(1101A) కృష్ణ శతక సారం (12+6 ) పద్యాలు )

శ్రీరామ

“కృష్ణ శతకం ” భక్తి రస మాధుర్యానికి పెట్టింది పేరు! అతి చిన్న

పిల్లలకు కూడ నోఱు తిరిగేటంతటి పదలాలిత్యం!

ఆస్వాదింప జేయండి!

*************************

2330 భక్తియోగం :
2334 నిర్గుణ స్తోత్రాలు
2335 సగుణ స్తోత్రాలు ;

1 2334
2
నీవే తల్లివి దండ్రివి

నీవే నా తోడునీడ నీవే సఖుడౌ

నీవే గురుడవు దైవము

నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా !

2 2334
9
ఓ కారుణ్య పయోనిధి !

నాకాధారంబ వగుచు నయముగ బ్రోవన్ |

నాకేల యితర చింతలు

నాకాధిప వినుత ! లోకనాయక కృష్ణా !

3 2335
36
అగణిత వైభవ! కేశవ!

నగధర! వనమాలి! యాదినారాయణ! యో

భగవంతుడ! శ్రీమంతుడ!

జగదీశ్వర! శరణు శరణు శరణము కృష్ణా!

4 2334
10
వేదంబులు గననేరని

ఆది పరబ్రహ్మమూర్తి వనఘ మురారీ!

నా దిక్కు చూచి గావుము

నీ దిక్కే నమ్మినాడ నిజముగ కృష్ణా!

5 2335
21
అండజవాహన! విను బ్ర

హ్మాండంబుల బంతులట్ల యాడెడి నీవా

కొండల నెత్తితి వందురు

కొండిక పని గాక దొడ్డకొండా కృష్ణా!

6 2334
33
చుక్కల నెన్నగ వచ్చును

గ్రక్కున భూరేణువులను గణుతింప నగున్

జొక్కపు నీ గుణజాలము

నక్కజమగు లెక్కపెట్ట నజునకు కృష్ణా!

7 2334
78
గ్రహభయ దోషము లొందవు

బహు పీడలు చేర వెఱచు పాయును నఘముల్

ఇహపర ఫలదాయక! విను

తహతహ లెక్కడివి నిన్ను దలచిన కృష్ణా!

8 2335
66
బలమెవ్వడు కఱి బ్రోవను

బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్ |

బలమెవ్వడు సుగ్రీవుకు

బలమెవ్వడు నాకు నీవె బలమౌ కృష్ణా !

9 2335
14
అందెలు గజ్జెలు మ్రోయగ

చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా

నందుని సతి యా గోపిక

ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా!

10 2334
92
దండమయా ! విశ్వంభర !

దండమయా ! పుండరీక దళనేత్ర హరీ !

దండమయా ! కరుణానిధి !

దండమయా ! నీకు నెపుడు దండము కృష్ణా !

11 2334
82
నీ నామము భవహరణము

నీ నామము సర్వసౌఖ్య నివహ కరంబున్

నీ నామ మమృత పూర్ణము

నీ నామము నే దలంతు నిత్యము కృష్ణా!

12 2335
95
సర్వేశ్వర ! చక్రాయుధ !

శర్వాణీ వినుత నామ ! జగదభిరామా !

నిర్వాణనాథ ! మాధవ !

సర్వాత్మక ! నన్ను గావు సదయత కృష్ణా !

******** ***********************

13 2335
1
శ్రీ రుక్మిణీశ ! కేశవ !

నారద సంగీత లోల ! నగధర ! శౌరీ !

ద్వారక నిలయ ! జనార్దన !

కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా !

14 2335
3
నారాయణ! పరమేశ్వర!

ధారాధర నీలదేహ! దానవ వైరీ!

క్షీరాబ్ధిశయన యదుకుల

వీరా! నను గావు కరుణ వెలయగ కృష్ణా!

15 2335
27
జయమును విజయున కియ్యవె

హయములు ములుకోల మోపి యదలించి మహా

రయమున రొప్పవె తేరును

భయమున రిపుసేన విఱిగి పాఱగ కృష్ణా!

16 2335
56
పురుషోత్తమ! లక్ష్మీపతి!

సరసిజగర్భాది మౌని సన్నుత చరితా!

మురభంజన! సురరంజన!

వరదుడవగు నాకు భక్తవత్సల! కృష్ణా!

17 2335
61
గజరాజవరద! కేశవ!

త్రిజగత్ కల్యాణమూర్తి! దేవ! మురారీ!

భుజగేంద్రశయన! మాధవ!

విజయాప్తుడ! నన్ను గావు వేగమె కృష్ణా!

18 2334
100
కందర్పకోటి సుందర!

మందరధర! భానుతేజ! మంజులదేహా!

సుందర విగ్రహ! మునిగణ

వందిత! మిము దలతు భక్తవత్సల! కృష్ణా!

* * * * *

(సూచన: ప్రపంచం మొత్తం మీద తెలుగు భాష అర్థమయ్యే

సర్వ మానవులూ చేయదగిన నిత్య ప్రార్థనగా,

2వ పద్యము “నీవే తల్లివి దండ్రివి..” చివర

“కృష్ణా!” అనే నామం చోటులో- ఎవరి ఇష్ట దైవం పేరును

వారు రెండక్షరాలలో( నాలుగు మాత్రలలో )

చేర్చుకొనవచ్చును !

ఉదా:- రామా,శంభో,దేవా,దేవీ, అల్లా, యేసూ, …)

* * * * *

2 స్పందనలు to “(1101A) కృష్ణ శతక సారం (12+6 ) పద్యాలు )”

  1. Asooryampasya అన్నారు:

    కృష్ణ శతకం – వికీసోర్సు లో పెట్టబడుతూ ఉంది… మీరు దానికి ఇక్కడ లంకె ఇస్తే చాలు… మీకు ఇదంతా టైపింగ్ శ్రమ అని…చెబుతున్నాను :)

    te.wikisource.org/wiki/కృష్ణ_శతకము
    Thank you, Asooryampasya ! Due to temporary problem in my system in typing telugu script , I am replying in English. A good suggestion. Will be followed. However, our aim is to provide not the entire text, but to give only a slect few poems, selected to suit the age and cultural requirements of Elementary-school going children; and to provide that essence in well arranged order, readily referable, and copy printable. The objective is to enable and encourage recitation (getting by heart) of gems of poems by kids.
    You will be able to appreciate this focussed effort if you visit the Page “VEMANA SATAKAM’ in the same blog. Thanking you.

  2. RAJANISH SEKHAR.T.TONPE అన్నారు:

    Manchi web site. Manchi aalochana. Desa bhashalandu telugu lessa!

ప్రత్యుత్తరమిమ్ము