| |
|
(11) పురుషులు : |
|
|
|
| 237 |
|
ఆడువారి వంక నందరు చుట్టముల్ ! |
| 238 |
|
ఇంటి యాలు విడిచి యెట్లుండ వచ్చురా! |
| 239 |
|
గతులు సతుల వలన గానంగ లేరయా |
| 240 |
|
ఘనతర మోహంబు చేటు గదరా వేమా! |
|
|
|
|
|
(13) స్త్రీలు ) : |
|
|
|
|
|
(13/1) స్త్రీల విశిష్ట గుణాలు : |
| 241 |
|
గుణవతి యగు యువతి – గృహము చక్కగ నుండు |
| 242 |
|
స్త్రీలు గల్గు చోట చెల్లాటములు గల్గు |
| 243 |
|
స్త్రీలు లేని చోటు చిన్నబోవు |
| 244 |
|
స్త్రీల నడక వలన సిగ్గు బోయె. |
| 245 |
|
ఇక్కడ తగుగాక నక్కడ తగదిట్లు. |
| 246 |
|
ఇచ్చి పుచ్చుకున్న హితమైన మనుములు , - |
|
|
కాచి పూచి పండి కడు రమ్యమై యుండు! |
|
|
|
|
|
(13/2) శీల రక్షణ – భద్రత : |
| 247 |
|
అల్పనరుల కెల్ల నతివలపై మోజు! |
| 248 |
|
పల్లు దెరచి నగిన బట్టు పెన్భూతంబు! |
| 249 |
|
మగువ రూపు జూచి మనసు మరచు. |
| 250 |
|
అతను చేతి కత్తు లమరంగ కాంతలు! - |
|
|
( అతను = తనువు లేనివాడు, మన్మథుడు ) |
| 251 |
|
మంచి రుచుల గోరు మంచి స్త్రీలను గోరు, - |
|
|
మనుజు డెంత చెడ్డ మనసు జూడ |
|
|
|
|
|
(13/3) సతి – పతుల ప్రేమ బంధం : |
| 252 |
|
స్త్రీ నెరి రొమ్మున హరికిని |
| 253 |
|
స్త్రీ నెత్తిని రుద్రునకును (నెత్తి నెక్కిన గంగకు, – |
|
|
- అర్థాంగి గౌరి కున్న గౌరవం లేదు) |
| 254 |
|
పతి సతు లొకటైన పరమ పావన మందున్ |
| 255 |
|
పరమ సాధ్వి చూడ పరుల నంటదు సుమీ |
| 256 |
|
పతిని దిట్ట రాదు సతి రూపవతి యైన |
| 257 |
|
మనసు నిలక త్రాడు మరి వన్నె దెచ్చునో? (మాంగల్యం) |
| 258 |
|
ఆనుకూల్యము గల యంగన గలిగిన, - |
|
|
సతికి పతికి పరమ సౌఖ్య మమురు |
| 259 |
|
సతికి పతికినైన సంపద సంపదే? - |
|
|
పుత్త్ర సంపదలును భువిని మేలు |
| 260 |
|
పతి యొనర్చు మంచి సతికి సగము, |
|
|
పతి యొనర్చు చెడ్డ సతి కేల రాదురా? |
|
|
|
|
|
(13/4) గృహంలో (ఆర్థిక) శాంతి సౌఖ్యాలు : |
| 261 |
|
కలిమి లేమి రెండు గలవెంత వారికి |
| 262 |
|
నింటి లోని పోరు నింతింత గాదయా |
|
|
|
|
|
14.చతుర్విధ పురుషార్థాలు: ( ధర్మార్థకామమోక్షాలు ) |
|
|
|
|
|
(14/1) ధర్మం (మానవ సామాన్య ధర్మాలు) : |
|
|
|
| 263 |
|
తనువు లస్థిరములు ధర్మంబు నిత్యము |
| 264 |
|
చేయు ధర్మమెల్ల చెడని పదవి |
| 265 |
|
ధార్మికునకు గాని ధర్మంబు గనరాదు |
| 266 |
|
చిత్తశుద్ధి గల్గి చేసిన పుణ్యంబు, - |
|
|
కొంచె మైన నదియు కొదువ గాదు |
| 267 |
|
ఇరుగు పొరుగు వారి కెనయు సంపద జూచి, – |
|
|
తమకు లేదటన్న ధర్మమేమి? |
| 268 |
|
ధర్మమన్న తొల్లి దన్నుక చచ్చిరి, – |
|
|
కర్మఫలము నేడు గలిగె వేమ ! |
| 269 |
|
ఇహము నందు బాధ లెన్నైన బడవచ్చు, – |
|
|
పరము బాధ లేక బ్రతుకుడీ నరులార |
| 270 |
|
దానములను యన్నదానము దొడ్డది |
| 271 |
|
ఆకలన్న వారికన్నంబు బెట్టితె, - |
|
|
హరున కర్పితముగ నారగించు |
| 272 |
|
తట్టుబడక మదిని తన్నుకోక, - |
|
|
తన్ను గాదనుకొని తా బెట్టినది పెట్టు |
|
|
|
|
|
(14/2) ధర్మం (విశేష ధర్మాలు):(వర్ణాశ్రమ, కులవృత్త్యాది) : |
| 273 |
|
కులము హెచ్చు తగ్గు గొడవలు పనిలేదు, – |
|
|
సానుజాత మయ్యె సకల కులము |
|
|
|
|
|
(14/3) వర్ణ ధర్మములు - (ద్విజులు) : |
| 274 |
|
జ్ఞాన సత్యములును సమమైన ద్విజుడగు |
| 275 |
|
ద్విజుడ నేననగ నధిక మేమి తనవల్ల? |
| 276 |
|
మంచి గుణము లేక మరి ద్విజు డెట్లగు? |
| 277 |
|
మనసు నిల్పకున్న మరి ద్విజు డెట్లగు! |
|
|
|
|
|
(14/7) అర్థం (ధనం) : |
|
|
|
|
|
( 14/7- i ) ధనం – ప్రాధాన్యం : |
| 278 |
|
ధనమే మూలము జగతికి, – |
|
|
ధనమే మూలంబు సకల ధర్మంబులకున్ |
| 279 |
|
ధనము యెవరి సొమ్ము,ధర్మమే తన సొమ్ము |
| 280 |
|
భూమి నాది యన్న భూమి పక్కున నవ్వు, – |
|
|
దానహీను జూచి ధనము నవ్వు. |
| 281 |
|
రోగి కిడిన వాని రాగి బంగారౌను! |
| 282 |
|
ధనము లేమి యనెడు దావానలంబును, - |
|
|
తన్ను జెరుచును దరిదాపు జెరుచు |
| 283 |
|
కలిమి లేములు రెండు గల వెంతవారికి |
|
|
|
|
|
( 14/7 – ii ) ధనం – ఆర్జన : |
| 284 |
|
ధైర్య మొదవదేని ధనము లేదు |
| 285 |
|
కుడవకెల్ల ధనము కూడబెట్టు. |
| 286 |
|
ఋణము సేయు మనుజు డెక్కువ కెక్కునా ? |
| 287 |
|
పరుల మోసపుచ్చి పరధన మార్జించి, - |
|
|
కడుపు నింపుకొనుట కాని పద్దు |
| 288 |
|
యెన్నాళ్ళును దాను నేర్చి యెన్నిట వెలయున్? |
|
|
|
|
|
(14/7 – iii ) ధనం – వినియోగం : |
| 289 |
|
బహుళ ధనము గలిగి భద్ర మార్గంబున, - |
|
|
పరుల కుపకరించి ప్రబలు వేమ ! |
| 290 |
|
తాము నొకరి కిచ్చు ధన మింతియే కాక, - |
|
|
కడమది తమ కేల కలుగు వేమ ! |
| 291 |
|
ఇచ్చేవారల సంపద, హెచ్చేదే కాని లేమి యేలా కలుగున్? |
| 292 |
|
అదన భుక్తి చేత మొదటి సొమ్ముకు హాని. |
| 293 |
|
ధనము యెవ్వరి సొమ్ము దాచుకొనగ. |
| 294 |
|
వట్టి లేని పేదవాని కీదగు నీవి |
|
|
|
|
|
(14/7 – iv ) ధనం – నష్టాలు : |
| 295 |
|
కలిమి నాడు నరుడు కానడు మదమున |
| 296 |
|
ధన మెచ్చిన మద మెచ్చును. |
| 297 |
|
సంపద గల వాని సన్నిపాతక మిది. |
| 298 |
|
చెయ్యి సాచి కాసు నియ్య లేడు |
| 299 |
|
అర్థికీని సొమ్ము వ్యర్థ మౌను |
| 300 |
|
వ్యర్థమైన సొమ్ము వ్యర్థుల జేరురా |
| 301 |
|
ధనము లెచటి కేగు దా నేగు నెచటికి? |
| 302 |
|
కొంచ బోడు, వెంట గుల్ల కాసును రాదు |
| 303 |
|
తాము దినక నటుల ధర్మంబు సేయక, - |
|
|
సొమ్ము పరుల నంటు జూడు వేమ ! |
| 304 |
|
దానములను సేయ ధర చేతు లాడక, - |
|
|
తుదను దండుగ నిడి,మొదలు చెడు నరుడు ! |
| 305 |
|
కలిగి పెట్టలేని కర్మజీవుల కెల్ల, - |
|
|
తిరిపెమును దొరకదు దీనులార ! |
| 306 |
|
దీనులైన వారి దిగువాయిగా జూచి, - |
|
|
పరము గనక నూత బడును వేమ ! |
|
|
|
|
|
(14/7 – v ) ధనం - లోకరీతి : |
| 307 |
|
కలిమి గలిగెనేని కాముగా జూతురు |
| 308 |
|
కలిగిన మనుజుండు కాముడు సోముడు, - |
|
|
మిగుల తేజమునను మెరయుచుండు |
| 309 |
|
ఎంత సంపదొనరు నంత కష్టపు చింత, - |
|
|
చింత లేక నున్న చెడని సంపద జూడ ! |
| 310 |
|
సాగిపారని తరి సమకూడదొక్కటి, - |
|
|
ధనము యెంత యున్న ధరను వేమ ! |
| 311 |
|
సకల సంపదలును సతము లనుచు |
| 312 |
|
ధనము జూచినపుడె తగులు మనసు. |
| 313 |
|
ధనము లేమి ఘనత దప్పు వేమ! |
| 314 |
|
లేని కాలమునకు లేని మనము నొందు. |
|
|
|
|
|
(14/7 – vi ) ధనం Vs. విద్య : |
| 315 |
|
ఎందరికి నొసంగ నెప్పటి యట్లుండు |
|
|
|
|
|
(14/9) మోక్షం : |
| 316 |
|
ఎన్ని తనువు లైన మృతికి యడ్డము గావు, - |
|
|
మృతిని గెలువ లేని యెరుక లేల ? |
| 317 |
|
నిశ్చలాత్మ యెన్న నిర్వికారంబున, - |
|
|
నుండెనేని ముక్తి యండ్రు వేమ |
|
|
|
|
|
(17) మతము : |
|
|
|
| 318 |
|
తమకు భేదమయిన తత్త్వంబు భేదమా ! |
| 319 |
|
మతము లెన్ని యైన సతముగా నుండవు |
| 320 |
|
సతముగాను యుండు జగతి నొకటి |
| 321 |
|
షణ్మతముల జిక్కి చావ నేల? |
| 322 |
|
శైవ వైష్ణవాది షణ్మతంబుల కెల్ల, - |
|
|
దేవుడొక్కడనుచు దెలియ లేరు |
| 323 |
|
ఎన్ని మతము లైన నే మంత్ర మైనను, - |
|
|
సత్య మింత లేక జాడ నిడడు |
| 324 |
|
మొదల తన మతము వదలక, - |
|
|
తుద నెవ్వరి మతమునైన దూషింపకయున్ |
| 325 |
|
భక్త వర్గమునకు భవు జూప నేరక, - |
|
|
కాని మతములోన గలుప రాదు. |
|
|
|
|
|
28/1 కర్మ యోగం : |
| 326 |
|
వ్రాత వెంట గాని వరమీడు దైవంబు – |
|
|
సేత కొలది గాని వ్రాత గాదు |
| 327 |
|
వ్రాత కజుడు కర్త సేతకు దా కర్త ! |
| 328 |
|
యేమి లేని నరున కేగతి లేదుర |
|
|
|
|
|
28/2. ధ్యానయోగం : |
|
|
|
|
|
(28/2 – i ) ధ్యానయోగం – ప్రయోజనం : |
| 329 |
|
పరము కొరకు యోగి పాటించు దేహంబు! |
|
|
|
|
|
(28/2 – ii ) : ధ్యానయోగం – విధి విధానం : |
| 330 |
|
యోగి గాడు లోన బాగు గాకుండిన |
|
|
|
|
|
(28/2 – iii ) ధ్యానయోగం – భావనలు : |
| 331 |
|
అమలమైన పలుకు లభిషేక వారిధి |
| 332 |
|
గాలి లేని దీప కళిక చందంబున |
| 333 |
|
కడగి గాలి లేని గగనంబు భంగిని, - |
|
|
బలు తరగలు లేని జలధి మాడ్కి |
|
|
|
|
|
(28/3) భక్తి యోగం : |
|
|
|
|
|
(28/3 – i ) భక్తి యోగం – ప్రాశస్త్యం : |
| 334 |
|
దేవ పూజ సేయ దివ్య భోగము గల్గు |
|
|
|
|
|
(28/3 – ii )భగవంతుడు నిర్గుణం: |
| 335 |
|
విశ్వమును నడిపెడి విశ్వేశ్వరుండు. |
| 336 |
|
తెలియ విశ్వ మెల్ల దేవాది దేవుడౌ ! |
| 337 |
|
దేవుడొక్కడనుచు దెలియ లేరు |
| 338 |
|
లేడు లేడన్నను లేక పోడు |
| 339 |
|
దర్శనంబు వేఱు, దైవంబు యొక్కటి! |
| 340 |
|
మరియు దధిని ఘృతము, మానులం దనలంబు |
| 341 |
|
చారు సుమము లందు సౌరభంబు |
| 342 |
|
తిలల తైలమట్ల దేజరిల్లు జిదాత్మ |
|
|
|
|
|
(28/3 – iii ) భగవంతుడు – సగుణం : |
| 343 |
|
సర్వ సురల కన్న సర్వేశ్వరుడు మేలు! |
| 344 |
|
తోడు తోడనినను తోడనె తోడౌను |
| 345 |
|
శివుడు భర్త కర్త చింతింప నేలరా? |
| 346 |
|
పటము గోడలందు ప్రతిమలందు, - |
|
|
తన్ను దెలుసుకొరకు తగలదా పరమాత్మ ! |
| 347 |
|
మంట లోహమందు మాకుల శిలలందు, - |
|
|
తన్ను దెలుసుకొరకు తగలదా పరమాత్మ ! |
|
|
|
|
|
(28/3 – iv ) భక్తి భావనలు – నిర్గుణం : |
| 348 |
|
కడక నఖిలమునకు నడి నాళ మందున్న, - |
|
|
వేగు చుక్క వంటి వెలుగు దిక్కు |
| 349 |
|
అందు గలుగు దేవు డిందు లేడె, - |
|
|
యిందు నందు గలడు హృదయంబు లెస్సైన ! |
|
|
|
|
|
(28/3 – v ) భక్తి భావనలు – సగుణం : |
| 350 |
|
హరుని యెరుక లేక యాకు నల్లాడునా! |
| 351 |
|
తామెందులోన దిరిగిన, - |
|
|
దేవుడు తోడగుచు వచ్చు వెంటనె వేమా! |
|
|
|
|
|
(28/3 – vi ) భక్తి విధానం – నిర్గుణం: |
|
|
|
|
|
(28/3 – vii ) భక్తి విధానం – సగుణం: |
| 352 |
|
పూజ సేయువాడు పుణ్యమూర్తి! |
| 353 |
|
భక్తి లేని పూజ ఫలము లేదు ( భక్తి యనగా-భగవంతుని- |
|
|
నామ, రూప, గుణముల యందు నిష్కామ పరమ ప్రేమ!) |
|
|
|
|
|
(28/3 – viii ) ప్రార్థనలు : |
|
|
|
|
|
(28/3 – ix ) భక్తులు – లోకరీతి : |
| 354 |
|
ప్రణవ మెరుగనోడు భక్తు డెప్పుడు గాడు |
| 355 |
|
తన్ను దిప్పు వాని తానేల కానడో ? |
|
|
|
|
|
(28/4) జ్నాన యోగం : |
|
|
|
|
|
i. విశిష్టత : |
| 356 |
|
లోను జూడ జూడ లోకాభిరామంబు |
|
|
|
|
|
ii. పరమాత్మ - (పరబ్రహ్మ), (బ్రహ్మం) : |
| 357 |
|
ఆరు రుచులు వేరు, సారంబు యొక్కటి, - |
|
|
సత్య నిష్ఠ వేరు, సత్య మొకటి. |
| 358 |
|
ఘటము లెన్ని యైన గగనంబు యేకమే |
| 359 |
|
పరమ ఋషులు వేరు, భావ్యుండు యొక్కడు |
| 360 |
|
బ్రహ్మ మన్నిటందు పరిపూర్ణమై యుండు. |
| 361 |
|
అఖిల జనుల కెల్ల నానందమే సాక్షి ! |
|
|
|
|
|
iii. జీవాత్మ |
| 362 |
|
స్థిరము నస్థిరమును దెలియ జీవికి ముక్తి |
| 363 |
|
చూచు కనులు వేరు చూపు వేరు! |
| 364 |
|
తత్త్వ మెరిగెనేని దైవ సముడె |
| 365 |
|
గుడి దేహ మాత్మ దేవుడు! |
|
|
|
|
|
iv. జగత్తు : |
| 366 |
|
నీవు నిలిచి యుండు, నిఖిలంబు నిలువదు |
| 367 |
|
సుఖము లంతమందు చూడంగ దుఃఖంబు, - |
|
|
సుఖములును కష్ట పూర్వకములు |
|
|
|
|
|
v. ఈశ్వరుడు : |
| 368 |
|
సకలాకారు డనంతుడు, - |
|
|
సకలాత్మల యందు సర్వ సాక్షియు దానై |
|
|
|
|
|
vi. మాయ : |
| 369 |
|
నీవు నిశ్చయంబు నిఖిలంబు మాయయు |
|
|
|
|
|
vii. మోక్షం |
| 370 |
|
దుఃఖస్పర్శ లేని సుఖమన్న మోక్షమే ! |
| 371 |
|
యేకత్వంబని యెరిగిన, - |
|
|
శోకములే కల్ల! ముక్తి సులభము వేమా ! |
|
|
|
|
|
viii. కైవల్యం ( సాయుజ్యం – జీవ బ్రహ్మైక్యం ) : |
| 372 |
|
జీవు నరసి చూడ శివుడు గాడె! |
|
|
|
|
|
ix. లోకరీతి : |
|
|
|
|
|
(28/5) జ్నాన సాధన : |
|
|
|
|
|
i. సాధన చతుష్టయము : |
| 373 |
|
ఆత్మశుద్ధి లేక నంటునా మోక్షంబు ! |
| 374 |
|
ఆశ కన్న దుఃఖ మతిశయంబుగ లేదు |
| 375 |
|
ఆశ విడక కాని పాశ ముక్తుడు గాడు |
|
|
|
|
|
ii. మనో సాధన : |
| 376 |
|
మనసు నిలుపకున్న మరి ముక్తి లేదయా |
| 377 |
|
హృదయ మందు నున్న యీశుని దెలియరో ! |
|
|
|
|
|
iii. వేదాంత భావన : |
| 378 |
|
వెదుక వెదుక దొరుకు వేదాంత వేద్యుండు |
|
|
|
|
|
iv. అంతర్దృష్టి : |
| 379 |
|
తెలివి యనెడు గొప్ప దీపంబు చేపట్టి , - |
|
|
ముక్తి జూడవచ్చు మొనసి వేమా |
|
|
|
|
|
v. సర్వాత్మత్వ భావన : |
| 380 |
|
నిఖిలాత్ముడు సర్వసాక్షి నిజముగ తానై |
| 381 |
|
సకలాత్మల యందు సర్వ సాక్షియు దానై. |
| 382 |
|
నిర్మలునకు గలుగు ముక్తి నిజముగ వేమా! |
|
|
( అద్వితీయత్వమే నిర్మలత్వం ) |
| |
|
|