(301B) నామ స్మరణకు వివిధ దేవతా నామావళి.

భారతీయుల నరనరాల లోను దైవీ భావన నిండి ఉంటుంది. ఇష్ట దైవాలు వేరు కావచ్చు; కాని దైవానుగ్రహం కోసం ప్రయత్నం అందరూ చేస్తారు. వాటి అన్నింటిలోకీ, ఎటువంటి నియమాల బాదరబందీ లేకుండా సర్వకాల సర్వావస్థల లోను ఎవరైనా సరే తమ తమ ఇష్ట దైవంతో భక్తి పూర్వక సంబంధం ఏర్పరచుకోగల  గొప్ప సాధనం ” నామ స్మరణం”.

భగవన్నామాలను భక్తిభావనతో రంగరించి, మనం హాయిగా ఆవృత్తి చేసుకోవటానికి వీలుగా, ఒక లయతో, ఛందోబధ్ధంగా శ్లోక, పద్య మకుటాలుగానో పాదాలుగానో కూర్చి మనకు అందించిన మహర్షులకూ, భక్త కవులకూ, వాగ్గెయ కారులకూ శత కోటి వందనాలు !

అలాంటి వాటిలో లభ్యమైన వాటిని క్రమ క్రమంగా మీ ముందు ఉంచే ప్రయత్నం కొనసాగిస్తాం. మీరు సేకరించిన పరిమళ కుసుమాలను కూడా అందజేస్తే, పదిమందికీ మేలు చేసిన వారౌతారు !  ఈ క్రింది నామాలలోనుంచి అనువైన ఒక పాదాన్ని గాని, అర్ధ పాదం గాని, ఒక నామం గాని ఎంచుకోవచ్చు.

ముఖ్యంగా చిన్న పిల్లలకు ఒక ఇష్ట దైవాన్ని ఎంచుకోమని చెప్పి, ఆ దైవానికి సంబంధించిన, వారి నోటికి పట్టే, మనసుకు నచ్చే ఒక్కనామాన్ని అలవాటు చేస్తే, వారు పెద్దవారు అయ్యే సరికి కొన్ని లక్షల నామ స్మరణం పూర్తి అయి, పురాణ గాథలలో వలె భగవంతుని కృపకు విశేష పాత్రులు కాగలరు !

(1)శివ నామం:
హర నమః పార్వతీ పతయే | హర హర మహాదేవ ||
హర హర మహాదేవ | శంభో శంకర పాహి మామ్ ||

శంకర శివా శంకర శివా ! శంభో మహాదేవ శంకర శివా !

శివ శంకర మామవ ! పార్వతీ పతే !
సాంబ సదాశివ శంభో శంకర|శరణం మే తవ చరణ యుగమ్|
నమో నమ శ్శంకర పార్వతీభ్యామ్ ||
నమ శ్శివాయై చ నమ శ్శివాయ ||
దారిద్ర్య దుఃఖ దహనాయ | నమ శ్శివాయ ||

 శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో||

వారాణసీ పురపతిం | భజ విశ్వనాథమ్ !

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహి మాం |
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్ష మాం |
చంద్రశేఖర మాశ్రయే  మమ కిం కరిష్యతి వై యమః ?
శంభో తవారాధనం |
శివార్పణం |
మహేశ్వర ! వామదేవ ! విష్ణువల్లభ ! అంబికానాథ !శ్రీకంఠ ! భక్తవత్సల !
త్రిలోకేశ ! గంగాధర ! లలాటాక్ష ! మహాకాల !  కాలకాల ! కృపానిధే !
జటాధర ! కైలాసవాస ! త్రిపురాన్తక ! వృషభారూఢ ! భస్మోధ్ధూళిత విగ్రహ !
సర్వమయ ! త్రయీమూర్తే ! అనీశ్వర ! సర్వజ్న! సదాశివ ! విశ్వేశ్వర !
వీరభద్ర ! గిరిజాపతే ! భుజంగభూషణ ! భర్గ ! భగవన్ ! మృత్యుంజయ !

జగద్వ్యాపిన్ ! జగద్గురో ! భూతపతే ! శాశ్వత ! పశుపతే ! మహాదేవ ! హర !
అనన్త ! స్వయంప్రకాశ !
పరమేశ్వర ! పరాత్పర ! పరంధామ ! పరంజ్యోతి !  పరంబ్రహ్మ !  పరమాత్మ !

సచ్చిదానంద స్వరూప !

తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం| శ్రీ దక్షిణామూర్తయే !
తదేకొ2వశిష్టః | శివః కేవలో2హమ్ ||
చిదానన్ద రూపః శివో2హం శివో2హమ్ ||

 

(2)శ్రీదేవీ నామస్మరణం:
శ్రీమాత్రే నమః |
మాం పాహి మీనాంబికే !
గౌరీమంబాం అంబురుహాక్షీం అహమీడే |
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజ రాజేశ్వరీ !

(౩)శ్రీ విష్ణు నామస్మరణం:

నారాయణ ! గోవిన్ద ! త్రివిక్రమ ! శ్రీధర ! దామోదర ! వాసుదేవ ! అనిరుధ్ధ !
పురుషోత్తమ ! నారసింహ ! అచ్యుత ! జనార్దన ! శ్రీహరే !
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః |

 లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ |

కృష్ణం వన్దే జగద్గురుమ్ |

హరే కృష్ణ హరే కృష్ణ   |  కృష్ణ కృష్ణ హరే హరే   ||

హరే రామ హరే రామ |  రామ రామ హరే హరే ||
శ్రీ రామ జయ రామ | జయ జయ రామ ||

శ్రీరామః శరణం మమ |
శ్రీ రామ రక్ష |  సర్వ జగద్రక్ష |

శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః |
దాశరథీ కరుణా పయోనిధీ !

రామార్పణం |

(4) శ్రీ హనుమన్నామం:
 

జయ రామభక్త హనుమాన్ |
జయ రామదూత హనుమాన్ |
జయ బుధ్ధిమంత హనుమాన్ |
జయ వీరాంజనేయ |
జయ ప్రసన్నాంజనెయ |
జయ అభయాంజనేయ |

ప్రత్యుత్తరమిమ్ము