(1101B1) వేమన శతక సారం – 1 (1-58)
శ్రీరామ
“సమన్వయ భారతి” వారి
వేమన సార పద్య శతకం : 1 (1 – 58)
*************************************
(పిల్లలకు అవశ్యం కంఠస్థయోగ్యం)
(సూచన: పద్య సంఖ్యలు సి.పి.బ్రౌన్ 1839 సంకలనము లోనివి)
మొత్తం 1,166 వేమన పద్యాల నుండి పిల్లల కంఠస్థ యోగ్యతను
దృష్టిలో నుంచుకుని ఎంపిక చేసినవి 116 పద్యరత్నాలు.
వీటిని 58 పద్యాల చొప్పున రెండు భాగాలుగా విభజించి ఈ బ్లాగులో శ్రీరామ
అందిస్తున్నాము. వీటితో మొత్తం భారతీయ సంస్కృతికి సంబంధించిన
స్థూల అవగాహన కలుగుతుంది! తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గూడ
తప్పక ఒకసారైనా చదువ దగినవి. ఈ పద్యాలను తమ
పిల్లలకు, విద్యార్థులకు కంఠస్థం చేయిస్తే, వారికి సాంస్కృతిక
వారసత్వం అందించినట్లే! ఇంకా యేం ?
ఈ పద్య రత్నాలహారం మీ పిల్లల కంఠాలలో అలంకరించండి !
( కంఠస్థం చేయలేక పోయినా, భావం గ్రహించ దగిన
ఇంకొక 121 పద్యాలను రెండవ భాగంగా
telugubharathi.wordpress.com ( తెలుగు భారతి )
అనే మా సహచర బ్లాగులోని ” వేమన శతక సారం – 2 (121 )”
అనే పేజీలో ఇవ్వటం జరిగింది.)
********************************************************
201 తల్లిదండ్రులు :
******** **************
1 201
(2-461)
తల్లి గౌరి తనకు తండ్రియే శంభుండు
ప్రమథగణము లఖిల బాంధవులును
తనకు బుట్టినిల్లు తనరు కైలాసంబు
విశ్వదాభిరామ వినుర వేమ !
2 201
(3-110)
తల్లిదండ్రులందు దారిద్ర్యయుతులందు
నమ్మిన నిరుపేద నరుల యందు
.గురువు లందు జూడ భయభక్తు లమరిన
నిహము పరము గల్గు నెసగ వేమ.
203 గురువు :
******** *********
3 203
(1-154)
గురువు లేక విద్య గురుతుగా దొరకదు
నృపతి లేక భూమి తృప్తి గాదు
గురువు విద్య లేక గురుతర ద్విజుడౌనె?||విశ్వ||
205 సజ్జనులు :
******** ***********
4 205
(1-131)
పాల గలయు నీరు పాలెయై రాజిల్లు
నదియు సాంబ యోగ్యమైన యట్లు
సాధు సజ్జనముల సాంగత్యముల చేత
మూఢ జనుడు బుద్ధి మొనయు వేమ !
206 మిత్రులు :
******** *********
5 206
(2-138)
కానివాని తోటి కలసి వర్తించెనా
హాని వచ్చు నెంతవాని కైన
తాటి క్రింద పాలు తాగిన చందమౌ||విశ్వ||
304 మాతృభాష :
******** *************
6 304
(1-392)
కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు
యుప్పు లవణ మండ్రు యొకటి గాదె
భాష లింతె వేరు పరతత్త్వ మొక్కటి ||విశ్వ||
309 విద్య :
******** *******
7 309
(2-373)
వేద విద్య గాదు వీర విద్యయు గాదు
బాధ విద్య గాదు బరువు గాదు
మధురమైనయట్టి మనసు నిల్పెడి విద్య
యోగవిద్య యెన్న పరగ వేమ !
500 త్రికరణములు :
******** ***************
501 దేహం :
******** ********
8 501
(1-257)
తను వనేటి యింట తన శత్రు మిత్రుల
దెలియ లేని వాని తెలి వదేమి
తెలిసిన మనుజునకు దివ్యామృతంబురా|విశ్వ|
502 వాక్కు :
******** ********
9 502
(1-30)
అల్పుడెపుడు బల్కు నాడంబరము గాను
సజ్జనుండు బలుకు చల్ల గాను
కంచు మోగు నట్లు కనకంబు మోగునా |విశ్వ|
503 మనస్సు :
******** ***********
10 503
(1-22)
తన మది కపటము గలిగిన
తన వలెనే కపటముండు తగ జీవులకున్
తన మది కపటము విడచిన
తన కెవ్వడు కపటి లేడు ధరలో వేమా !
600 లోకరీతి :
******** ********
601 లోకరీతి – ప్రకృతి :
******** ******************
11 601
(1-120)
మొదట బోయు నీరు మొగి బీజముల కెక్కి
మొదటి కురుక వేగ మొలక లెత్తు
మొలక పృథివి బెరిగి వెలయును వృక్షంబు |విశ్వ|
12 601
(2-303)
పొట్లకాయ రాయి పొడిగి త్రాటను గట్ట
లీల తోడ వంక లేక పెరుగు
కుక్క తోక గట్ట చక్కగా వచ్చునా||విశ్వ||
604 లోకరీతి – మంచివారు :
******** ***********************
13 604
(1-101)
ఉత్తమోత్తముండు తత్త్వజ్ఞు డిలలోన
మహిమ జూపు వాడు మధ్యముండు
వేషధారి యుదర పోషకు డధముండు||విశ్వ||
14 604
(1-16)
ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ జూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా |విశ్వ|
15 604
(2-179)
శివు గుడిని దీప మిడినను
శివు మందిరమెల్ల వెలుగ జేయుట యరుదా?
శివ యోగి జ్ఞాన దీపము
భువనంబుల వెలుగ జేయు పొలుపుగ వేమా !
(విష్ణు భక్తులు ‘శివ’బదులుగా ‘హరి’ యని
చదువుకొన వచ్చును)
16 604
(2-41)
గుణ యుతునకు మేలు గోరంత జేసిన
కొండ యౌను వాని గుణము చేత
కొండకొద్ది మేలు గుణహీను డెరుగునా||విశ్వ||
607 లోకరీతి – రాజనీతి :
******** *******************
17 607
(3-36)
దాన ధర్మములును దయయు సత్యము నీతి
వినయ ధైర్య ధుర్య వితరణములు
రాజు పాలిటి కివి రాజ యోగంబులు||విశ్వ||
609 లోకరీతి – మానవ సామాన్యం :
******** *******************************
18 609
(1-191)
కానలేడు నుదురు కర్ణముల్ వీపును
నెరులు గాన లేడు నెత్తి మీద
తన్ను గాన లేడు, తత్త్వ మే మెరుగును!||విశ్వ||
19 609
(1-155)
అల్ప సుఖము లెల్ల నాశించి మనుజుండు
బహుళ దుఃఖములను బాధ పడును
పర సుఖంబు నొంది బ్రతుకంగ నేరడు|విశ్వ|
20 609
(1-100)
కడుపు నిండ సుధను గ్రమముతో ద్రావిన
పాల మీద నేల పారు మనసు ?
తత్త్వ మెరుగ వెనుక తత్త్వంబు లేటికో?|విశ్వ|
700 దృక్పథం ( Attitude & Outlook ) :
******** ************************************
701 నిత్య సత్యాలు, న్యాయాలు (eternal truths& laws) :
******** **************************************************
21 701
(1-190) :
పని తొడవులు వేఱు, బంగార మొక్కటి
పరగ ఘటలు వేఱు, ప్రాణ మొకటి
యరయ తిండ్లు వేఱు, యాకలి యొక్కటి||విశ్వ||
705 దృక్పథం ( Attitude & Outlook ) :
******** ************************************
22 705
(3-224)
పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు
మాట కన్న నెంచ మనసు దృఢము
కులము కన్న మిగుల గుణమె ప్రధానంబు||విశ్వ||
23 705
(1-356స)
వినని వానికన్న విన్నవా డధికుండు,
విన్నవాని కంటె కన్నవాడు
కన్నవాని కంటె కలయువా డధికుండు |విశ్వ|
24 705
(1-91)
అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగ తినగ వేము తీపి నుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన||విశ్వ||
25 705
(1-103)
గంగి గోవు పాలు గంటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు|విశ్వ|
26 705
(3-151)
పెట్టినంత ఫలము పెక్కండ్ర కుపహతి
జేయకున్న, దాను జెరుపకున్న
పెండ్లి సేయు నట్టి పెద్ద ఫలంబురా |విశ్వ|
706 సుగుణాలు (good qualities) :
******** ****************************
27 706
(2-345)
పరుల కుపకరించి పరుసొమ్ము పరునకు
పరగ నిచ్చెనేని పరము గలిగె
పరము కన్న నేమి పావనమా సొమ్ము?||విశ్వ||
28 706
(3-131)
దిక్కు లేని రోగి దీనత బాపిన
పురుషు డిహము నందు పూజ్యు డగును
పరము నందు వాని భాగ్య మేమనవచ్చు||విశ్వ||
707 దుర్గుణాలు ( bad qualities) :
******** ****************************
29 707
(1-63)
తన గుణము తనకు నుండగ
నెనయంగా నొరుని గుణము నెంచును మదిలో
తన గుణము తాను దెలియక
బరు నిందం జేయు వాడు భ్రష్టుడు వేమా!
800 ప్రవర్తన – నడవడిక: ( conduct and behaviour ) :
******** ************************************************
802 చెడ్డ అలవాట్లు ( bad habits ), :
******** ******************************
30 802
(2-156)
పరుల మోస పుచ్చి ధర ధన మార్జించి
కడుపు నించుకొనుట కాని పద్దు
ఋణము సేయు మనుజు డెక్కువ కెక్కునా||విశ్వ|
805 నీతులు ( వ్యవహారం ) :
******** ***********************
31 805
(1-24)
తామసించి సేయతగ దెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమ మగును
పచ్చి కాయ దెచ్చి పడవేయ ఫలమౌనె? ||విశ్వ||
32 805
(1-26)
నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు
బైట కుక్క చేత భంగపడును
స్థాన బలిమి గాని తన బలిమి కాదయా |విశ్వ|`
33 805
(1-21)
అనువుగాని చోట నధికుల మనరాదు
కొంచె ముండుటెల్ల కొదువ గాదు
కొండ యద్దమందు కొంచెమై యుండదా ? |విశ్వ|
34 805
(2-35)
తనదు నృపతి తోడ తన యాయుధము తోడ
నగ్ని తోడ పరుల యాలి తోడ
హాస్య మాడుటెల్ల ప్రాణాంతమౌ సుమ్ము|విశ్వ|
35 805
(3-107)
హీన నరుల తోడ నింతుల తోడను
పడుచువాండ్ర తోడ ప్రభువు తోడ
ప్రాజ్న జనులతోడ బ్రహ్మజ్న జనులతో
వైపు దెలసి పలుక వలయు వేమ!
1000 చతుర్విధ పురుషార్థాలు ( ధర్మార్థకామమోక్షాలు ) :
******** *************************************************
1010 ధర్మం ( శాంతి, సామరస్యం ) :
******** *****************************
36 1010
(1-67)
చిత్తశుద్ధి గల్గి చేసిన పుణ్యంబు
కొంచె మైన నదియు కొదువ గాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత||విశ్వ||
37 1010
(3-17)
ఇరుగు పొరుగు వారి కెనయు సంపద జూచి
తమకు లేదటన్న ధర్మమేమి?
ధర్మమన్న తొల్లి దన్నుక చచ్చిరి
కర్మఫలము నేడు గలిగె వేమ !
38 1010
(2-153)
ధార్మికునకు గాని ధర్మంబు గనరాదు
కష్టజీవి కెట్లు గానబడును
నీరు జొరక లోతు నిజముగా దెలియదు||విశ్వ||
1011 ధర్మాలు విశేష ( ప్రత్యేక ) :
********** *******************************
39 1011
(1-85)
సత్య మమరి యుండ, జ్ఞాన మమరి యుండు
జ్ఞాన మమరి యుండ సత్యముండు
జ్ఞాన సత్యములును సమమైన ద్విజుడగు||విశ్వ||
1050 అర్థం ( ధనం, సంపాదన ) :
******** **************************
40 1050
(3-6)
ధనమే మూలము జగతికి
ధనమే మూలంబు సకల ధర్మంబులకున్
గొనమే మూలము సిరులకు
మనమే మూలంబు ముక్తి మహిమకు వేమా !
41 1050
(3-22)
తాము గడన సేయు ధనము తమది యని
నమ్మి యుండ్రు వెర్రి నరులు భువిని
తాము నొకరి కిచ్చు ధన మింతియే కాక
కడమది తమ కేల కలుగు వేమ !
42 1050
(3-100)
ఏమి గొంచు వచ్చె నేమి దా గొనిపోవు
పుట్టువేళ నరుడు గిట్టువేళ
ధనము లెచటి కేగు దా నేగు నెచటికి?|విశ్వ|
43 1050
(3-26)
ధనవిహీనుడైన తండ్రి గర్భంబున
భాగ్య పురుషు డొకడు పరగ బుట్టి
బహుళ ధనము గలిగి భద్ర మార్గంబున
పరుల కుపకరించి ప్రబలు వేమ !
1060 కామం (కోరిక, ఆశ, ధన వినియోగం ) :
******** *************************************
44 1060
(1-53)
నీళ్ళలోని చేప నెరి మాంస మాశకు
గాల మందు జిక్కి గూలి్నట్లు
యాశ బుట్టి మనుజు డారీతి జెడిపోవు |విశ్వ|
1080 మోక్షం ( సర్వాధిక ఆనందం ) :
******** ******************************
45 1080
(2-312స)
సుఖము లంతమందు చూడంగ దుఃఖంబు
సుఖములును కష్ట పూర్వకములు
దుఃఖస్పర్శ లేని సుఖమన్న మోక్షమే !
1310 స్త్రీలకు ప్రత్యేక విషయాలు :
******** *****************************
46 1310
(1-71)
గుణవతి యగు యువతి – గృహము చక్కగ నుండు
చీకటింట దివ్వె చెలగు రీతి
దేవి యున్న యిల్లు-దేవార్చన గృహంబు||విశ్వ||
1700 మతం :
******** ********
47 1700
(2-53)
మొదల తన మతము వదలక
తుద నెవ్వరి మతమునైన దూషింపకయున్
బదిలుడయి కోర్కి గోరక
ముదమున జరియించు వాడె ముఖ్యుడు వేమా!
1710 హిందూ మతం ( సనాతన ధర్మం ): :
******** **********************************
48 1710
(2-399)
శైవ వైష్ణవాది షణ్మతంబుల కెల్ల
దేవుడొక్కడనుచు దెలియ లేరు
తమకు భేదమయిన తత్త్వంబు భేదమా ! ||విశ్వ||
2300 మోక్ష సాధనా మార్గాలు :
******** *************************
2310 కర్మయోగం :
******** *************
49 2310
(3-205)
వ్రాత వెంట గాని వరమీడు దైవంబు
సేత కొలది గాని వ్రాత గాదు
వ్రాత కజుడు కర్త సేతకు దా కర్త!|విశ్వ|
2320 ధ్యానయోగం :
******** **************
50 2320
(3-7)
కడగి గాలి లేని గగనంబు భంగిని
బలు తరగలు లేని జలధి మాడ్కి
నిర్వికారమునను నిశ్చలత్వమున దా
నుండెనేని ముక్తి యొనరు వేమా!
2330 భక్తియోగం :
******** ************
51 2330
(2-214)
దేవ పూజ సేయ దివ్య భోగము గల్గు
తత్త్వ మెరిగెనేని దైవ సముడె
యేమి లేని నరున కేగతి లేదుర||విశ్వ|
52 2330
(1-189)
పసుల వన్నె వేఱు, పాలేక వర్ణమౌ
పుష్పజాతి వేఱు, పూజ యొకటి
దర్శనంబు వేఱు, దైవంబు యొక్కటి!||విశ్వ||
53 2330
(3-45)
మంట లోహమందు మాకుల శిలలందు
పటము గోడలందు ప్రతిమలందు
తన్ను దెలుసుకొరకు తగలదా పరమాత్మ!||విశ్వ||
54 2330
(1-222)
మరియు దధిని ఘృతము, మానులం దనలంబు,
చారు సుమము లందు సౌరభంబు,
తిలల తైలమట్ల దేజరిల్లు జిదాత్మ||విశ్వ||
55 2330
(2-205)
కడక నఖిలమునకు నడి నాళ మందున్న
వేగు చుక్క వంటి వెలుగు దిక్కు
వెల్గు కన్న దిక్కు వేరెవ్వ రున్నారు||విశ్వ||
2340 జ్ఞానయోగం :
******** *************
56 2340
(1-223)
తరువ తరువ బుట్టు తరువున ననలంబు
తరువ తరువ బుట్టు దధిని ఘృతము
తలప తలప బుట్టు తనువున తత్త్వంబు||విశ్వ||
57 2344
(3-41)
సకలాకారు డనంతుడు
సకలాత్మల యందు సర్వ సాక్షియు దానై
సకలమున నిర్వికారుం
డకలంక స్థితిని బ్రహ్మ మనబడు వేమా !
58 2345
(1-221)
ఏక బ్రహ్మము నిత్యము
వైకల్పిక మైన యట్టి వస్తువు లెల్లన్
యేకత్వంబని యెరిగిన
శోకములే కల్ల! ముక్తి సులభము వేమా !
*******************************************
11:16 పూర్వాహ్నం వద్ద సెప్టెంబరు 6, 2008 |
jhgdfsfjkbvhkfyc fuhygkfugyfwek dkjefhiou