| |
|
|
| |
|
2.నా మేలు కోరే వారు:(ఆత్మీయులు): |
|
|
(1) తల్లిదండ్రులు,(2)కుటుంబ సభ్యులు, (3)గురువులు, (4)పెద్దలు: (5)సజ్జనులు, |
|
|
(6) మంచి స్నేహితులు . |
|
|
|
|
|
2.1 తల్లిదండ్రులు : |
| 1 |
|
తల్లి గౌరి తనకు తండ్రియే శంభుండు |
| 2 |
|
తల్లిదండ్రు లెన్న తన మొదలి గురులు |
|
|
|
|
|
2.3 గురువులు : |
| 3 |
|
గురువు లేక విద్య గురుతుగా దొరకదు |
| 4 |
|
గురువు లందు జూడ భయభక్తు లమరిన |
| 5 |
|
మంచి చెడ్డ జెప్పు గురువులె గురువులు. |
| 6 |
|
పార్వతీ భవులును పరమ గురులు! |
| 7 |
|
సద్గురువే దైవమనుచు జాటర వేమా. |
| 8 |
|
అఖిలమునకు గురువు యాధారమై యుండు. |
|
|
|
|
|
2.4 పెద్దలు: |
| 9 |
|
బుద్ధి జెప్పువాడు గుద్దిన నేమయా? |
| 10 |
|
పెద్ద ‘లుసురు’ మంటె పెను మంట లెగయవా |
| 11 |
|
దగ్ధు లైన వారు తమకంటె తక్కువా |
|
|
|
|
|
2.5 సజ్జనులు : |
| 12 |
|
సాధు సజ్జనముల సాంగత్యముల చేత, - |
|
|
మూఢ జనుడు బుద్ధి – మంతు డగును. |
|
|
|
|
|
2.6 స్నేహితులు : |
| 13 |
|
కానివాని తోటి కలసి వర్తించెనా, - |
|
|
హాని వచ్చు నెంతవాని కైన |
|
|
|
|
|
3. ముందుగా నేర్చుకోవలసినవి: |
|
|
(1) ప్రార్థన, (2) ఆటపాటలు 3) దినచర్య, - |
|
|
(4) భాష: మాతృ భాష (తెలుగు), సంస్కృతం,- |
|
|
హిందీ, ఇంగ్లిష్ : (5) విద్య , (6) పాఠశాల . |
|
|
|
|
|
3.4 భాష : |
| 14 |
|
భాష లింతె వేరు పరతత్త్వ మొక్కటి . |
|
|
|
|
|
3.5విద్య : |
| 15 |
|
విద్యలేమి ఘనత దప్పు వేమ! |
| 16 |
|
యెరుక లేక దిరుగ నేమి గలదు? |
| 17 |
|
తెలియ లేని వాని తెలివదేమి? |
| 18 |
|
తెలిసిన మనుజునకు దివ్యామృతంబురా |
| 19 |
|
చదువ పద్య మరయ జాలదా యొకటైన |
| 20 |
|
ఎందరికి నొసంగ వృద్ధి జెందుచునుండు ! |
|
|
|
|
|
4. శరీర పోషణకు అతి ముఖ్యమైనవి : |
|
|
(1) ఆరోగ్యం , (2) ఆహారం , (3) విహారం, - |
|
|
(4)వ్యాయామం, (5)విశ్రాంతి, (6)వైద్యం. |
|
|
|
|
|
4.1 ఆరోగ్యం : |
| 21 |
|
వంటు దప్పునపుడు వంటకము విషంబు - |
|
|
( వంటు = ఆరోగ్యం ) |
|
|
|
|
|
4.2ఆహారం : |
| 22 |
|
అన్నరసమ యొడలి కతి మదంబగు సుమీ ! |
| 23 |
|
చంప నొంప బువ్వ చాలదా వెయ్యేల? |
|
|
|
|
|
5. త్రికరణములు మనకి ఉన్న 3 సాధనాలు): |
|
|
(1) దేహం, (2) వాక్కు, (3) మనస్సు.- ‘చిత్తశుద్ధి”- |
|
|
(4), ” త్రికరణ శుద్ధి ” గలవారు మహాత్ములు ! |
|
|
|
|
|
5.1దేహం : |
| 24 |
|
దేహము లెస్సగ నుండిన , - |
|
|
పోహణ తత్త్వంబు లన్ని పొందుగ దెలుసున్. |
|
|
|
|
|
5.2వాక్కు : |
| 25 |
|
సజ్జనుండు బలుకు చల్ల గాను |
|
|
|
|
|
5.3 మనస్సు. : |
| 26 |
|
ఒక్క మనసు తోడ నున్నది సకలంబు , - |
|
|
తిక్కబట్టి నరుడు తెలియ లేడు |
| 27 |
|
మాట కన్న నెంచ మనసు దృఢము |
| 28 |
|
మనసు నిలుపు వాడు మంచివాడు. |
| 29 |
|
చింత చేత మిగుల చివుకు మేను |
| 30 |
|
మోహ పడును బుద్ధి మోసపోయి. |
| 31 |
|
తన మది కపటము విడచిన, - |
|
|
తన కెవ్వడు కపటి లేడు ధరలో వేమా ! |
|
|
|
|
|
6. లోకరీతి – అవగాహన : |
|
|
(1) ప్రకృతి, (2) వస్తుజాలం, (3) జీవజాలం, (4) మంచివారు |
|
|
(5) చెడ్డవారు, (6) మూర్ఖులు, (7) రాజనీతి (8) ప్రజలు |
|
|
(9) మానవ సామాన్యం. |
|
|
|
|
|
6/1. లోకరీతి – ప్రకృతి : |
| 32 |
|
తివురు భాను జూచి తిమిరంబు నిలుచునా? |
| 33 |
|
భానుడుండ దివ్వె బట్టి వెదుకు రీతి ! |
| 34 |
|
చెలగు దివ్వె లేక చీకటి వాయునా? |
| 35 |
|
నీరు పల్ల మెరుగు నిజము గాను. 6/1 |
| 36 |
|
యేటి వంక దీర్ప నెవ్వరి తరమయా! |
| 37 |
|
నీరు జొరక లోతు నిజముగా దెలియదు |
| 38 |
|
గంగ పారుచుండు కదలని గతి తోడ, - |
|
|
ముఱికి కాల్వ పారు మ్రోత తోడ. |
| 39 |
|
తరువ తరువ బుట్టు తరువున ననలంబు |
| 40 |
|
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత? |
| 41 |
|
చెట్టు ముదరనిచ్చి చిదిమిన బోవునా - |
|
|
వెనుక వంతు ననుట వెర్రి తనము ! |
| 42 |
|
హరుని యెరుక లేక యాకు నల్లాడునా |
| 43 |
|
పుష్పమందు తావి పొసగి నట్లగు విద్య! |
| 44 |
|
పచ్చి కాయ దెచ్చి పడవేయ ఫలమౌనె? |
| 45 |
|
యెగర వేయు పండు యెందాక నిల్చురా |
| 46 |
|
పంట చేను విడిచి పరిగె యేరిన యట్లు! |
| 47 |
|
పరగ మూలికలకు పనికివచ్చు |
|
|
|
|
|
(6/2) లోకరీతి – వస్తుజాలం : |
| 48 |
|
పాల గలయు నీరు పాలెయై రాజిల్లు |
| 49 |
|
తరువ తరువ బుట్టు దధిని ఘృతము! |
| 50 |
|
వెన్న బట్టి నెయ్యి వెదికిన చందంబు. |
| 51 |
|
కొండ యద్దమందు కొంచెమై యుండదా ? |
| 52 |
|
ఉసురు లేని తిత్తి యిసుమంత వూదిన, – |
|
|
పంచ లోహములును భస్మమౌను. |
| 53 |
|
పెద్ద లుసురుమంటె పెనుమంట లెగయవా ? |
| 54 |
|
నీళ్ళమీద జూడు నెరయ నోడల పర్వు |
| 55 |
|
నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు, - |
|
|
తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల? |
| 56 |
|
కరగ కరగ బుట్టు కనకంబునకు వన్నె |
| 57 |
|
కంచు మోగు నట్లు కనకంబు మోగునా |
| 58 |
|
కొయ్య దుంగ దెచ్చి చెక్కితే గుణి యవదె ? |
| 59 |
|
కప్పురంబు జ్యోతి గలసి నట్లగు ముక్తి ! |
|
|
|
|
|
(6/3) లోకరీతి – జీవజాలం : |
| 60 |
|
తేనె తెరల జాడ తేనెటీగ యెరుంగు |
| 61 |
|
సుమ రసంబు జాడ భ్రమర మెరుగు |
| 62 |
|
పుష్పజాతి వేఱు, పూజ యొకటి |
| 63 |
|
పసుల వన్నె వేఱు, పాలేక వర్ణమౌ |
| 64 |
|
గంగి గోవు పాలు గంటెడైనను చాలు, - |
|
|
కడివెడైన నేమి ఖరము పాలు. |
| 65 |
|
పాల నీరు క్రమము పరమ హంస యెరుంగు. |
| 66 |
|
పుట్ట మీద గొట్ట భుజగంబు చచ్చునా ? |
| 67 |
|
తెలిసి త్రాడటన్న తీరు భయము. |
| 68 |
|
పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా ? |
| 69 |
|
పులిని జూచి నక్క పూత బూసిన యట్లు ! |
| 70 |
|
యెనుము గొప్పదైన యేనుగు బోలునా ? |
| 71 |
|
యేనుగు పడియున్న నెత్తునా మశకంబు? |
| 72 |
|
కొండముచ్చునకును కోతియు విందౌను! |
| 73 |
|
వనము లోని కోతి వసుమతి నడుపునా! |
| 74 |
|
కొలకు లింకెనేని కొంగ లందుండునా? |
| 75 |
|
పరిమళముల గర్దభము మోయంగ ఘనమౌనె? |
| 76 |
|
పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా! |
| 77 |
|
కంచము కడ పిల్లి గాచినట్లు. |
| 78 |
|
కుక్క యిల్లు జొచ్చి కుండలు వెదకదా? |
| 79 |
|
మృగము తోడ కుక్క మొరగిన సామ్యమౌ. |
| 80 |
|
కుంటి కుక్క కేల కుందేటి పరుగులు? |
| 81 |
|
కుక్క తోక గట్ట చక్కగా వచ్చునా ? |
|
|
|
|
|
(6/4) లోకరీతి – మంచివారు : |
| 82 |
|
ఉత్తమోత్తముండు తత్త్వజ్ఞు డిలలోన |
| 83 |
|
పురుషులందు పుణ్యపురుషులు వేరయా |
| 84 |
|
అందరొకట గలియ నన్నదమ్ములె గదా! |
| 85 |
|
సాధు సజ్జనులను సంతరించిన వాడు, - |
|
|
ప్రజల సంతసంబు పరచువాడు |
| 86 |
|
గుణ యుతునకు మేలు గోరంత జేసిన, - |
|
|
కొండ యౌను వాని గుణము చేత |
|
|
|
|
|
(6/5) లోకరీతి – చెడ్డవారు : |
| 87 |
|
కొండకొద్ది మేలు గుణహీను డెరుగునా |
| 88 |
|
నీతి హీను నొద్ద నిర్భాగ్యు లుందురు |
| 89 |
|
వేషధారి యుదర పోషకు డధముండు. |
| 90 |
|
కుత్సితుండు చేరి గుణవంతు జెరుచురా |
| 91 |
|
పొట్టు దినెడి వనిత బువ్వలు బెట్టునా ! |
| 92 |
|
లోభివాని నడుగ లాభంబు లేదయా |
| 93 |
|
దాత లేని యూరు దయ్యాల పేటిరా! |
| 94 |
|
ఒప్పు దుర్జనములు తప్పుగ నెంతురు. |
| 95 |
|
ఒకరి నోరు గొట్టి యొకరు భక్షింతురు, |
| 96 |
|
హీను డవగుణంబు మానలేడు. |
| 97 |
|
కూళ గూళ మెచ్చు గుణవంతు విడనాడి |
| 98 |
|
దోషకారి కెట్లు దొరకురా యా కాశి ! |
|
|
|
|
|
(6/6) లోకరీతి – మూర్ఖులు, అమాయకులు: |
| 99 |
|
మూర్ఖు డేమెరుంగు మోక్షంపు త్రోవను. |
| 100 |
|
పాపపుణ్యములను పసి పాపెరుంగునా ! |
| 101 |
|
లోకులెల్ల వెర్రి పోకిళ్ళ బోదురు! |
| 102 |
|
నరుడు బడెడు పాట్లు నగుబాట్లు చూడగా. |
| 103 |
|
గొర్రె జంక బెట్టి గొల్ల వెదకు రీతి. |
| 104 |
|
కడుపు నిండ నింత కష్టంబు లేలరా! |
| 105 |
|
తను దా దెలియక నుండిన , - |
|
|
దన కెవరున్ దెలుప లేరు తథ్యము వేమా! |
|
|
|
|
|
(6/7) లోకరీతి – రాజనీతి ; |
| 106 |
|
దాన ధర్మములును దయయు సత్యము నీతి, – |
|
|
రాజు పాలిటి కివి రాజయోగంబులు . |
| 107 |
|
యడ్డమైన జనుల నంటగట్టి, - |
|
|
దోచుకున్న నట్టి దోష మెక్కడ బోవు? |
| 108 |
|
వారి యుసురు దాకి వగ చెడి పోవరా? |
|
|
|
|
|
(6/8) ప్రజా ధర్మం : |
| 109 |
|
నీచుల వినుతులు సేయుచు, - |
|
|
యాచకమున దిరిగి తిరిగి యలసుట కంటెన్ |
| 110 |
|
యెట్టి వారు మెత్తు రట్టి వారి! |
| 111 |
|
దండసాధ్యు లైరి ధర్మసాధ్యులు గాక |
| 112 |
|
తమకు భేదమయిన తత్త్వంబు భేదమా ! |
| 113 |
|
ప్రభున కిచ్చినట్లు పెద్దల కియ్యరు! |
| 114 |
|
కలిమి లేమి రెండు గల వెంత వారికి! |
| 115 |
|
తాటి క్రింద పాలు తాగిన చందమౌ |
| 116 |
|
చెలగి మధువు గ్రోల చేదు రుచించునా? |
| 117 |
|
పేదవాని యింట పెండ్లైన నెరుగరు |
| 118 |
|
చేటు కాలమునకు చెడు బుద్ధి పుట్టును! |
| 119 |
|
తెలివి విడిచి భూమి దిరుగంగ నేటికి? |
| 120 |
|
కుక్కతోక బట్టి గోదావరీదునా? |
|
|
|
|
|
(6/9) లోకరీతి – మానవ సామాన్యం : |
|
|
|
|
|
6.9/1 తత్త్వం : |
| 121 |
|
ఉత్తమోత్తముండు తత్త్వజ్ఞు డిలలోన |
| 122 |
|
మహిమ జూపు వాడు మధ్యముండు |
| 123 |
|
వేషధారి యుదర పోషకు డధముండు |
| 124 |
|
దీపంబు లేని యింటను, - |
|
|
రూపంబుల దెలియ లేరు రూఢిగ తమలో |
| 125 |
|
దీపమగు తెలివి గలిగియు, - |
|
|
పాపంబుల మరుగు త్రోవ బడుదురు వేమా! |
| 126 |
|
వెన్న చేత బట్టి వివరంబు దెలియక, - |
|
|
ఘృతము గోరునట్టి యతని భంగి |
|
|
|
|
|
6.9/2 ధర్మం : |
| 127 |
|
పరగ ముందరి తమ బ్రతుకు తెర్వెరుగక |
|
|
|
|
|
6.9/3 మనస్సు : |
| 128 |
|
అల్ప సుఖము లెల్ల నాశించి మనుజుండు, - |
|
|
బహుళ దుఃఖములను బాధ పడును 24′ |
| 129 |
|
కడుపు నిండ సుధను గ్రమముతో ద్రావిన, - |
|
|
పాల మీద నేల పారు మనసు? |
| 130 |
|
పంట చేను విడిచి పఱిగె యేరిన యట్లు! 24′ |
| 131 |
|
దగ్ధులైన వారు తమకంటె తక్కువా? |
| 132 |
|
ఆరు రుచులు వేరు సారంబు యొక్కటి, - |
|
|
పుష్పజాతి వేరు, పూజ యొకటి! |
| 133 |
|
తిక్క బట్టి నరుడు తిరుగు చుండు |
|
|
|
|
|
6.9/4 వాక్కు: |
| 134 |
|
పదుగు రాడు మాట పాటియై ధర జెల్లు. |
|
|
|
|
|
6.9/5 దేహం : |
| 135 |
|
యేమి పాట్లు పడుదు రీ దేహమున కిల 24′. |
|
|
|
|
|
6.9/6 వ్యక్తిగతం : |
| 136 |
|
సత్యమాడు వాని సామి యెరుగు |
| 137 |
|
కంటిలోని పాప కన నెంత వాడురా ! |
| 138 |
|
తెలుప వచ్చు, దన్ను దెలియ రాదు |
| 139 |
|
ఆలి వంక వార లాత్మ బంధువు లైరి. |
|
|
|
|
|
6.9/7 సామాజికం : |
| 140 |
|
యెట్టి వారు మెత్తు రట్టి వారి! |
| 141 |
|
లోకులెల్ల వెర్రి పోకిళ్ళ బోదురు! |
| 142 |
|
వ్యాధి దెలియలేని వైద్యుడు మరి యేల? |
| 143 |
|
తాటి క్రింద పాలు తాగిన చందమౌ |
|
|
|
|
|
6.9/8 అర్థం ( ధనం ) : |
| 144 |
|
సురకు నిచ్చినట్ల సుమతుల కియ్యరు |
| 145 |
|
వ్యర్థమైన సొమ్ము వ్యర్థుల జేరురా |
| 146 |
|
పేద పేద గూడి పెనగొని యుండును (=పరస్పర సహకారం) |