెప్పకు చేసిన మేలు నొ
కప్పుడయిన గాని, దాని హర్షింపరుగా
గొప్పలు సెప్పిన నదియును
దప్పే యని చిత్తమందు దలపు కుమారీ!
(19/8)60.
చెడు గనిపించుకొనుటకున్
గడియైనను బట్టకుండు, గాంతలలో నె
క్కుడు గుణవతి యనిపించెడు
నడవడి నేర్చుటయె గొప్ప తనము కుమారీ!
(19/8)61.
తనకంటె బేదవాండ్రం
గని యంతకు దనకు మేలుగా యనవలయున్
దనకంటె భాగ్యవంతుల
గని గుటకలు మ్రింగ మేలు గాదు కుమారీ!
(19/8)63.
కోపముల నప్పుడాడ ని
రూపించిన మాట కొన్ని రోజులు చనినం
జూపట్ట దనుచు శాంతము
లోపల గొనవలయు ధర్మలోల కుమారీ!(&18)
(19/8)65.
విరుగబడి నడువ గూడదు
పరుల నడక లెన్ని, తప్పుబట్ట జనదు, ని
ష్ఠురములు వచింప గూడదు
కఱపగ వలె మేలు, మేలు గలదు కుమారీ!
(19/8)67.
సరకులు బట్టలు వన్నెల
కెరవులు తేదగదు, తెచ్చెనేని సరకుల
క్కర దీర్చుకొనిన వెంటనె
మరలింపక యున్న దప్పుమాట కుమారీ!
(19/8)69.
గొప్పదశ వచ్చె ననుచు నొ
కప్పుడయిన గర్వపడకు, మది తొలగినచో
జప్పట్లు జఱతు రందరు
దప్పని దండించు దండధరుడు కుమారీ!
(19/8)70.
గురుశుక్ర వారముల మం
దిర గేహళులందు లక్ష్మి తిరముగ నిలుచున్
గర గరిక నలికి మ్రుగ్గిడి
గురుభక్తి మెలంగ బాయు గొదువ కుమారీ!
(19/8)79.
పనిచేయు నపుడు దాసీ
వనిత విధంబునను మేను వంపగ వలయున్
ధనవంతుల సుత యైనను
ఘనత గలుగు దాని వలన గాదె కుమారీ!
(19/8)80.
శ్రమ యెంత సంభవించిన
క్షమ మరువగ రాదు, ధరణి చందంబున స
త్యమున బ్రవర్తించు యా
రమణియె లోకంబునందు రమణి కుమారీ!
(19/8)92.
తుడుపు దుమారమ్మును జెరు
గుడు ధూళియు, మేష రజము గూడదెపుడు మై
బడ నెఱిగి తిరుగ నేర్చిన
బడతుక మర్యాద లెఱిగి బ్రతుకు కుమారీ!
(19/8)94.
ఇద్దరు గూడుక యొకచో
నొద్దిక మాటాడుచుండ నొదిగి యొదిగి యా
యొద్దకు జన గూడదు తన
పెద్దతనం బెల్ల నణగ బెట్టు కుమారీ!
(19/8)95.
మఱువ వలె గీడు, నెన్నడు
మఱువంగా రాదు మేలు, మర్యాదలతో
దిరుగ వలె, సర్వజనములం
దరి బ్రేమ మెలంగ వలయు ధరణి కుమారీ!
(19/8)99.
సన్నెకలున్ బొత్రమ్మును
దన్నుకు పోరాదు, కాల దగిలిన యెడలన్
కన్నుల నద్దుకొన న్వలె
గ్రన్నన సిరి యందు నిలుచుగాన కుమారీ!
(19/9)87.
దృశ్య పదార్థము లెల్లను
నశ్యములని తలప కుండినను లోపంబౌ
దృశ్యంబున నస్థిరత న
వశ్యము చిత్తమున దలప వలదె కుమారీ!(
boys also)(19/17)71.
వాణియు శర్వాణియు హరి
రాణియు వాక్కునను మై నురంబున నుంటల్
రాణ దిలకించి మదిలో
బాణిగ్రాహి యెడ నిల్పు భక్తి కుమారీ!
(19/17)22.
ధనవంతుడైన యప్పుడు
పెనిమిటి చిత్తం బెరిగి పెండ్లాము మెలం
గును, లేమిన్ మెలగ నేర్చిన
వనితకు లోకమున వన్నె వచ్చు గుమారీ!
(19/17)76.
వడ్డించునపుడు తా గను
బిడ్డనికి దల్లి భంగి బ్రేమ దలిర్పన్
వడ్డింప వలయు భర్తకు
నెడ్డెతనము మానవలయు నెందు కుమారీ!
(19/18)20.
తన బావల పిల్లల యెడ
దన మఱదుల పిల్లలందు దన పిల్లల కం
టెను మక్కువ యుండ వలెన్
వనితల కటులైన వన్నె వచ్చు కుమారీ!
(19/18)25.
తలిదండ్రు లన్నదమ్ములు
తులదూగగ నిమ్ము పసిడితో నైనను, వా
రల యింట సతత ముండుట
వెలదికి మర్యాద గాదు వినవె కుమారీ!
(19/18)28.
పతి కత్తకు మామకు స
మ్మతిగాని ప్రయోజనంబు మానగ వలయున్
హిత మాచరింప వలయును
బ్రతుకున కొక వంక లేక బరగు కుమారీ!
(19/19)52.
విసుగకు పని తగిలిన యెడ
గసరకు సేవకుల మిగుల, గాంతుని తోడన్
రొసరొస పూనకు, మాడకు
మసత్య వచనంబు లెన్నడైన కుమారీ!
(19/19)68.
కలహపడు నింట నిలువదు
కలుముల జవరాలు గాన గలకాలంబే
కలహములు లేక సమ్మతి
మెలగంగా నేర్తువేని మేలు కుమారీ!
**************************