(00)”కంఠస్థ రత్న మాలిక ” గురించి
(Kindly Note : In case the Telugu script appears jumbled here,
(1) Please open this web site through Internet Explorer .
( Mizilla Firefox is giving distortion of the font selected.)
Or, (2) you may select the required page, copy and paste into Wordpad or Notepad and view in required format, which was originally set as “Gautami – bold – 14 “)
ప్రియమైన తల్లిదండ్రులారా!
అభివందనములు !
-
అల్పాక్షరములలో అనల్పార్థమును నిక్షిప్తం చేయటమే ఉత్తమ సాహిత్యం యొక్క లక్షణం.
-
కంఠస్థం చేయటానికీ, చాలా కాలం తరువాత జ్ఞాపకం చేసుకోవటానికీ ఛందోబధ్ధమైన పద్య సాహిత్యం ఎంతో అనుకూలం.
-
చిన్నవయసులోనే కంఠస్థం చేసిన విద్య జీవితాంతం గుర్తుండి పోతుంది.
-
నీతులు, సామెతలు, సూక్తులు, వ్యవహార పధ్ధతి, ధోరణులు, దృక్పథాలు, సంస్కారం (mind-culture), భక్తి స్తోత్రాలు, ఆధ్యాత్మిక విషయాలు మొ || సమయోచితంగా స్ఫురిస్తుంటే, వ్యక్తిత్వ వికాసానికి (PERSONALITY DEVELOPMENT) కి ఇంతకంటే కావలసిందేముంటుంది?
-
సాంస్కృతిక విలువల పునాది ఉన్న పిల్లలు, విదేశాలకు వెళ్ళినా, భారతీయతకు గౌరవం తెచ్చేవిధంగా ఉంటారు.
-
ఈ విషయాలన్నీ మాతృభాషలో అయితే సులభంగా, పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు.
-
భారతీయ భాషలన్నిటికీ మూలం సంస్కృత భాష.
-
అక్షరాల వర్ణమాలలో గాని, ఉచ్చారణలో గాని, ఎక్కువ సంస్కృత పదాలని తనలో కలుపుకోవటంలో గాని-తెలుగుభాష సంస్కృతానికి అత్యంత సన్నిహితం.
-
వేలాది సంవత్సరాలుగా జీవనదిలా ప్రవహిస్తూ వస్తూన్న మన భారతీయ సంస్కృతి మూలాలు సంస్కృతభాష లోనే ఉన్నాయి గదా!
-
అందుకనే సంస్కృత శ్లోకాలు, సూక్తులు కూడ పిల్లలకు నేర్పించటం వారి మానసిక పరిణతికి అత్యవసరం.
-
కంఠస్థం చేసే శక్తి, సమయం పరిమితం కనుక ప్రామాణిక గ్రంథాలనుంచి పిల్లలకు అవసరమైన అంశాలు మాత్రం సేకరించి అందించాలి.
-
పద్య గద్య రత్నములను సేకరించి, కూర్చి “కంఠస్థ రత్నమాలిక” గా మీకు అందించే బాధ్యత మాది !
-
దానిని పిల్లల కంఠాలకు అలంకరించే బాధ్యత మీది !
-
మిలమిల మెరిసే భాగ్యం మీ పిల్లలది !
-
అమ్మ స్వయంగా నేర్పించితే, ఆ తల్లీబిడ్డల అనుబంధం ఎంత హృదయంగమం !
-
తల్లికి కుదరక పోతే తండ్రి.
-
ఇద్దరికీ కుదరక పోతే, పేరెంట్స్‌గా స్కూలు మేనేజ్‌మెంట్‌తో మాట్లాడవచ్చు- అందరికీ అవసరమైన విషయమే గాబట్టి- కనీసం వారానికి ఒక పీరియడైనా ఈ మానసిక వికాసానికై కేటాయించమని !
-
అదీ కుదరక పోతే ఇక భాషా ఉపాధ్యాయులతో ట్యూషన్ చెప్పించడం.
-
అవసరాన్ని గ్రహిస్తే – ఖర్చు, శ్రమ ఎంతైనా వెనుదీయక పోవటం మనకు చేతనయినదే గదా !
-
శుభస్య శీఘ్రమ్ !
10:05 పూర్వాహ్నం వద్ద నవంబరు 30, 2008 |
manchi prayatnam abhinandanalu. ade darilo ma prayatnamu. kalisi naduddamu.